అన్వేషించండి

Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

Clothes Not Drying in Rainy Season : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవు. దీనివల్ల దుర్వాసన, ఫంగస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. బట్టలు త్వరగా ఆరడంలో హెల్ప్ అవుతాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బట్టలు ఉతికి అదనపు నీటిని తొలగించి, ఎడంగా ఆరవేయండి.
  • గాలి, వెలుతురుండే ప్రదేశాలలో లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి.
  • దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాతే మడతపెట్టి దుర్వాసనను నివారించండి.

Rainy Season Laundry Tips : వర్షాకాలంలో వచ్చే ప్రధాన సమస్యల్లో బట్టలు ఆరకపోవడం కూడా ఒకటి. చినుకులు పడటం, సూర్యరశ్మి తక్కువగా ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బట్టలు ఉతికి ఆరేసినా.. అవి గంటల తరబడి తడిగానే ఉంటాయి. దీంతో దుర్వాసన రావడం, ఫంగస్ పెరగడం, బ్యాక్టీరియా వృద్ధి చెందడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటుంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు (Best Ways to Dry Clothes Quickly During Monsoon) ఫాలో అవ్వడం మరచిపోకండి. ఎందుకంటే వాటివల్ల వర్షాకాలంలో కూడా బట్టలు త్వరగా ఆరి.. దుర్వాసన లేకుండా తాజాగా ఉంటాయి. ఆ టిప్స్ ఏంటంటే..

అదనపు నీటిని తొలగించడం..

బట్టలు ఉతికిన వెంటనే వీలైనంత వరకు అదనపు నీటిని తొలగించాలి. వాషింగ్ మెషిన్‌లో మీరు బట్టలు ఉతికితే.. స్పిన్ మోడ్‌ను మరోసారి ఉపయోగించాలి. దీనివల్ల దుస్తుల్లోని మిగిలిన నీరు తగ్గుతుంది. ఒకవేళ చేతితో ఉతికితే బట్టలను మెల్లగా, పూర్తిగా పిండాలి. బాగా గట్టిగా పిండితే కొన్ని రకాల బట్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Also Read : పొట్ట (Belly Fat), బరువును తగ్గించడంలో హెల్ప్ చేసే 7 రకాల జ్యూస్​లు ఇవే.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి

దూరంగా ఆరేయండి.. 

బట్టలు ఒకదానికొకటి అతుక్కునేలా ఆరేయకూడదు. వాటి మధ్య కొంత ఖాళీ ఉంటే గాలి అన్ని వైపులా తగిలి త్వరగా ఆరే అవకాశం ఉంటుంది. అలాగే మందంగా ఉండే జీన్స్, తువ్వాళ్లు, దుప్పట్లు వంటివి ఆరడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి వీటిని పలుచటి బట్టలతో కలపకుండా విడిగా ఆరేయడం మంచిది.

గాలి వచ్చే ప్రదేశంలో

వర్షాకాలంలో ఎండలేకపోయినా.. వెలుతురు, గాలి బాగా వచ్చే ప్రదేశంలో దుస్తులు ఆరేయాలి. బాల్కనీ, కిటికీ దగ్గర లేదా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో బట్టలు ఆరేస్తే..గాలి ప్రవాహం పెరిగి బట్టల్లోని తేమ తగ్గుతుంది.

ఇంట్లో ఆరేస్తే..

బయట ఎక్కడా ఖాళీ లేదు అనుకున్నప్పుడు చాలామంది అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లోనే వాటిని ఆరేసుకుంటారు. అలా చేస్తే.. సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి బట్టల వైపు గాలి వచ్చేలా ఉంచండి. ఇది ఆరే సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డ్రై మోడ్​లో ఏసీని ఆన్ చేసి కూడా ఆరేసుకోవచ్చు.

Also Read : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

త్వరగా ఆరాలంటే ఫాలో అవ్వాల్సిన మరిన్ని చిట్కాలు.. 

బట్టలు త్వరగా ఆరాలనుకుంటే కేవలం ఒకవైపే కాకుండా.. లోపలి వైపు కాసేపు, బయట వైపు కాసేపు తిప్పుతూ ఆరేస్తే రెండు వైపులా గాలి చేరి త్వరగా ఆరుతాయి. అలాగే బట్టల  నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఉతికిన తర్వాత బట్టలను బకెట్‌లో లేదా వాషింగ్ మెషిన్‌లో ఎక్కువసేపు అలాగే ఉంచకండి. అలా చేస్తే దుర్వాసనతో పాటు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బట్టలు పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని మడత పెట్టండి. ఒకేసారి ఎక్కువ బట్టలు కాకుండా.. తక్కువగా ఉన్నప్పుడే ఉతికేసుకుంటే మంచిది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget