అన్వేషించండి

Brazil Nuts for Thyroid Health : థైరాయిడ్ ఉన్నవాళ్లు బ్రెజిల్ నట్స్ ఎందుకు తినాలి? రోజుకి ఎంత తింటే మంచిది?

Brazil Nuts and Thyroid Health : థైరాయిడ్ ఉన్నవాళ్లు బ్రెజిల్ నట్ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? నిపుణులు ఇస్తోన్న సూచనలు, సలహాలు ఇవే చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజుకు 1-2 బ్రెజిల్ నట్స్ తీసుకోవాలి, వైద్య సలహా తప్పనిసరి.

Brazil Nuts Benefits for Thyroid Patients : థైరాయిడ్ గ్రంథి శరీరంలోని మెటబాలిజం, శక్తి వినియోగం, హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ పనితీరు సరిగా లేకపోతే అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో బ్రెజిల్ నట్స్ ఒకటి. థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

సమృద్ధిగా ఉండే సెలీనియం 

బ్రెజిల్ నట్స్ ప్రపంచంలోనే అత్యధిక సెలీనియం కలిగిన ఆహారాల్లో ఒకటి. సెలీనియం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో సెలీనియం లోపం ఉంటే థైరాయిడ్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని తీసుకోవాలని సూచిస్తారు. 

హార్మోన్ల మార్పిడికై..

థైరాక్సిన్ (T4) హార్మోన్‌ను శరీరానికి అవసరమైన ట్రైఐయోడోథైరోనిన్ (T3)గా మార్చుతుంది. ఈ ప్రక్రియకు సెలీనియం అవసరం. బ్రెజిల్ నట్స్ ఈ ఖనిజాన్ని శరీరానికి అందిస్తాయి కాబట్టి.. హార్మోన్ల మార్పిడి సులభంగా జరుగుతుంది. 

యాంటీఆక్సిడెంట్లు

థైరాయిడ్ గ్రంథి పని చేసే సమయంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బ్రెజిల్ నట్స్‌లోని సెలీనియం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి కణాలను రక్షించడంలో సహాయం చేస్తాయి. 

కొన్ని అధ్యయనాలు సెలీనియం తీసుకోవడం వల్ల హషిమోటోస్ థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యల్లో యాంటీబాడీల స్థాయిలు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అందుకే దీనిపై ఇంకా మరిన్ని పరిశోధనలు కొనసాగాల్సి ఉంది. 

జుట్టు రాలడం తగ్గవచ్చు

థైరాయిడ్ సమస్యల వల్ల చాలామందిలో జుట్టు రాలడం కనిపిస్తుంది. సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ఖనిజాలు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. 

అలసట దూరం

థైరాయిడ్ పనితీరు తగ్గినప్పుడు అలసట, బలహీనత కనిపిస్తాయి. బ్రెజిల్ నట్స్‌లోని పోషకాలు శరీరానికి అవసరమైన శక్తి ఉత్పత్తి ప్రక్రియలకు మద్దతు ఇస్తాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ మెరుగై.. థైరాయిడ్ సమస్యలతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. 

థైరాయిడ్ సమస్యలు కొన్నిసార్లు కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం చూపవచ్చు. ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్రెజిల్ నట్స్‌ తీసుకుంటే వాటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. 

ఎంత మోతాదులో తీసుకోవాలి?

అయితే ఇది ఆరోగ్యానికి మంచిది అయినా లిమిటెడ్ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రోజుకు 1–2 బ్రెజిల్ నట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తింటే వికారం, జుట్టు రాలడం, గోళ్ల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. దీనిని తీసుకోవాలనుకుంటే రాత్రుళ్లు నానబెట్టి ఉదయాన్నే తినొచ్చు. 

గుర్తించుకోవాల్సిన విషయం..

బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ మందులకు ప్రత్యామ్నాయం కాదు. ఇది కేవలం సమస్యను అదుపులో ఉంచేందుకు మాత్రమే హెల్ప్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు వైద్యుడు లేదా డైటీషియన్ సలహా మేరకు మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. బ్రెజిల్ నట్స్‌ను సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget