అన్వేషించండి

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

Maruti Baleno on EMI: మారుతి బలేనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు చెందిన కారు. Toyota Glanza, టాటా ఆల్ట్రోజ్, హ్యూందాయ్ i20 వంటి కార్లతో పోడీపడే ఈ కారును డౌన్‌పేమెంట్ చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తక్కువ బడ్జెట్‌లో బాలెనోను ₹50,000 డౌన్‌పేమెంట్‌తో పొందవచ్చు.
  • డౌన్‌పేమెంట్‌తో కారు కొంటే, వడ్డీతో మొత్తం ₹9 లక్షలు.
  • రాబోయే కొత్త బాలెనో డిజైన్, ఇంటీరియర్, ఇంజిన్లలో మార్పులు.

ఫ్యామిలీ జర్నీ కోసం కారు కొనాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. మీరు కనుక తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మారుతి బలేనో (Maruti Baleno) బెస్ట్ ఆప్షన్ కావచ్చు. అయితే మీ వద్ద కారు కొనేందుకు మొత్తం నగదు లేకపోయినా కొనుగోలు చేయవచ్చు. మీరు రూ. 50,000 చెల్లించి కూడా మారుతి బలేనో బేస్ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ కారును ఫైనాన్స్ ద్వారా తీసుకుంటే ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి పూర్తి వివరాలు తెలుసుకోండి. 

మారుతి సుజుకి బలేనో బేస్ వేరియంట్ పేరు Sigma. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.99 లక్షలుగా ఉంది. దీనిని హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, ఎక్స్-షోరూమ్ ధరతో పాటు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఖర్చులు కలుపుకుని ఆన్-రోడ్ ధర సుమారు రూ.7.18 లక్షల వరకు ఉంటుంది.

ఎంత డౌన్ పేమెంట్‌పై కారును కొనవచ్చు?
మీరు Baleno Sigma వేరియంట్ కోసం కనీసం రూ. 50,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుండి కార్ లోన్ పొందవచ్చు. అప్పుడు మీరు ఈ కారు కోసం రూ.6.68 లక్షల లోన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఈ లోన్‌ను 4 సంవత్సరాలకి 9 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే, ప్రతి నెలా 16,612 EMI చెల్లించాల్సి ఉంటుంది. అదే 5 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI సుమారు ₹13,857 అవుతుంది.


రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

ఒకవేళ 6 సంవత్సరాలకు అయితే ఈఎంఐ రూ. 12,033, 7 సంవత్సరాల లోన్ అయితే ప్రతి నెలా EMI రూ.10,740 చెల్లించాలి. EMI అనేది బ్యాంక్ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, మీ లోన్ ప్రొఫైల్‌ ఆధారంగా మారవచ్చు. 9 శాతం వడ్డీ రేటుపై ఏడేళ్లపాటు లోన్ చెల్లిస్తే, కేవలం వడ్డీ రూపంలోనే సుమారు ₹2.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ఖర్చులు, వడ్డీని కలిపితే మీరు కారు కోసం మొత్తం రూ.9 లక్షల వరకు ఖర్చు చేస్తారు. 

మారుతి బలేనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ కారు. మార్కెట్‌లో Toyota Glanza, Tata Altroటతో పాటు Hyundai i20 వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. ధర పరంగా చూస్తే Nissan Magnite, రెనాల్ట్ కైగర్ (Renault Kiger), మారుతి స్విఫ్ట్ (Maruti Swift), Fronx వంటి కార్లతోనూ పోటీ పడుతుంది. 

త్వరలో మార్కెట్లోకి కొత్త మారుతి బలేనో కారు
కొత్త మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు కారు ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో చూడవచ్చు. దీని ఫ్రంట్ లుక్‌ను మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా మార్చవచ్చు. ఇందులో కొత్త డిజైన్ గ్రిల్, అప్‌డేటెడ్ LED హెడ్‌లైట్లు, కొత్త ఫ్రంట్ బంపర్ ఇచ్చే అవకాశం ఉంది. DRLలు, టైల్‌లైట్లలో కూడా మార్పు చేయవచ్చు. దాంతో కారు డిజైన్ మరింత మోడ్రన్ అనిపిస్తుంది. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ద్వారా దీని రోడ్ ప్రెజెన్స్‌ను మరింత మెరుగుపరుస్తాయి.

బలేనో ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌లో కూడా మార్పులుంటాయి. కంపెనీ ఇందులో కొత్త అపోల్స్టరీ, మంచి క్వాలిటీ డ్యాష్‌బోర్డ్‌ అందించవచ్చు. ఇవే కాకుండా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఇవ్వవచ్చు. ఈ మార్పులతో కొత్త బలేనో క్యాబిన్ గతంలో కంటే మరింత ప్రీమియంగా, టెక్నాలజీతో కనిపిస్తుంది.

కొత్త మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ సిఎన్‌జి (CNG) ఆప్షన్‌తో కూడా రావొచ్చు. దీనితో పాటు కంపెనీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లేదా హైబ్రిడ్ టెక్నాలజీ ఆప్షన్‌ లాంచ్ చేయవచ్చు. హైబ్రిడ్ వర్షన్ వస్తే, కారు పెర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజ్ కూడా పెరుగుతుంది. హైబ్రిడ్ బలేనో లీటరుకు 30 నుండి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి. 

Frequently Asked Questions

మారుతి బలేనో కారును ఎంత కనీస డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు?

మీరు మారుతి బలేనో బేస్ వేరియంట్‌ను రూ. 50,000 డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా పొందవచ్చు.

మారుతి బలేనో సిగ్మా వేరియంట్ ఆన్-రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో మారుతి బలేనో సిగ్మా వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 7.18 లక్షలు. ఇందులో ఎక్స్-షోరూమ్ ధర, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఖర్చులు ఉంటాయి.

5 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే మారుతి బలేనోకు నెలవారీ EMI ఎంత?

రూ. 50,000 డౌన్ పేమెంట్ చేసి 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే, ప్రతి నెలా సుమారు రూ. 13,857 EMI చెల్లించాలి.

రాబోయే మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో ఏ ప్రధాన మార్పులు ఉంటాయి?

కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో స్పోర్టీ ఫ్రంట్ లుక్, కొత్త డిజైన్ గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌లైట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, 360-డిగ్రీ కెమెరా వంటి మార్పులు ఉంటాయి.

కొత్త మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఇంజిన్ ఆప్షన్లు ఏమైనా ఉంటాయా?

అవును, కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్‌ CNG ఆప్షన్‌తో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ లేదా హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా రావొచ్చు. హైబ్రిడ్ వర్షన్ 30-35 km/l మైలేజ్ ఇవ్వగలదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget