ఖర్జూరం అసలైనదో, నకలీదో ఇలా తెలుసుకోండి.. ట్రిక్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

ఖర్జూరం విటమిన్లు, మినరల్స్, ఫైబర్లకు నిధి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

అయితే వీటిలో అసలైనవి ఏంటో.. నకలీవి ఏంటో ఎలా గుర్తించాలో ఇప్పుడు చూసేద్దాం.

అత్యుత్తమ నాణ్యత కలిగిన అసలైన ఖర్జూరం రంగు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎక్కడా మచ్చలు ఉండవు.

అసలైన ఖర్జూరంను నీటిలో వేస్తే రంగు మారదు. నకిలీ ఖర్జూరం అయితే వెంటనే నీటి రంగు మారుస్తుంది.

సహజమైన ఖర్జూరం బయట కంటే లోపల తీపిగా ఉంటుంది. ఇది దాని స్వచ్ఛతకు సంకేతం.

నకిలీ ఖర్జూరాలను మెరిసేలా మరియు తీపిగా చేయడానికి పైన చక్కెర లేదా బెల్లం పాకం పూస్తారు.

అసలైన ఖర్జూరం చూడటానికి దళసరిగా, బరువుగా ఉంటుంది. నకిలీ ఖర్జూరం తేలికగా, పలుచగా ఉంటుంది.

ఖర్జూరం చాలా జిగటగా, తడిగా లేదా చాలా పొడిగా అనిపిస్తే.. అది తక్కువ నాణ్యతతో ఉండే అవకాశం ఉంది.

ఇవి కేవలం అవగాహన కోసమే.