అన్వేషించండి

BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!

భారత్‌లో BaaS పథకంతో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితా ఇదే. టాటా, MG, హ్యుందాయ్‌, మారుతి, కియా, మహీంద్రా, టయోటా కార్ల ధరలు & బ్యాటరీ ఛార్జీల వివరాలు తెలుసుకోండి.

BaaS EVs 2026: ఎలక్ట్రిక్‌ కారు కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ వాటి ధరలు పెట్రోల్‌ & డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎక్కువగా ఉండటం పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు కార్ల కంపెనీలు అనుసరిస్తున్న కొత్త విధానమే BaaS. అంటే, బ్యాటరీ-యాజ్‌-ఎ-సర్వీస్‌.

ఈ విధానంలో కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరమే ఉండదు. అంటే, కారు ధర నుంచి బ్యాటరీ పూర్తి ధర మైనస్‌ అవుతుంది. దీంతో కారు ప్రారంభ ధర భారీగ తగ్గుతుంది. అయితే, కారు కదలలాంటే బ్యాటరీ కావాలి కాబట్టి, ఆ బ్యాటరీని కారు కంపెనీ నుంచే అద్దెకు తీసుకుంటారు. బ్యాటరీ అద్దెను కిలోమీటర్‌ చొప్పున లేదా నెలవారీ చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం టాటా, MG, సిట్రోయెన్‌, హ్యుందాయ్‌, మారుతి సుజుకి, కియా, మహీంద్రా & టయోటా వంటి కంపెనీలు BaaS విధానాన్ని అందిస్తున్నాయి.

టాటా టియాగో EV

దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్‌ కార్లలో టాటా టియాగో EV ఒకటి. దీని సాధారణ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు. BaaSతో రూ.4.69 లక్షలకే ప్రారంభమవుతుంది. అంటే మొదట చెల్లించాల్సిన మొత్తం రూ.2.30 లక్షలు తగ్గుతుంది. బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు రూ.2.60 చొప్పున చెల్లించాలి.

MG కామెట్ EV

MG కామెట్ EV సాధారణ ధర రూ.7.80 లక్షల నుంచి మొదలవుతుంది. BaaSతో దీని ధర రూ.4.99 లక్షలకు తగ్గుతుంది. గరిష్ఠంగా రూ.2.81 లక్షల వరకు ఆదా అవుతుంది. బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు రూ.3.20 చెల్లించాలి.

టాటా పంచ్ EV

టాటా పంచ్ EV, BaaSతో రూ.6.49 లక్షల నుంచి లభిస్తుంది. సాధారణంగా దీని ప్రారంభ ధర రూ.9.69 లక్షలు. అంటే రూ.3.20 లక్షల వరకు ఆదా చేయవచ్చు. బ్యాటరీ పరిమాణాన్ని బట్టి నెలకు రూ.4,688 నుంచి రూ.5,274 వరకు చెల్లించాలి.

ఇది కూడా చదవండి: మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!

సిట్రోయెన్ eC3X

సిట్రోయెన్‌ eC3Xలో BaaSతో భారీగా ఆదా చేయవచ్చు. దీని ప్రారంభ BaaS ధర రూ.6.89 లక్షలు. సాధారణ ధరతో పోలిస్తే గరిష్ఠంగా రూ.5.26 లక్షల వరకు తగ్గుతుంది. బ్యాటరీ ఛార్జీ కిలోమీటర్‌కు రూ.2.26. కనీసం నెలకు 2,000 కి.మీ. వినియోగానికి చెల్లించాలి.

కియా సైరోస్ EV

కియా సైరోస్ EV రేటు రూ.13.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. BaaSతో రూ.7.99 లక్షలకే వస్తుంది. అంటే రూ.5.51 లక్షల వరకు ప్రారంభ వ్యయం సేవ్‌ అవుతుంది. 42kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.3.30 చెల్లించాలి.

MG విండ్సర్ EV

భారత్‌లో BaaS విధానాన్ని తొలిసారిగా తీసుకొచ్చిన మోడళ్లలో MG విండ్సర్ EV ఒకటి. దీని BaaS ధర రూ.9.99 లక్షల నుంచి స్టార్టవుతుంది. సాధారణ ధరతో పోలిస్తే, BaaSతో రూ.4.71 లక్షల వరకు ఆదా చేయవచ్చు. 38kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.3.99; 52.9kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.4.50 చెల్లించాలి.

ఇది కూడా చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!

హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌

క్రెటా ఎలక్ట్రిక్‌కు కూడా BaaS సదుపాయం అందుబాటులో ఉంది. దీని BaaS ధర రూ.10.99 లక్షల నుంచి మొదలవుతుంది. సాధారణ ధర రూ.18.03 లక్షలతో పోలిస్తే రూ.7.04 లక్షల వరకు మిగులుతుంది. 42kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.3.90 చెల్లించాలి.

మారుతి సుజుకి ఈ విటారా

మారుతి ఈ విటారా BaaSతో రూ.10.99 లక్షల నుంచి లభిస్తుంది. 49kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.3.99; 61kWh బ్యాటరీకి రూ.4.39 చెల్లించాలి. వేరియంట్‌ను బట్టి రూ.5.20 లక్షల నుంచి రూ.5.65 లక్షల వరకు ప్రారంభ ధరలో ఆదా చేయవచ్చు.

మహీంద్రా BE 6 స్పోర్టెక్‌

ఇటీవలే BaaS కిందకు వచ్చిన మోడల్‌ ఇది. 59kWh బ్యాటరీ ఉన్న One & Two వేరియంట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. BaaSతో ప్రారంభ ధర రూ.11.45 లక్షలు. సాధారణ ధరతో పోలిస్తే రూ.8 లక్షలు తగ్గుతుంది. బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు రూ.3.75 చెల్లించాలి.

కియా కరెన్స్ క్లావిస్ EV

కియా కరెన్స్ క్లావిస్ EV కూడా BaaSతో అందుబాటులో ఉంది. ఇది ఈ జాబితాలోని ఏకైక MPV. ప్రారంభ BaaS ధర రూ.12.88 లక్షలు. 42kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.3.30; 51.4kWh బ్యాటరీకి రూ.3.80 చెల్లించాలి. BaaSతో గరిష్ఠంగా రూ.6.10 లక్షల వరకు మిగిల్చుకోవచ్చు.

MG ZS EV

MG ZS EV కొనేవాళ్లకు BaaSతో రూ.13 లక్షల నుంచే అందుబాటులోకి వస్తుంది. సాధారణ ధరతో పోలిస్తే సుమారు రూ.5 లక్షల వరకు ఆదా చేయవచ్చు. 50.3kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.4.50 చెల్లించాలి.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా

టయోటా ఇబెల్లా BaaS ధర రూ.15.25 లక్షల నుంచి మొదలవుతుంది. సాధారణ ధర రూ.23.60 లక్షలు. అంటే రూ.8.35 లక్షల వరకు ప్రారంభ వ్యయం తగ్గుతుంది. 61kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.4.99 చెల్లించాలి.

BaaS విధానం వల్ల ఎలక్ట్రిక్‌ కార్ల ప్రారంభ ధర భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో EV కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌. అయితే కారు ధరతో పాటు ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే బ్యాటరీ ఛార్జీని కూడా లెక్కించాలి. రోజువారీ ప్రయాణం ఎక్కువగా ఉండేవాళ్లు మొత్తం ఖర్చును ముందుగానే అంచనా వేసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget