అన్వేషించండి

Detox Tips for Lungs : స్మోకింగ్ తర్వాత ఊపిరితిత్తులను డీటాక్స్ చేయగలమా? లంగ్స్ హెల్తీగా ఉంచే సింపుల్ టిప్స్

Smoking Damages Your Lungs : స్మోకింగ్ ఊపిరితిత్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపించి.. వాపు, కఫం పెరిగేలా చేస్తుంది. అయితే లంగ్స్​ను డీటాక్స్ చేసి.. హెల్తీగా ఉంచే టిప్స్ ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ధూమపానం ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • శ్వాసనాళాలలో వాపు, కఫం చేరడం శ్వాస సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
  • వ్యాయామం, నీరు, ఆవిరి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • ఆరోగ్యకరమైన జీవనశైలి, యాంటీఆక్సిడెంట్ ఆహారాలు ఊపిరితిత్తుల వాపును తగ్గిస్తాయి.

Lungs Health : ఈ రోజుల్లో ధూమపానం ఊపిరితిత్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అలవాటుగా మారింది. ఫ్యాషన్, స్ట్రెస్​ పేరుతో ఆడా, మగ తేడా లేకుండా చాలామంది సిగరెట్లు తాగుతున్నారు. ఒక వ్యక్తి స్మోకింగ్ చేసినప్పుడు, స్మోకింగ్ చేస్తున్నవారి దగ్గర ఉన్నప్పుడు.. వారి ఊపిరితిత్తులు పొగతో పాటు విషపూరిత రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. 

స్మోకింగ్, కాలుష్యం వల్ల శ్వాసనాళాలలో వాపు, కఫం పేరుకుపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ శోషణ క్రమంగా తగ్గుతుంది. మరి సిగరెట్లు లేదా బీడీలు వంటి పొగాకు తాగే వారు.. ఊపిరితిత్తులను డీటాక్స్ చేసుకోవచ్చా? లేదా వాటిని పూర్తిగా శుభ్రపరిచే పద్ధతి ఏమైనా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

లైఫ్​స్టైల్ మాత్రమే హెల్ప్ చేస్తుంది..

వాస్తవానికి ఊపిరితిత్తులను ఏ ద్రవంతోనూ లేదా డ్రింక్​తోనూ శుభ్రపరచలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే సరైన అలవాట్లు, జీవనశైలి ద్వారా.. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని చెప్తున్నారు. లంగ్స్​లో పేరుకుపోయిన వ్యర్థాలను చాలా వరకు తొలగించుకోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. అవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎలా హెల్ప్ అవుతాయో చూసేద్దాం. 

స్మోకింగ్ వల్ల శ్వాసనాళాలలో వాపు, కఫం పేరుకుపోతుంది. దీనివల్ల శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే ధూమపానం చేసేవారు తరచుగా దగ్గు, ఆయాసం, ఛాతిలో బిగువు వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఎక్కువకాలం స్మోకింగ్ చేస్తే.. తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే స్మోకింగ్ మానేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

స్మోకింగ్ మానేస్తే..

వైద్యుల ప్రకారం.. శరీరానికి తనను తాను బాగుచేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి స్మోకింగ్ మానేసిన తర్వాత.. శరీరం క్రమంగా కోలుకోవడం ప్రారంభిస్తుంది. అయితే ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవ్వాల్సి ఉంది. 

వ్యాయామం..

ఊపిరితిత్తులను శుద్ధి చేయడానికి వ్యాయామం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అలాగే డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి.. శ్వాసను మెరుగుపరుస్తాయి.

నీరు

తగినంత నీరు తాగడం వల్ల ఊపిరితిత్తులలోని కఫం పలుచబడి.. దానిని బయటకు పంపడం సులభమవుతుంది. ఇది ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

స్టీమింగ్..

వీటితో పాటు రెగ్యులర్​గా ఆవిరి తీసుకోవడం వల్ల కూడా శ్వాసనాళాలు తేమగా మారి.. పేరుకుపోయిన కఫం వదులై బయటకు వెళ్తుంది. ఈ పద్ధతి ధూమపానం చేసేవారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

తేలికపాటి వ్యాయామం, నడక లేదా యోగా కాళ్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమైనప్పుడు.. ఊపిరితిత్తులు మరింత చురుకుగా పనిచేస్తాయి. ఆకుకూరలు, పండ్లు, ఒమేగా-3 ఆహారాలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. మంచి నిద్ర, ఒత్తిడి తగ్గించుకుంటే కూడా లంగ్స్​లోని వాపు తగ్గుతుందని చెప్తున్నారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NPPA New Drug Prices: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget