అన్వేషించండి

Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

Dengue Health Risks for Diabetics : వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరుగుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారికి డెంగ్యూ వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో.. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షాకాలంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి డెంగ్యూ ముప్పు ఎక్కువ.
  • అధిక రక్త చక్కెర రోగనిరోధక శక్తిని తగ్గించి ప్రాణాంతక ప్రమాదం పెంచుతుంది.
  • డెంగ్యూ టీకా, రక్త చక్కెర నియంత్రణ, తక్షణ వైద్య సంరక్షణ ముఖ్యం.

Dengue Dangerous for Diabetic Patients : వర్షాకాలంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు పెరుగుతాయి. అలాగే డెంగ్యూ కేసులు కూడా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇలాంటి సమయాల్లో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు.. సాధారణ ప్రజల కంటే మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. నివేదికల ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి తీవ్రమైన, ప్రాణాంతకమైన డెంగ్యూ వచ్చే ప్రమాదం ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. 

మధుమేహం ఉంటే ఆ ప్రమాదం ఎక్కువే..

డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో ఉండే మధుమేహ రోగులు సాధారణ ఆరోగ్య సంరక్షణతో పాటు డెంగ్యూ టీకాపై కూడా శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్త చక్కెర అనేది శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల డెంగ్యూ వైరస్ శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది. అటువంటి రోగులకు ప్లేట్‌లెట్ కౌంట్ అకస్మాత్తుగా పడిపోవడం.. అంతర్గత రక్తస్రావం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తన్నారు. వయస్సు, ఊబకాయం, మూత్రపిండాల వ్యాధి, అదుపులో లేని బ్లడ్ షుగర్ వంటి పరిస్థితులు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని పరిశోధనలు చెప్తున్నాయి.

Also Read : డెంగ్యూ vs వైరల్ ఫీవర్.. రెండింటి మధ్య తేడాలు ఇవే, తెలుసుకోకుంటే ప్రమాదమే

డెంగ్యూ టీకా వేసుకోకుంటే మరణమేనా?

నివేదికల ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. వీరికి షుగర్ లేనివాళ్లతో పోలిస్తే.. గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో మధుమేహం ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి.. సాధారణ సంరక్షణలో భాగంగా డెంగ్యూ టీకాను పరిగణించాలని సూచిస్తున్నారు. అనేక అంతర్జాతీయ పరిశీలనా అధ్యయనాలు, మెటా-విశ్లేషణలు కూడా మధుమేహం ఉన్నవారికి తీవ్రమైన డెంగ్యూ, మరణం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని సూచిస్తున్నాయి.

మధుమేహం ఉన్నవారికి డెంగ్యూ వస్తే..

మధుమేహం ఉన్నవారిలో డెంగ్యూ ప్రారంభ లక్షణాలు.. సాధారణ జనాభాలో కనిపించే లక్షణాల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. వీటిలో అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే.. నిర్లక్ష్యం వహించవద్దని సూచిస్తున్నారు.

Also Read : పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు.. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

తీవ్రమైన లక్షణాలు..

అలాగే డెంగ్యూ సమయంలో మీకు నిరంతర వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, విపరీతమైన బలహీనత లేదా నీరసం, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, మూత్రవిసర్జన తగ్గడం, తల తిరగడం, లేదా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలు తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మధుమేహ వ్యాధిగ్రస్తులు డెంగ్యూ వంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. దోమల నివారణ మందులు వాడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించడానికి ఇంటి చుట్టూ నీటిని నిలవ ఉంచాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, పుష్కలంగా నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. జ్వరం ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

రోగి పరిస్థితి, ఆకలి, శరీరంలో నీటి శాతంపై ఆధారపడి.. డెంగ్యూ జ్వరానికి కొన్ని మధుమేహ మందులలో తాత్కాలిక సర్దుబాట్లు చేయాల్సి వస్తుంది. తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి రక్తంలో చక్కెర, ప్లేట్‌లెట్ కౌంట్, రోగి సాధారణ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా అవసరం.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget