అన్వేషించండి

హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?

హ్యుందాయ్ మోటార్ ఇండియా, సెప్టెంబర్ నుంచి తన అన్ని కార్ల ధరలను పెంచనుంది. మోడల్ & వేరియంట్‌ను బట్టి రేట్లు గరిష్టంగా 1 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

Hyundai to hike car prices: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. హ్యుందాయ్ మోటార్ ఇండియా, తన కార్ల ధరలు మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే నెల (సెప్టెంబర్ 2026) నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మోడల్ & వేరియంట్‌ను బట్టి ఈ హైక్‌ మారుతుంది. గరిష్టంగా 1 శాతం వరకు ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి చూస్తే.. సుమారు రూ.7,767 నుంచి రూ.23,672 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అయితే, ఏ మోడల్‌ ధరను ఎంత పెంచేదీ హ్యుందాయ్ ఇంకా వెల్లడించలేదు.

ధరల పెంపునకు కారణం ఏంటి?
ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, ముడి పదార్థాల ధరలు పెరగడం ప్రధాన కారణాలుగా హ్యుందాయ్ తెలిపింది. వీటితో పాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని వెల్లడించింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు & ఆర్థిక అనిశ్చితులు కూడా కంపెనీపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది.

పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని కస్టమర్లపై పూర్తిగా పడకుండా చేసేందుకు ఖర్చులను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నామని హ్యుందాయ్ చెప్పింది. కొంత భారాన్ని కంపెనీ స్వయంగా భరిస్తున్నప్పటికీ, ఖర్చుల ఒత్తిడి కొనసాగుతుండటంతో మరికొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని వివరించింది.

ఇది కూడా చదవండి: ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?

ఈ ఏడాదిలో మూడోసారి
హ్యుందాయ్, 2026లో ధరలు పెంచడం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో తొలిసారి ధరలను సవరించింది & ఆ తర్వాత జూన్‌లో మరోసారి ప్రైస్‌ హైక్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు, సెప్టెంబర్‌లో మరోసారి ధరల పెంపును అమలు చేయబోతంది.

హ్యుందాయ్ కార్ల ప్రస్తుత ధరలు

భారత్‌లో స్థానికంగా తయారవుతున్న హ్యుందాయ్ మోడళ్లలో...

Grand i10 Nios ధర ప్రస్తుతం రూ.5.59 లక్షల నుంచి రూ.8.04 లక్షల వరకు ఉంది.

Aura ధర రూ.5.99 లక్షల నుంచి రూ.8.60 లక్షల వరకు ఉంది.

i20 ధర రూ.5.99 లక్షల నుంచి రూ.11.74 లక్షల వరకు ఉంది.

Exter ధర రూ.5.80 లక్షల నుంచి రూ.9.46 లక్షల వరకు ఉంది.

Venue ధర రూ.7.99 లక్షల నుంచి రూ.15.64 లక్షల వరకు ఉంది.

Creta ధర రూ.10.90 లక్షల నుంచి రూ.19.95 లక్షల వరకు ఉంది.

Verna ధర రూ.10.99 లక్షల నుంచి రూ.18.26 లక్షల వరకు ఉంది.

Alcazar ధర రూ.14.50 లక్షల నుంచి రూ.21.25 లక్షల వరకు ఉంది. 

Creta Electric ధర రూ.18.02 లక్షల నుంచి రూ.23.67 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే

కొత్త కారు కొనేవారికి కీలకం
ఈ పండుగ సీజన్‌లో కొత్త హ్యుందాయ్‌ కారు కొనాలని భావిస్తున్నవాళ్లు కంపెనీ తాజా నిర్ణయాన్ని జాగ్రత్తగా ఫాలో కావడం మంచిది. ముఖ్యంగా ఖరీదైన వేరియంట్ కొనేవాళ్లపై 1 శాతం పెంపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కంపెనీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఖచ్చితమైన కొత్త ధరలపై స్పష్టత వస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget