అన్వేషించండి

రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే

రూ.15,000 లోపు బడ్జెట్‌లో లభించే ఎలక్ట్రిక్ సైకిళ్ల వివరాలు ఇవి. బ్యాటరీ రేంజ్, వేగం, ఛార్జింగ్ సమయం & కొనుగోలు ముందు చూసుకోవాల్సిన అంశాలు తెలుసుకోండి.

Best Electric Cycles Under Rs 15000: పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చున్న వేళ రోజువారీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలని చాలామంది చూస్తున్నారు. ముఖ్యంగా.. స్కూల్‌, కాలేజీ, ఆఫీస్ లేదా సమీప ప్రాంతాలకు వెళ్లివచ్చేవాళ్లకు ఎలక్ట్రిక్ సైకిళ్లు మంచి ప్రత్యామ్నాయం. తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన ఛార్జింగ్, తక్కువ వేగం వంటి కారణాలతో వీటికి డిమాండ్ పెరుగుతోంది.

రూ.15,000 లోపు బడ్జెట్‌లో కూడా కొన్ని ఎలక్ట్రిక్ సైకిళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని మోడళ్లు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో సుమారు 20 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. గరిష్ట వేగం సాధారణంగా గంటకు 20 నుంచి 25 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అయితే, రేంజ్ అనేది బ్యాటరీ సామర్థ్యం, రైడర్ బరువు, రోడ్డు పరిస్థితులు & రైడింగ్ విధానంపై ఆధారపడి మారుతుంది.

సైకిల్ మోడల్ / బ్రాండ్ బ్యాటరీ సామర్థ్యం డ్రైవింగ్ రేంజ్ (ఫుల్ ఛార్జ్) గరిష్ట వేగం ధర 
హీరో లెక్ట్రో సిరీస్ 5.8 Ah / 7.8 Ah లిథియం 30 - 40 కి.మీ. 25 కి.మీ./గం. ₹14,999 - ₹15,999
సీ-ట్రాక్ ఎలక్ట్రిక్ 6.0 Ah లిథియం-అయాన్ 25 - 35 కి.మీ. 25 కి.మీ./గం. ₹13,500 - ₹14,500
డి-ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్ 48V లిథియం-అయాన్ 30 - 40 కి.మీ. 25 కి.మీ./గం. ₹15,000
లోకల్ ఇ-మోబిలిటీ స్టార్టప్స్ 5.2 Ah లిథియం-అయాన్ 20 - 30 కి.మీ. 20 - 25 కి.మీ./గం. ₹12,000 - ₹14,000

ఇది కూడా చదవండి: RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?

హీరో లెక్ట్రో సిరీస్
బడ్జెట్ ఎలక్ట్రిక్ సైకిళ్లలో హీరో లెక్ట్రో సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని మోడళ్లలో 250 వాట్ల బీఎల్‌డీసీ రియర్‌ హబ్ మోటార్‌ అందిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి సింగిల్‌ ఛార్జ్‌తో సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కొన్ని మోడళ్లలో బ్యాటరీ మొత్తం ఫ్రేమ్‌లో ఉంటుంది. దీనివల్ల సైకిల్‌ మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తుంది.

సీ ట్రాక్ ఎలక్ట్రిక్ సైకిళ్లు
తక్కువ ధరలో రోజువారీ ప్రయాణానికి సీ ట్రాక్ వంటి మోడళ్లను కూడా పరిశీలించవచ్చు. కొన్ని సైకిళ్లలో తొలగించగల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీంతో, సైకిల్‌ నుంచి బ్యాటరీని ఇంట్లోకి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. సాధారణంగా మూడు నుంచి నాలుగు గంటల్లో ఛార్జింగ్ పూర్తయ్యే మోడళ్లు ఉన్నాయి.

రైడింగ్ మోడ్స్‌లో థ్రోటిల్ & పెడల్ అసిస్ట్ వంటి సదుపాయాలు ఉంటాయి. కొన్ని మోడళ్లలో క్రూయిజ్ మోడ్ కూడా కనిపిస్తుంది. రాత్రివేళ ప్రయాణానికి ఎల్‌ఈడీ హెడ్‌లైట్, భద్రత కోసం డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు అందిస్తున్నారు.

లోకల్ బ్రాండ్లు కూడా ఉన్నాయి
బడ్జెట్ విభాగంలో, లోకల్‌ కంపెనీలు & కొత్త ఈ-మొబిలిటీ సంస్థలు కూడా చాలా మోడళ్లను అందిస్తున్నాయి. తక్కువ బరువుతో ఉండే సైకిళ్లు నగరం/పట్టణ ప్రయాణాల్లో సులభంగా ఉంటాయి. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినా సాధారణ సైకిల్‌లా పెడల్స్‌తో తొక్కుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు

కొనే ముందు ఇవి చూడండి
రూ.15,000 లోపు ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసేటప్పుడు ధర ఒక్కటే ప్రమాణంగా చూడకూడదు. లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న మోడల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్యాటరీ & మోటార్‌పై కంపెనీ అందించే వారంటీని ముందుగానే తెలుసుకోవాలి. ఫ్రేమ్ బలంగా ఉందో లేదో పరిశీలించాలి. అలాగే సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయా, విడిభాగాలు సులభంగా లభిస్తాయా అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.

ముఖ్యంగా, బ్యాటరీని తరచూ పూర్తిగా ఖాళీ చేయకూడదు, 20% మిగిలి ఉండగానే ఛార్జ్ చేయడం మంచిది. వర్షపు నీరు బ్యాటరీ & విద్యుత్ భాగాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. మీరు సరైన మోడల్‌ను ఎంచుకుంటే రోజువారీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మినిమమ్‌ డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్‌... TVS Orbiter ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ ఇంటి ముందుంటుంది!
యూత్‌ తెగ కొంటున్న టీవీఎస్‌ ఆర్బిటర్‌ స్కూటర్‌ను కేవలం రూ.2000 EMIతో మీరూ కొనొచ్చు
ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి రూ.లక్ష లోపు వచ్చే TVS టూవీలర్లు.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి!
రూ.1 లక్ష దాటని టీవీఎస్ బైక్‌ లేదా స్కూటర్‌ కొనాలా? మీ బడ్జెట్‌ తగిన బెస్ట్ ఆప్షన్స్ ఇవిగో!
రూ.3.60 లక్షల స్పాట్‌ క్యాష్‌తో Mahindra XUV 7XO మీదే! ఈజీ EMI ప్లాన్‌ ఎంచుకుంటే చాలు
కేవలం రూ.21,000 EMIతో Mahindra XUV 7XO మీ సొంతమవుతుంది! ఎన్నేళ్లు చెల్లించాలంటే?
ప్రయాణాల్లో మీ కుటుంబం భద్రతకు మహీంద్రా భరోసా! XUV 7XOకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
మహీంద్రా XUV 7XOలో ప్రయాణం చాలా సేఫ్‌! భారత్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Embed widget