అన్వేషించండి

RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, తన క్లాసిక్‌ 350లో గోర్ఖా ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. కొత్త గోర్ఖా గ్రీన్‌ కలర్‌, ప్రత్యేక డీకాల్స్‌తో వచ్చిన ఈ బైక్‌లో యాంత్రిక మార్పులు లేవు.

Royal Enfield Classic 350 Gorkha Edition: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ డైహార్డ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఈ బైక్‌ కంపెనీ, క్లాసిక్‌ 350లో కొత్త గోర్ఖా ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్లాసిక్‌ 350కి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు, భారత సైన్యంలోని గోర్ఖా రెజిమెంట్‌ గౌరవార్ధం ఈ ఎడిషన్‌ను రూపొందించింది. గోర్ఖా సైనికుల ధైర్యం & క్రమశిక్షణకు గుర్తుగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధరను రూ.2.11 లక్షలుగా నిర్ణయించింది.

కొత్త గోర్ఖా గ్రీన్‌ కలర్‌
క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త గోర్ఖా గ్రీన్‌ కలర్‌. సైనిక వాహనాల్లో కనిపించే మిలిటరీ గ్రీన్‌ తరహా మ్యాట్‌ షేడ్‌ను ఈ బైక్‌కు ఇచ్చారు. దీంతో క్లాసిక్‌ 350 కి మరింత రఫ్‌ & రెట్రో లుక్‌ వచ్చింది.

సైడ్‌ ప్యానల్స్‌పై గోర్ఖా రెజిమెంట్‌ అధికారిక చిహ్నమైన క్రాస్‌డ్‌ ఖుక్రీలను ప్రత్యేక డిజైన్‌గా యాడ్‌ చేశారు. ఫ్యూయల్‌ ట్యాంక్‌పై గోర్ఖా ఎడిషన్‌ స్టిక్కర్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక డిజైన్లతో.. సాధారణ క్లాసిక్‌ 350తో పోలిస్తే గోర్ఖా ఎడిషన్‌ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఇంజిన్‌లో మార్పులు లేవు
లుక్‌లో మార్పులు చేసినప్పటికీ పనితీరు విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ క్లాసిక్‌ 350లో ఉన్న అదే 349cc సింగిల్‌ సిలిండర్‌ J-సిరీస్‌ ఇంజిన్‌ను ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్‌ 20.2hp పవర్‌ & 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు

ఇంజిన్‌కు 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. బ్రేకింగ్‌ కోసం డ్యూయల్‌ ఛానల్‌ ABSను అందించారు. బైక్‌ ఎలక్ట్రానిక్‌ ఫీచర్లలో కూడా పెద్దగా మార్పులు లేవు. సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ కొనసాగుతుంది.

గోర్ఖా ఎడిషన్‌లో ట్రిప్పర్‌ పాడ్‌ ఉండదు. అవసరమైతే దీనిని యాక్సెసరీగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.

మరికొన్ని ఫీచర్లు
గోర్ఖా ఎడిషన్‌లో అసిస్ట్‌ & స్లిప్పర్‌ క్లచ్‌ను అందించారు. USB టైప్‌-C ఛార్జింగ్‌ పోర్ట్‌ కూడా ఉంది. ఈ రెండు ఫీచర్లు సాధారణ క్లాసిక్‌ 350లోనూ ఇటీవల అందుబాటులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: 2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!

ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350ను ఏడు రంగుల్లో విక్రయిస్తున్నారు. వేరియంట్లను బట్టి సింగిల్‌ ఛానల్‌ లేదా డ్యూయల్‌ ఛానల్‌ ABS అందుబాటులో ఉంటుంది. బేస్‌ వేరియంట్‌లో సింగిల్‌ ఛానల్‌ ABS ఉంటుంది. మిగిలిన వేరియంట్లలో డ్యూయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తుంది.

ధర & బుకింగ్స్‌
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ ధర రూ.2.11 లక్షలు. క్లాసిక్‌ 350 లైనప్‌లో ఇది మధ్య స్థాయిలో ఉంటుంది. ఈ బైక్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget