అన్వేషించండి

Herbal Supplements : ‘సహజమైనవి’ అని నమ్మి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? కాలేయం, మూత్రపిండాలకు ప్రమాదమే

Natural Supplements : సహజమైన, మూలికలతో కూడిన సప్లిమెంట్లు సురక్షితం కాకపోవచ్చని.. అవి కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటిలో నిజమెంతా?

Dietary Supplements Health Risks : సహజమైన సప్లిమెంట్లుగా చెప్పబడే వాటిని వైద్యుల సలహా లేకుంటే తీసుకుంటే కాలేయ-మూత్రపిండాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్తున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. "సహజమైనది" అని లేబుల్ చేసినంత మాత్రానా అది సురక్షితంగా ఉంటుందనుకోవడం కరెక్ట్ కాదని తాజా అధ్యయనం తెలిపింది. ఈ స్టడీలో బయటపడిన విషయాలు ఏంటో.. శాస్త్రవేత్తలు ఏమి సూచిస్తున్నారో చూసేద్దాం. 

అధ్యయనంలో షాకింగ్ విషయాలు

సప్లిమెంట్స్ అనేవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా పోషకాహార లోపాలను భర్తీ చేయడానికి చాలామంది తీసుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో సప్లిమెంట్స్ కూడా సహజమైనవి అంటూ మూలికా, ఆహార పదార్ధాలతో తయారు చేసి ప్రమోట్ చేస్తున్నారు. అలా తీసుకునే సప్లిమెంట్స్ కాలేయ, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాలను పెంచుతున్నాయని యునైటెడ్ స్టేట్స్‌లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.

మూలికా, ఆహార పదార్ధాలను ఆహార ఉత్పత్తులుగా వర్గీకరిస్తూ ఈ అధ్యయనం హైలైట్ చేశారు. అంటే అవి ఆహారం తీసుకోవడంలో మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించినవని తెలిపారు. ఈ తరహా సప్లిమెంట్లు కొన్ని సందర్భాల్లో.. కొన్ని సప్లిమెంట్లు ముఖ్యమైన అవయవాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. అలాంటి సహజమైన సప్లిమెంట్లకు ఉదాహరణ ఏంటో చూసేద్దాం. 

గ్రీన్ టీ 

ఒక కప్పు గ్రీన్ టీ సురక్షితమైనదిగా పరిగణిస్తారు. అయితే హెర్బల్ గ్రీన్ టీలు కథ వేరే అంటున్నారు. క్లినికల్ లివర్ డిసీజ్ జర్నల్ ప్రకారం.. ఈ సప్లిమెంట్లలో అధిక స్థాయిలో కాటెచిన్లు, ముఖ్యంగా ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ (EGCG) ఉంటాయంటున్నారు. అధిక మొత్తంలో EGCG కాలేయ వాపు, తీవ్రమైన కాలేయ సమస్యలతో ముడిపడి ఉందని గుర్తించారు. ఇప్పటికే కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని చెప్తున్నారు.

ప్రోటీన్ పౌడర్లు

బాడీబిల్డర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల వల్ల ప్రోటీన్ సప్లిమెంట్లు బాగా ప్రసిద్ధి చెందాయి. కానీ వైద్య పర్యవేక్షణ లేకుండా వాటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అధిక ప్రోటీన్ శరీరంలో నత్రజని వ్యర్థాలను పెంచి.. మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా మూత్రపిండాల పనితీరు తగ్గిన వారిపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అవసరం అయినప్పటికీ.. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు అంటున్నారు.

కొవ్వులో కరిగే విటమిన్లు (A, D, E, K)

నీటిలో కరిగే విటమిన్ల మాదిరిగా కాకుండా.. కొవ్వులో కరిగే విటమిన్లు కణజాలాలలో పేరుకుపోతాయి. విటమిన్లు A, D, E, K కాలేయం, కొవ్వు కణజాలాలలో నిల్వ అవుతాయి. అంటే కాలక్రమేణా అధికంగా తీసుకోవడం పెరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ ఎ అధిక మోతాదులో కాలేయంపై ఒత్తిడి తెచ్చి విషప్రక్రియకు దారితీయవచ్చు. విటమిన్ డి అదుపు లేకుండా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. 

ఐరన్ సప్లిమెంట్స్

శరీరానికి ఐరన్ చాలా అవసరం. కానీ అధికంగా తీసుకోవడం హానికరం. లోపం లేకుండా ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఐరన్ ఓవర్‌లోడ్‌ అవుతుంది. స్టాట్‌పెర్ల్స్ జర్నల్ ప్రకారం.. కాలేయంతో సహా శరీర కణజాలాలలో అదనపు ఐరన్ పేరుకుపోయినప్పుడు హిమోక్రోమాటోసిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అవయవ పనితీరును దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. 

మూలికా నివారణలు

హెర్బల్ అంటే హానిచేయనిది అని అర్థం కాదు. కొన్ని సాంప్రదాయ నివారణలు కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కామ్‌ఫ్రేలో తీవ్రమైన కాలేయ నష్టాన్ని కలిగించే సమ్మేళనాలు ఉంటాయి. రుతువిరతి లక్షణాలకు ఉపయోగించే బ్లాక్ కోహోష్, కాలేయ సంబంధిత దుష్ప్రభావాలతో ముడిపడి ఉంది. బరువు తగ్గించే ఉత్పత్తులలోని గార్సినియా క్యాంబోజియా కూడా ఇబ్బంది కలిగిస్తుంది. 

ఇవే కాకుండా లికోరైస్ రూట్ కూడా బీపీని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని చెప్తున్నారు. డీటాక్స్, కొవ్వును కాల్చే సప్లిమెంట్లు త్వరిత ఫలితాలను ఇస్తాయి. అయితే దీర్ఘకాలిక సమస్యలను కూడా పెంచుతాయి. 

సప్లిమెంట్లు కరెక్ట్గా ఉపయోగిస్తే ఆరోగ్యానికి తోడ్పడతాయి. కానీ అవి ప్రమాద రహితమైనవి కావు. కానీ ఉత్పత్తిపై "సహజమైనది" అనే లేబుల్ చూసి ఎలాంటి వైద్య సూచన లేకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుందని ఆరోగ్య సంరక్షణ నిపుణులు చెప్తున్నారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget