KTM 390 Duke వర్సెస్ RE Guerrilla 450 Apex.. ధర, పవర్, ఫీచర్లలో ఏది బెస్ట్?
KTM 390 Duke & Royal Enfield Guerrilla 450 Apex బైక్స్ ధర, ఇంజిన్, పవర్, టార్క్, బరువు, ఫీచర్లు & బ్రేకింగ్ వివరాలను పోల్చి చూద్దాం.

KTM 390 Duke vs RE Guerrilla 450 Apex: ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలో KTM 390 Duke & Royal Enfield Guerrilla 450 మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో 390 Dukeతో Guerrilla 450 కంపారిజన్ సాధారణంగానే ఉండేది. అయితే 2026లో పరిస్థితి మారింది. కొత్త GST విధానం కారణంగా KTM 390 Duke ఇంజిన్ సామర్థ్యం 350cc కంటే దిగువకు తగ్గింది. మరోవైపు, రాయల్ ఎన్‌ఫీల్డ్ Guerrilla 450ను కొత్త స్పోర్టియర్ Apex వేరియంట్‌లో తీసుకొచ్చింది.
ఇప్పుడు ఈ రెండు బైక్స్‌లో ఇంజిన్, పవర్, టార్క్, బరువు, ఫీచర్లు & ధర పరంగా దేనిది పైచేయో తెలుసుకుందాం.
ఇంజిన్ & పవర్‌లో ఎవరిది పైచేయి?
కొత్త KTM 390 Dukeలో 349.32cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8,600rpm వద్ద 41.5hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. 7,000rpm వద్ద 33.5Nm టార్క్ వస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు.
Guerrilla 450 Apexలో 452cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 8,000rpm వద్ద 40.02hp పవర్ అందిస్తుంది. 5,500rpm వద్ద ఏకంగా 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
పవర్‌లో KTM 390 Duke స్వల్పంగా ముందుంది. అయితే టార్క్‌లో Guerrilla 450 స్పష్టమైన ఆధిక్యం చూపుతోంది. అంతేకాదు.. Guerrillaలో తక్కువ rpm వద్దే గరిష్ఠ టార్క్ లభిస్తుంది. దీంతో సిటీ రైడింగ్‌లో గేర్‌లు ఎక్కువగా మార్చాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్‌లో Guerrilla మరింత సులభంగా నడపగలిగే బైక్‌గా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Yamaha R15 కంటే పవర్‌ఫుల్.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
బరువు విషయంలో KTMతో వెసులుబాటు
KTM 390 Duke బరువు 168.3kg. Guerrilla 450 Apex బరువు 185kg. అంటే RE బైక్ ఏకంగా 17kg ఎక్కువ బరువు ఉంటుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తక్కువ బరువు ఉన్నప్పటికీ KTMలో పెద్ద 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. Guerrillaలో 11 లీటర్ల ట్యాంక్ మాత్రమే ఉంటుంది.
సీటు ఎత్తు విషయంలో Guerrilla సౌలభ్యంగా ఉంది. దీని సీటు ఎత్తు 780mm. KTM 390 Duke సీటు ఎత్తు 800mm. అంటే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు Guerrilla కొంత సౌకర్యంగా ఉంటుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో KTM 183mmతో ముందుంది. Guerrilla 169mm క్లియరెన్స్ మాత్రమే కలిగి ఉంది. వీల్‌బేస్ కూడా రెండు బైక్స్‌లో భిన్నంగా ఉంది. KTM 1,357mm వీల్‌బేస్‌ను కలిగి ఉండగా.. Guerrilla 1,440mm వీల్‌బేస్‌తో వస్తుంది.
ఇది కూడా చదవండి: 2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో భలే అప్‌డేట్స్.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్!
బ్రేకులు & సస్పెన్షన్ ఎలా ఉన్నాయి?
Guerrilla 450 Apexలో 120/70R17 ముందు టైర్, 160/60R17 వెనుక టైర్ ఉన్నాయి. KTMలో 110/70R17 ముందు, 150/60R17 వెనుక టైర్లు ఉన్నాయి. అంటే RE బైక్‌కు కొంత వెడల్పైన టైర్లు ఉన్నాయి.
KTM 390 Dukeలో 320mm ముందు డిస్క్, 240mm వెనుక డిస్క్ ఉన్నాయి. Guerrillaలో 310mm ముందు డిస్క్, 270mm వెనుక డిస్క్ ఉన్నాయి. రెండు బైక్స్‌లోనూ డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా ఉంటుంది.
సస్పెన్షన్ విషయంలో KTM మరింత అధునాతనంగా ఉంది. 390 Dukeలో 43mm USD ఫోర్క్ ఉంది. దీనిలో కంప్రెషన్ & రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. వెనుక మోనోషాక్‌లో రీబౌండ్ & ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది.
Guerrillaలో 43mm RSU ఫోర్క్ & లింకేజ్ మోనోషాక్ ఉన్నాయి. ఇందులో వెనుక ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ మాత్రమే లభిస్తుంది.
ఫీచర్లలో KTM దూకుడు
ఫీచర్ల విషయంలో KTM 390 Duke దే పైచేయి. ఇందులో రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, లీన్-సెన్సిటివ్ ABS, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ట్రాక్ స్క్రీన్ & టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Guerrilla 450 Apexలో TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనితో Google Mapsను స్క్రీన్ కాస్ట్ చేసుకోవచ్చు. రెండు రైడ్ మోడ్స్ & స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ కూడా ఉన్నాయి.
ధరలో Guerrilla ముందంజ
ధర విషయానికి వస్తే రెండు బైక్స్ మధ్య గణనీయమైన తేడా ఉంది. KTM 390 Duke ధర రూ.2.84 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Royal Enfield Guerrilla 450 Apex ధర రూ.2.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. Apex Green రంగు ధర రూ.2.58 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
అంటే పెద్ద 452cc ఇంజిన్ ఉన్న Guerrilla 450 Apex.. KTM 390 Duke కంటే తక్కువ ధరకు లభిస్తోంది. అయితే ఫీచర్ల విషయంలో KTM చాలా ముందుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















