తక్కువ బడ్జెట్, ఫీచర్లతో కూడిన SUV కావాలంటే సెల్టోస్ మంచిది. ఎక్కువ క్యాబిన్ స్పేస్, 5 స్టార్ సేఫ్టీ కావాలంటే టాటా సియెర్రాను ఎంచుకోవచ్చు.
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra vs Kia Seltos Price : టాటా సియారా, కియా సెల్టోస్‌లో కార్లు ఒకే మొత్తం చెల్లించి ఫైనాన్స్ ద్వారా తీసుకుంటే నెలవారీ EMI ఏ కారుకు తక్కువ పడుతుంది తెలుసుకోండి.

- దీర్ఘకాలిక లోన్‌కు సెల్టోస్ ఈఎంఐ కొంచెం మెరుగు.
Tata Sierra vs Kia Seltos Price EMI: భారత్‌లో గత కొన్నేళ్లుగా కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. టాటా మోటార్స్, కియా కార్ల హవా నడుస్తోంది. ఈ 2 కంపెనీలు తమ మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో సత్తా చాటుతున్నాయి. ఒకవైపు Kia Seltos తన లుక్స్, హైటెక్ ఫీచర్లు, పనితీరు కారణంగా కస్టమర్ల ఆదరణ పొందుతోంది. మరోవైపు Tata Motors పవర్‌ఫుల్ SUV Tata Sierra తన కొత్త, మోడ్రన్ లుక్‌లో మార్కెట్‌లో దూసుకెళ్తోంది.
మీ కుటుంబం కోసం మీరు కూడా ఈ రెండింటిలో ఏదో ఒక SUVని కొనుగోలు చేయాలని భావిస్తే, ఏ కారు నెలవారీ EMI మీపై తక్కువ భారం వేస్తుంది అని తెలుసుకోండి. సరైన కారు ఎంపిక చేసుకోవడానికి కేవలం షోరూమ్ ధర చూస్తే సరిపోదు. వాటి ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్ మొత్తం, వడ్డీ వివరాలను తెలుసుకోవాలి. కనుక Tata Sierra, Kia Seltosలో ఏ కారు EMI తక్కువగా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నాం.
కియా సెల్టోస్ ధర (Kia Seltos Price)
Kia Seltos బేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 10.90 లక్షల దగ్గర ఉంది. వీటికి అదనంగా RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర దాదాపు 12.70 లక్షల రూపాయలు అవుతుంది. ఈ కారును కొనడానికి సుమారు 10 శాతం అంటే 1.30 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, దాదాపు 11.40 లక్షల కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ లోన్‌ను 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకి తీసుకుంటే, మీ నెలవారీ EMI దాదాపు 23,660 రూపాయలు అవుతుంది. మొత్తం 5 సంవత్సరాల్లో మీరు బ్యాంకుకు వడ్డీ రూపంలో దాదాపు 2.79 లక్షల వరకు చెల్లిస్తారు.
Also Read: రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
టాటా సియెర్రా ఆన్-రోడ్ ధర?
ఇక Tata Sierra బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పన్నులు, ఇన్సూరెన్స్, ఆర్టీవో ఛార్జీలు కలిపిన తర్వాత టాటా సియెర్రా ఆన్-రోడ్ ధర సుమారు రూ.13.25 లక్షల నుంచి 13.40 లక్షల రూపాయల వరకు ఉంటుంది. Tata Sierra మొత్తం ఆన్-రోడ్ ధర 13.30 లక్షలు అనుకుందాం. దీనిపై 10 శాతం అంటే సుమారు 1.33 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మీ లోన్ దాదాపు రూ.11.97 లక్షలు అవుతుంది.

మీరు 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల లోన్ టర్మ్ ఎంచుకుంటే, ఆ లెక్కన Tata Sierra కొన్నందుకు మీ నెలవారీ EMI సుమారు రూ.24,840 అవుతుంది. అంటే Kia Seltosతో పోలిస్తే Sierra నెలవారీ ఈఎంఐ సుమారు 1,180 రూపాయలు ఎక్కువగా ఉంది.
7 సంవత్సరాలకు EMI ఎంత
మీ నెలవారీ EMI ఇంకా తగ్గించుకోవాలనుకుంటే, 7 సంవత్సరాల లోన్ కాలాన్ని ఎంచుకోవాలి. అలాంటప్పుడు 9 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల లోన్‌పై Kia Seltos నెలవారీ EMI సుమారు 18,330 రూపాయలు అవుతుంది.
Tata Sierra కోసం 7 సంవత్సరాలకి మీరు ప్రతి నెలా సుమారు 19,250 చెల్లించాల్సి ఉంటుంది. 7 సంవత్సరాల లోన్ ఎంచుకుంటే 2 కార్ల వాయిదాల్లో నెలకు సుమారు రూ. 920 మేర తేడా ఉంటుంది. దీర్ఘకాలిక లోన్‌లో Kia Seltos EMI కొంచెం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.
Also Read: Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఏ కారు సరైనది?
EMI లెక్కను చూస్తే, Kia Seltos ప్రారంభ ఆన్-రోడ్ ధర కొంచెం తక్కువగా ఉండటంతో నెలవారీ ఈఎంఐ Tata Sierraతో పోలిస్తే సుమారు రూ.1,000 నుంచి 1,200 రూపాయల వరకు తక్కువ పడుతుంది. మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉండి, తక్కువ వాయిదాలో, ఫీచర్లతో నిండిన SUV కావాలనుకుంటే Seltos బెస్ట్ ఆప్షన్.
కానీ మీరు Tata మోటార్స్ ఒరిజినల్ బాక్సీ SUV డిజైన్, ఎక్కువ క్యాబిన్ స్పేస్, 5 స్టార్ సేఫ్టీపై నమ్మకం కావాలంటే ప్రతి నెలా 1,000 రూపాయలు అదనంగా చెల్లించాలి. కారు కొనుగోలు చేసే ముందు రెండు డీలర్‌షిప్‌లలో ప్రస్తుత డిస్కౌంట్, ఆఫర్లను తప్పకుండా చెక్ చేశాకే కొనుగోలు చేయాలి.
Frequently Asked Questions
తక్కువ బడ్జెట్ లేదా 5 స్టార్ సేఫ్టీ ప్రాధాన్యతను బట్టి ఏ కారును ఎంచుకోవాలి?
ట్రెండింగ్ వార్తలు






















