అన్వేషించండి

AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు యథావిధిగా నవంబర్ 5న నిర్వహించనున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీలో నవంబర్ 5న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.
  • తుపాను వర్షాల వాయిదా ప్రచారానికి ఎస్ఈసీ తెరదించింది.
  • ప్రతికూల వాతావరణం ఉన్న చోట మాత్రమే ఎన్నికలు వాయిదా.
  • గుంటూరులోని 3 మండలాల్లో పరిషత్ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా.

 AP Local Body Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వరుసు తుపానులతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అయితే వాతావరణ పరిస్థితుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ వాయిదా అని ప్రచారం జరిగింది. దాంతో జిల్లా పరిషత్ (ZPTC), మండల పరిషత్ (MPTC) ఎన్నికల నిర్వహణకు  రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే నవంబర్ 5న యథావిధిగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్ఈసీ స్పష్టం చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నచోట మాత్రమే ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న గుంటూరులో 3 మండలాల్లో (పెదనందిపాడు, ఫిరంగిపురం, కాకుమాను) లలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

జిల్లాల కలెక్టర్లతో ఏపీ ఎస్ఈసీ సమీక్ష

ఇటీవల కురిసిన తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదలు ముంచెత్తడంతో ఎన్నికల నిర్వహణపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం (నవంబర్ 4న) అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో తుపాను నష్టం, క్షేత్రస్థాయిలో వరదల తీవ్రత, పోలింగ్ నిర్వహణ పరిస్థితులపై క్షుణ్ణంగా చర్చించారు. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టాయని, ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్లు ఎన్నికల కమిషనర్‌కు నివేదించారు. 

వర్షాలు తగ్గాయని ఎన్నికలపై ముందుకు

కలెక్టర్ల నుంచి వచ్చిన స్పష్టమైన నివేదికలను ఎస్ఈసీ పునేఠా పరిశీలించారు. పరిస్థితులు అనుకూలించిన చోట పోలింగ్ ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా, నిష్పాక్షికంగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. మరీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నచోట మాత్రమే ఎన్నికల నిర్వహణ వాయిదా వేయడంపై తమకు సమాచారం అందించాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులను అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. 

Frequently Asked Questions

ZPTC, MPTC ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబడతాయి?

రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిర్ణయం ప్రకారం, ముందస్తు షెడ్యూల్ ప్రకారమే నవంబర్ 5న ZPTC, MPTC ఎన్నికలు నిర్వహించబడతాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేని చోట్ల పోలింగ్ యథావిధిగా జరుగుతుంది.

ZPTC, MPTC ఎన్నికల నిర్వహణపై మొదట్లో సందేహాలు ఎందుకు వ్యక్తమయ్యాయి?

రాష్ట్రంలో కురిసిన వరుస తుపానులతో భారీగా వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతుందేమోనని సందేహాలు వ్యక్తమయ్యాయి.

ZPTC, MPTC ఎన్నికలు ఏ ఏ ప్రాంతాల్లో వాయిదా పడ్డాయి?

ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, ఫిరంగిపురం, కాకుమాను మండలాల్లో పరిషత్ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Politics:రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
Pawan Gifted Property To Children: విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ReNew Power Investments: ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
CII Partnership Summit 2026 Live Updates: ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Embed widget