అన్వేషించండి

Summer Weight Loss Goal : బరువును సులభంగా తగ్గించే అలవాట్లు ఇవే.. సమ్మర్​లో ఫిట్​గా ఉండేందుకు ఇవి చాలా బెస్ట్

Weight Loss : ఈరోజుల్లో లైఫ్​స్టైల్​లో చేసే చిన్ని మార్పులే.. బరువు తగ్గడంలో పెద్ద ఫలితాలు ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యంగా, స్థిరంగా బరువు తగ్గడానికి ఏ మార్పులు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది.
  • నెమ్మదిగా, తృప్తిగా భోజనం చేయడం మంచిది.
  • ప్లేట్‌లో 50% కూరగాయలు, 25% ప్రోటీన్, 25% కార్బ్స్ ఉండేలా చూసుకోండి.
  • స్వీట్లు, చక్కెర పానీయాలు తగ్గించడం మంచిది.
  • ప్రతిరోజూ కనీసం 7,000-10,000 అడుగులు నడవండి.
  • బరువు శిక్షణ కండరాలను పెంచి కేలరీలను బర్న్ చేస్తుంది.
  • 7-8 గంటల నాణ్యమైన నిద్ర హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.
  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయండి.
  • జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి.

Lifestyle Changes for Weight Loss : బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్లు పాటించడం లేదా గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చడం మాత్రమే కాదు. నిజానికి ఇది మన రోజువారీ జీవనశైలిలో చేసే చిన్న కానీ ముఖ్యమైన మార్పులతో ప్రారంభమవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తమ అలవాట్లు మార్చితే.. బరువు తగ్గే ప్రక్రియ సులభం అవుతుంది. మరి దీనిని బరువు తగ్గేందుకు లైఫ్​స్టైల్​లో ఎలాంటి మార్పులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉదయాన్నే నీళ్లు తాగండి..

ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. మెటాబాలిజం పెరుగుతుంది. నిమ్మరసం, జీలకర్ర లేదా మెంతుల నీళ్లు కలిపి తాగితే ఇంకా మంచిది. రోజంతా నీరు తాగడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. 

బ్రేక్​ఫాస్ట్​లో ప్రోటీన్

ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. గుడ్లు, పనీర్, మొలకలు, పప్పులతో చేసిన ఫుడ్స్, గ్రీక్ యోగర్ట్ వంటివి తీసుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచి ఫ్యాట్ బర్నింగ్‌కు సహాయపడతాయి.

నెమ్మదిగా తినండి

భోజనం చేసేప్పుడు తొందరపడకండి. టీవీ లేదా మొబైల్ చూడకుండా తినడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా నమిలి తింటే త్వరగా తృప్తి కలుగుతుంది. ఎక్కువ తినడం తగ్గిస్తారు. 

80-20 ప్లేట్ రూల్..

మీ ప్లేట్​లో 50 శాతం కూరగాయలు, 25 శాతం ప్రోటీన్, 25 శాతం కార్బ్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలా తింటే శరీరానికి సరైన పోషకాలు లభిస్తాయి. కేలరీలు కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

స్వీట్స్ తగ్గించండి..

సోడాలు, ప్యాకేజ్డ్ జ్యూసులతో పాటు.. షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్​కి దూరంగా ఉండండి. అలాగే టీ, కాఫీలు బరువును పెంచుతాయి కాబట్టి తగ్గించుకోవాలి. వీటి బదులు హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరు తాగడం మంచిది. బెల్లం, ఖర్జూరం కూడా పరిమితంగా తీసుకోవాలి.

ప్రతి రోజూ నడక

ఎక్కువసేపు కూర్చుంటే మెటాబాలిజం తగ్గుతుంది. కాబట్టి మధ్యలో లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం 7,000 నుంచి 10,000 అడుగులు నడవడం లక్ష్యంగా పెట్టుకోండి.

స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 

బరువులతో లేదా బాడీవెయిట్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. ఇవి విశ్రాంతిలో ఉన్నప్పటికీ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడతాయి. వారానికి 3లేదా4 సార్లు 20 నిమిషాలు చేస్తే సరిపోతుంది.

7–8 గంటల నిద్ర

నిద్ర సరిపోకపోతే హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. దీంతో ఆకలి పెరిగి.. ఫ్యాట్ నిల్వ అవుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం మంచిది.

స్ట్రెస్‌ కంట్రోల్..

ఒత్తిడి ఎక్కువైతే ఎక్కువగా తినే అలవాటు వస్తుంది. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, లేదా సాయంత్రం నడక చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

హెల్తీ స్నాక్స్ 

జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి. వేయించిన శనగలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, పండ్లు, పీనట్ బట్టర్, మఖానా వంటివి తీసుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్‌ను స్థిరంగా ఉంచి ఎక్కువగా తినకుండా సహాయపడతాయి.

బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. కానీ రోజువారీ చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. క్రమంగా అలవాట్లు మార్చుకుంటే శరీరం కూడా మారుతుంది. త్వరగా ఫలితాలు ఆశించకుండా, స్థిరంగా ముందుకు వెళ్తే ఆరోగ్యకరమైన బరువు ఈజీగా తగ్గవచ్చు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget