Type 2 Diabetes : ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
Type 2 Diabetes Prevention : ఇంట్లో వండిన ఆహారమే తింటున్నాం కదా.. మనకు టైప్ 2 డయాబెటిస్ రాదులే అని అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఈ రోజువారీ అలవాట్లే మధుమేహానికి కారణమవుతాయట.

- ఆహారంలో అన్నం, చపాతీలు తగ్గించి పీచు, ప్రోటీన్లు పెంచాలి.
- శారీరక శ్రమ, తగిన నిద్ర లేకపోవడం మధుమేహ ముప్పును పెంచుతాయి.
- పొట్ట కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, కుటుంబ చరిత్ర ప్రమాదకరం.
Diabetes Prevention Tips : చాలామంది ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తింటున్నాం కదా.. మనకు మధుమేహం రాదులే అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదని వైద్యులు చెప్తున్నారు. ఇంటి భోజనంలోనూ అన్నం, చపాతీలు, బంగాళదుంపలు ఎక్కువగా తీసుకుంటూ.. కూరగాయలు, పప్పులు, ప్రోటీన్లు తక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులపై ప్రభావం పడవచ్చని చెప్తున్నారు. ఆహారంతో పాటు మన జీవనశైలి, శారీరక శ్రమ, నిద్ర, కుటుంబ చరిత్ర కూడా టైప్ 2 డయాబెటిస్ ముప్పును ప్రభావితం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి ఆరోగ్యం విషయంలో చేసే తప్పులు ఏంటంటే..
అన్నం, చపాతీలు ఎక్కువగా తినడం
రోజువారీ భోజనంలో అన్నం, చపాతీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. శరీరం వీటిని జీర్ణం చేసి గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఒకేసారి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటే.. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు పెరగవచ్చు. అందుకే అన్నం, చపాతీలను కూడా తక్కువ పరిమాణంలో తినాలి.
Also Read : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
కూరగాయలు, పీచుపదార్థాలు లేకుంటే..
కొందరి భోజనంలో అన్నం లేదా చపాతీలే ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు తక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలకు చోటివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రోటీన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం
భోజనంలో ప్రోటీన్ సరిపడా లేకపోతే పోషక సమతుల్యత దెబ్బతింటుంది. పప్పులు, శనగలు, పెసలు, గుడ్లు, పెరుగు, చేపలు వంటి ప్రోటీన్ వనరులు భోజనంలో ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్, పీచుపదార్థాలు ఉండేలా బ్యాలెన్స్ మీల్ ప్లాన్ చేసుకోవాలి.
Also Read : మధుమేహం, బీపీ, గుండె సమస్యలున్నవారికి 5 బెస్ట్ వ్యాయామాలు ఇవే.. నిపుణుల సూచనలతో
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్
టైప్ 2 డయాబెటిస్‌కు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక ముఖ్యమైన కారణం. శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించకపోతే రక్తంలో చక్కెర పేరుకుపోవచ్చు. కాలక్రమంలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా సరిపోకపోవడంతో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పొట్ట చుట్టూ ఉండే కొవ్వు
శరీర బరువు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం టైప్ 2 డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. పొట్ట చుట్టూ ఉండే అధిక కొవ్వు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం, నడుము చుట్టుకొలతను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి
రోజంతా కూర్చుని పనిచేయడం
ఆఫీసులో గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఇంటికి వచ్చాక కూడా శారీరక శ్రమ లేకుండా ఉండటం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల శరీరం గ్లూకోజ్‌ను సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించడం, మధ్యమధ్యలో లేవడం వంటివి చేయాలి.
నిద్రలేమి, ఫ్యామిలీ హిస్టరీ
ప్రతిరోజూ తగినంత నిద్ర లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు జీవక్రియపై ప్రభావం చూపవచ్చు. అలాగే తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు టైప్ 2 డయాబెటిస్ ఉంటే మనకూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వయసు పెరగడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. కాబట్టి కుటుంబంలో మధుమేహం ఉన్నవారు ఆరోగ్య పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.
Also Read : మధుమేహం ఉంటే స్వీట్స్ మానేస్తే సరిపోదు.. షుగర్ కంట్రోల్ అయ్యేందుకు వీటిని కూడా తినాలట
మధుమేహం రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహం రాకుండా ఉండాలంటే.. అన్నం, చపాతీలు కంట్రోల్ చేస్తూ.. కూరగాయలు, పప్పులు, ప్రోటీన్ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారానికి కనీసం 150 నిమిషాలు అయినా వ్యాయామ చేయాలి. వేగంగా నడవడం కూడా మంచిదే. అధిక బరువు ఉంటే క్రమంగా తగ్గించుకోవాలి. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఫ్యామిలీ హిస్టరీ, అధిక బరువు లేదా ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, HbA1c పరీక్షలు చేయించుకోవాలి.
Also Read : మధుమేహం, కొలెస్ట్రాల్ తగ్గించే 5 హెల్తీ డ్రింక్స్ ఇవే.. వేటితో ఏ లాభాలున్నాయంటే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















