అన్వేషించండి

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు

Yamaha R2 ఆగస్టు 27న లాంచ్‌ అవుతుంది. 200-220cc ఇంజిన్‌, తక్కువ బరువు, అధునాతన ఫీచర్లతో KTM RC 200 & Karizma XMRకు పోటీ ఇవ్వనుంది.

Yamaha R2 Price And Features Telugu: స్పోర్ట్స్‌ బైక్‌ లవర్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యమహా R2 అతిత్వరలో మన మార్కెట్లోకి రానుంది. ఆగస్టు 27న ఈ కొత్త బైక్‌ లాంచ్‌ అవుతుంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. కేవలం రూ.10,000 చెల్లించి ఈ బైక్‌ను ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తం పూర్తిగా మీకు తిరిగి వస్తుంది.

యమహా R2ను, ప్రస్తుతం ఉన్న R15కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లేదు. కంపెనీ లైనప్‌లో R15తో పాటు R2 కూడా కొనసాగుతుంది. అయితే R15 సిరీస్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

200ccకు పైగా ఇంజిన్‌?

యమహా R2 ఇంజిన్‌ వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే ఈ బైక్‌లో 200cc కంటే కొద్దిగా ఎక్కువ సామర్థ్యం ఉన్న సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉండే అవకాశం ఉంది. ఇది 200-220cc పరిధిలో ఉండొచ్చని అంచనా. ఈ బండి పవర్‌ గణాంకాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచే పనితీరును ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. 

R2కు ప్రధాన పోటీ KTM RC 200 & Hero Karizma XMR నుంచే ఉంటుంది. ఈ రెండు బైక్‌లు సుమారు 25hp పవర్‌ను జనరేట్‌ చేస్తాయి. కాబట్టి యమహా R2 కూడా దాదాపు ఇదే స్థాయి పవర్‌ను అందించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి

తక్కువ బరువుతో అదనపు ప్రయోజనం

R2లో అత్యధిక పవర్‌ కంటే తక్కువ బరువు కీలకంగా మారే అవకాశం ఉంది. KTM RC 200 బరువు 160 కిలోలు. హీరో కరిజ్మా XMR బరువు 163.5 కిలోలు. ప్రస్తుతం ఉన్న యమహా R15 V4 బరువు మాత్రం కేవలం 141 కిలోలు. R2 కూడా తక్కువ బరువుతో వస్తే, ఇంజిన్‌ పవర్‌ కొద్దిగా తక్కువగా ఉన్నా మంచి యాక్సిలరేషన్‌ & చురుకైన హ్యాండ్లింగ్‌ అందించే అవకాశం ఉంది.

ఫీచర్లలో మరో అడుగు ముందుకు

ప్రస్తుతం ఈ విభాగంలో ఫీచర్ల విషయంలో R15 V4 ముందంజలో ఉంది. ఇందులో TFT డిస్‌ప్లే, ట్రాక్షన్‌ కంట్రోల్‌ & టాప్‌ వేరియంట్లలో అప్‌షిఫ్ట్‌-ఓన్లీ క్విక్‌షిఫ్టర్‌ ఉన్నాయి. R2 వీటిని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఇందులో రైడ్‌-బై-వైర్‌ థ్రాటిల్‌ ఉండే అవకాశం ఉంది. దీంతో రైడింగ్‌ మోడ్‌లు & రెండు దిశల్లో పనిచేసే క్విక్‌షిఫ్టర్‌ వంటి ఫీచర్లను అందించే అవకాశం ఉంటుంది.

భారత్‌లోనే తయారీ

యమహా R2ను చెన్నైలో తయారు చేస్తారు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది. అయితే వివిధ దేశాల మార్కెట్లను బట్టి ఫీచర్లు & స్పెసిఫికేషన్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం R15 S ధర రూ.1.57 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్‌ R15 M ధర రూ.1.98 లక్షలు. దీనిని బట్టి, R2 ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. 

KTM RC 200 ధర రూ.2.24 లక్షలు. హీరో కరిజ్మా XMR మాత్రం రూ.1.76 లక్షల నుంచి లభిస్తుంది. దీంతో, ధర విషయంలో R2 ఏ స్థాయిలో నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?

ఇదే ప్లాట్‌ఫామ్‌పై మరిన్ని బైక్‌లు

యమహా R2 కోసం రూపొందించిన కొత్త ప్లాట్‌ఫామ్‌ ఒక్క బైక్‌కే పరిమితం కాకపోవచ్చు. భవిష్యత్తులో ఇదే ప్లాట్‌ఫామ్‌పై మరిన్ని మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. 155cc ప్లాట్‌ఫామ్‌తో యమహా ఇప్పటికే ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

మొత్తంగా చూస్తే.. తక్కువ బరువు, 200ccకు పైగా ఇంజిన్‌, ఆధునిక ఫీచర్లు & ఆకర్షణీయమైన ధరతో R2 మార్కెట్లోకి వస్తే KTM RC 200 & Hero Karizma XMR కు గట్టి పోటీ ఇవ్వగలదు. ఆగస్టు 27న విడుదలైన తర్వాతే బైక్‌ ధర, పవర్‌ & పూర్తి స్పెసిఫికేషన్లపై పూర్తి స్పష్టత వస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Turbo Engine Maintenance: టర్బో ఇంజిన్‌ కార్‌ మైలేజీ, పెర్ఫార్మెన్స్‌ బాగుండాలంటే ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి!
మీ కారులో టర్బో ఇంజిన్‌ ఉందా? ఈ చిన్న తప్పులు చేయొద్దు, లేదంటే భారీ ఖర్చులు!
Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget