అన్వేషించండి

High Cholesterol : సైలెంట్‌గా పెరుగుతున్న కొలెస్ట్రాల్.. ఈ లక్షణాలు పెరుగుతోన్న కొవ్వుకు సంకేతం, నెగ్లెక్ట్ చేయకండి

High Cholesterol Warning Signs : హై కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి ముందుగానే సంకేతాలను గుర్తించి.. జీవనశైలిని మార్చుకుంటే దీన్ని సులభంగా నియంత్రించవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చేతులు, కాళ్లపై గడ్డలు.
  • కళ్ల చుట్టూ పసుపు మచ్చలు, గ్రే రింగ్ రావచ్చు.
  • అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి కలగవచ్చు.
  • ఆహారం, వ్యాయామం, జన్యువులు కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేస్తాయి.

Early Signs of High Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడం అనేది చాలా సైలెంట్‌గా జరుగుతుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటే మొదట్లో కొవ్వుకు సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవు. దీని వల్ల చాలా మంది ఈ సమస్యను పట్టించుకోరు. అయితే కొన్ని చిన్న సంకేతాలను శరీరం ముందుగానే ఇస్తుందట. వాటిని గుర్తించి.. లైట్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలను నివారించవచ్చని చెప్తున్నారు.

హై కొలెస్ట్రాల్ 

కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థం. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బులకు దారితీస్తుంది. అలాగే శరీరంలో ఇతర అవయవాలకు కూడా దీనివల్ల డ్యామేజ్ కలుగుతుంది. అందుకే దీనిని విస్మరించకూడదని.. చెప్తున్నారు నిపుణులు. 

అయితే నిపుణుల ప్రకారం హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో టెండన్ జాంథోమా అనేది ఒక ముఖ్యమైన లక్షణం. అంటే చేతుల మోచేతులు, మోకాళ్లు, కాలి మడమల దగ్గర చిన్న గడ్డలు కనిపిస్తాయి. పసుపు రంగులో ఉండే కొవ్వు పేరుకుపోయి కనిపిస్తుంది. ఇవి గట్టిగా, నొప్పిగా అనిపించవచ్చు. అలాగే కాలి వెనుక భాగం దగ్గర  ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి శరీరంలో లిపిడ్ పేరుకుపోవడం వల్ల వస్తాయి.

కొవ్వు ఉంటే కనిపించే ఇతర లక్షణాలు

శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే.. అలసట, బలహీనత ఎక్కువగా ఉంటుంది. వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే కళ్ల చుట్టూ గ్రే కలర్ రింగ్ వస్తుంది. కంటి పలకల దగ్గర పసుపు మచ్చలు వస్తాయి. పురుషుల్లో అంగస్తంభన సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి వంటివి జరుగుతాయి. అయితే చాలా మందిలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు.

కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది?

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగాడనికి అనేక కారణాలు ఉన్నాయి. అధికంగా కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడంతో పాటు జన్యుపరమైన లోపాలు దీనికి కారణాలు అవుతాయి. ఒబెసిటీ, డయాబెటిస్ వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. 

ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి..

శరీరంపై గడ్డలు కనిపించినా.. కళ్ల చుట్టూ మార్పులు ఉన్నా.. తరచూ అలసటగా అనిపిస్తే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. వైద్యుల సూచనలు ఫాలో అవ్వడంతో పాటు.. ఫ్యాట్స్ తగ్గించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తే మంచిది. స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తే మంచిది. 

హై కొలెస్ట్రాల్ చాలా కాలంపాటు లక్షణాలు చూపించకపోవచ్చు. కాబట్టి రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. లైఫ్‌స్టైల్ మార్పులతో పాటు ఫుడ్ ఛేంజ్ చేస్తే.. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget