అన్వేషించండి

మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?

మారుతి ఆల్టో K10 vs ఎస్-ప్రెస్సో ధరలు, ఇంజిన్, మైలేజ్, బూట్ స్పేస్, ఫీచర్లు & భద్రతలో ఏ కారు మెరుగో పూర్తి పోలిక తెలుసుకోండి.

Maruti Alto K10 vs Maruti S Presso: మారుతి సుజుకి కార్లలో చాలా తక్కువ బడ్జెట్‌లో కొనగలిగే హ్యాచ్‌బ్యాక్‌లు.. ఆల్టో K10 & ఎస్-ప్రెస్సో. డైలీ డ్రైవింగ్‌కు ఈ రెండు కార్లు సరైనవే. రెండింటి ధరలు కూడా దగ్గరదగ్గరగానే ఉన్నప్పటికీ.. డిజైన్, మైలేజ్, బూట్ స్పేస్, డ్రైవింగ్ పొజిషన్‌లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.

ధర 
ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంటుంది. ఎస్-ప్రెస్సో ధర సుమారు రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు ఉంది. అంటే ప్రారంభ ధరలో ఎస్-ప్రెస్సో సుమారు రూ.20,000 వరకు తక్కువగా ఉంటుంది.

ఇంజిన్ 
రెండు కార్లకు పెద్దగా తేడా లేదు. రెండింటిలోనూ 998 సీసీ, 1.0 లీటర్ K10C, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఆల్టో K10 గరిష్టంగా 68 బీహెచ్‌పీ పవర్ & 91.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎస్-ప్రెస్సో 68 బీహెచ్‌పీ పవర్ & 89 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

మైలేజ్ 
ఆల్టో K10కు స్వల్ప ఆధిక్యం ఉంది. పెట్రోల్ వెర్షన్‌లో ఆల్టో K10 24.39 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఎస్-ప్రెస్సో 24.12 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. CNG వెర్షన్లలో కూడా ఆల్టో K10 33.85 కిలోమీటర్లు, ఎస్-ప్రెస్సో 32.73 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి.

ఇది కూడా చదవండి: రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?

కొలతలు & డిజైన్ 
రెండు కార్లు విభిన్నంగా ఉంటాయి. ఆల్టో K10 సాంప్రదాయ చిన్న హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో ఉంటుంది. ఎస్-ప్రెస్సో మాత్రం ఎత్తైన బాడీతో మైక్రో SUV తరహాలో కనిపిస్తుంది. దీంతో ఎస్-ప్రెస్సోలో డ్రైవర్‌కు కొంత ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ లభిస్తుంది.

బూట్ స్పేస్‌
ఈ విషయంలో ఎస్-ప్రెస్సో ముందంజలో ఉంది. ఇందులో 240 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఆల్టో K10లో 214 లీటర్ల సామర్థ్యం ఉంది. కుటుంబంతో ప్రయాణించేవాళ్లకు ఎస్-ప్రెస్సో అదనపు స్థలం ఉపయోగపడుతుంది.

ఫీచర్లు 
రెండు కార్ల టాప్ వేరియంట్లలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay & Android Auto వంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?

కారు ఎంపిక పూర్తిగా మీ అవసరాలు, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ ధర, మంచి మైలేజ్ & సిటీ డ్రైవింగ్ కోసం చూస్తే ఆల్టో K10 ఆకర్షణీయమైన ఎంపిక. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, ఎక్కువ బూట్ స్పేస్ & SUV తరహా డిజైన్ కావాలంటే ఎస్-ప్రెస్సోను పరిశీలించవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే
రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?
చేతిలో రూ.50 వేలే ఉందా? అయినా పర్లేదు, కొత్త మారుతి ఆల్టో K10 మీ సొంతం!
KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Embed widget