అన్వేషించండి

Thyroid In Women : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

Thyroid Disorders : దాదాపు ప్రతి ఇంట్లోనూ థైరాయిడ్​తో బాధపడేవారు ఎవరో ఒకరు ఉంటారు. అయితే వీరిలో మహిళలే ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. దీనికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • థైరాయిడ్ స్త్రీలలో పురుషుల కన్నా ఐదు రెట్లు ఎక్కువ.
  • హార్మోన్ల మార్పులు, ఆటోఇమ్యూన్ వ్యాధులు స్త్రీలలో ప్రధాన కారణాలు.
  • గర్భధారణ, మెనోపాజ్ థైరాయిడ్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.
  • అలసట, బరువు, మానసిక మార్పులుంటే వెంటనే పరీక్షించుకోవాలి.

Thyroid Disorders in Women and Warning Signs : చాలా ఎక్కువగా, కామన్​గా వినిపించే వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. అయితే ఈ వ్యాధితో బాధపడే మహిళల సంఖ్య.. పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది దీనిని కేవలం బరువు పెరగడం లేదా బలహీనతకు సంబంధించిన వ్యాధిగా పరిగణిస్తారు. కానీ నిజం ఏమిటంటే థైరాయిడ్ శరీరంలోని అనేక కీలక విధులను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. 

మరి పురుషుల కంటే మహిళలు ఎందుకు ఎక్కువ థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడతారో.. దానికి కారణాలు ఏంటి.. ఎవరు జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

థైరాయిడ్ గ్రంథి విధులు


Thyroid In Women : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

థైరాయిడ్ అనేది మెడలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. ఇది శరీర జీవక్రియ, శక్తి, పెరుగుదలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు, హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Also Read : థైరాయిడ్ మందులు మధ్యలో మానేస్తున్నారా? అయితే ఈ ప్రమాదాల తప్పవంటోన్న వైద్యులు

మహిళల్లో థైరాయిడ్ ఎందుకు ఎక్కువ

ఆరోగ్య సమాచారాన్ని అందించే కాడబామ్స్‌డయాగ్నోస్టిక్స్ సంస్థ ప్రకారం.. ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఐదు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రమాదం పెరుగుతుంది. చాలా సందర్భాలలో థైరాయిడ్ లక్షణాలు గుర్తించలేకపోవచ్చు. 


Thyroid In Women : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

కారణాలు ఇవే

మహిళల్లో థైరాయిడ్ సమస్యలకు హార్మోన్ల మార్పులు, ఆటోఇమ్యూన్ వ్యాధులు అత్యంత సాధారణ కారణాలుగా చెప్తారు. మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు, రోగనిరోధక వ్యవస్థలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. అందుకే మహిళల్లో ఆటోఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఇటువంటి పరిస్థితులలో శరీరం రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంథిపైనే దాడి చేస్తుంది. దీనివల్ల హషిమోటోస్ థైరాయిడైటిస్, గ్రేవ్స్ వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

Also Read : థైరాయిడ్ ఉన్నవాళ్లు బ్రెజిల్ నట్స్ ఎందుకు తినాలి? రోజుకి ఎంత తింటే మంచిది?

థైరాయిడ్ ప్రమదాన్ని పెంచే దశలు ఇవే 

స్త్రీ జీవితంలోని కొన్ని దశలు థైరాయిడ్ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం, మెనోపాజ్ సమయంలో శరీరంలోని హార్మోన్లు వేగంగా మారుతాయి. ఈ మార్పులు థైరాయిడ్ గ్రంథిని కూడా ప్రభావితం చేయగలవు. అందుకే ఈ దశలలో మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు.


Thyroid In Women : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

థైరాయిడ్ వల్ల కలిగే ఇబ్బందులు

థైరాయిడ్ సమస్యల ప్రభావాలు కేవలం బరువు పెరగడం లేదా అలసటకు మాత్రమే పరిమితం కావు. పీరియడ్స్ రాకపోవడం, గర్భధారణలో సమస్యలకు కూడా కారణం కావచ్చు. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వృద్ధాప్యంలో దీని లక్షణాలు తరచుగా మెనోపాజ్ లక్షణాలను పోలి ఉంటాయి. దీనివల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావచ్చు.

Also Read : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు?

ఎటువంటి కారణం లేకుండా నిరంతర అలసట, ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, పొడి చర్మం, తరచుగా మానసిక స్థితిలో మార్పులు, లేదా మెడ వాపు వంటి లక్షణాలు కనిపిస్తే.. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి TSH, T3, T4 వంటి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. సకాలంలో రోగ నిర్ధారణ చేస్తే సరైన చికిత్సతో, థైరాయిడ్‌ను చాలా వరకు నియంత్రించవచ్చు.

థైరాయిడ్ గురించి మరిన్ని వివరాలు, హెల్త్ టిప్స్ తెలుసుకోవాలనుకుంటే దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget