అన్వేషించండి

Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం

Ongole Mayor Election Results | ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఒంగోలు మేయర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప ఘన విజయం సాధించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఒంగోలు మేయర్‌గా టీడీపీ శ్రీశిల్ప 37వేల ఓట్ల మెజార్టీతో గెలుపు.
  • ఒంగోలు 62 డివిజన్లలో కూటమికి 47, వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి.
  • మరుసు తుపాను వర్షాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా మొదలైంది.
  • రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం, వైసీపీ ఘోర పరాజయం.

ఒంగోలు: ఎట్టకేలకు ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్ ఫలితం వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ (TDP) కైవసం చేసుకుంది. ఒంగోలు మేయర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప ఘన విజయం సాధించారు. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కుప్పం ప్రసాద్‌పై ఆమె  37,172 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దాంతో కూటమి ఖాతాలోకి కార్పొరేషన్ చేరింది.

శ్రీశిల్ప విజయం ఖాయం కావడంతో ఒంగోలు నగరం అంతటా కూటమి నాయకులు, శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం 62 డివిజన్లు ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థలో టీడీపీ 39 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ 11 కార్పొరేషన్లు, జనసేన 8 చోట్ల, ఇతరులు 3, బీజేపీ 1 స్థానాలను దక్కించుకున్నాయి. 

పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకే లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, మరుసు తుపాను ప్రభావంతో భారీగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభించారు. అయితే నిరంతరాయంగా సాగిన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో రోజైన బుధవారం మధ్యాహ్నానికి ముగిసింది. ఫలితాలు వెలువడిన వెంటనే రిటర్నింగ్ అధికారి శ్రీశిల్పకు విన్నింగ్ డిక్లరేషన్ సర్టిఫికెట్ అందజేశారు. 

ఏపీలో అన్ని ప్రాంతాల్లోనూ కూటమిదే హవా..

ఆంధ్రప్రదేశ్‌లో 13 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల ఛైర్‌పర్సన్‌ స్థానాలకు జరిగిన పురపాలక ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలనే వ్యత్యాసం లేకుండా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు కూటమికి పెద్దఎత్తున కలసివచ్చాయి. వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా కడపతో పాటు పులివెందులలో కూడా ఆ పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. కూటమి నేతల అనైక్యత కారణంగా కేవలం బేతంచర్ల, నందికొట్కూరు, నాయుడుపేట వంటి 2- 3 ప్రాంతాల్లో మాత్రమే వైసీపీ ప్రభావం చూపింది.

Frequently Asked Questions

ఒంగోలు కార్పొరేషన్ మేయర్‌గా ఎవరు విజయం సాధించారు?

ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప గెలుచుకున్నారు. ఆమె వైసీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌పై 37,172 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఒంగోలు నగరపాలక సంస్థలో ఏ పార్టీలు ఎన్ని స్థానాలు గెలుచుకున్నాయి?

మొత్తం 62 డివిజన్లలో టీడీపీ 39 స్థానాలు, వైసీపీ 11, జనసేన 8, ఇతరులు 3, బీజేపీ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. దాంతో కార్పొరేషన్ కూటమి ఖాతాలోకి చేరింది.

ఒంగోలు ఓట్ల లెక్కింపు ఎందుకు ఆలస్యంగా ప్రారంభమైంది?

మరుసు తుపాను ప్రభావంతో భారీగా కురిసిన వర్షాల కారణంగా ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం మొదలై బుధవారం మధ్యాహ్నానికి ముగిసింది.

ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల్లో కూటమి మొత్తంమీద ఎలా రాణించింది?

ఏపీలో 13 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Politics:రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
Pawan Gifted Property To Children: విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget