అన్వేషించండి

Ventilated Seats: లాంగ్‌ ట్రిప్పుల్లోనూ చల్లగా, హాయిగా జర్నీ.. ఈ 10 కార్లలో వెంటిలేటెడ్ సీట్లు.. మీ బడ్జెట్‌లోనే!

భారత్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్న 10 చౌకైన కార్ల వివరాలు. రెనాల్ట్ కైగర్ నుంచి టాటా నెక్సాన్ వరకు ధరలు, ఇంజిన్, వేరియంట్ల వివరాలు తెలుసుకోండి.

Budget Car With Ventilated Seats: కారులో కాస్త ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు సీట్ల నుంచి వచ్చే వేడి అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటిలేటెడ్ సీట్లు ఉపయోగపడతాయి. ఈ ఫీచర్ ద్వారా.. ముందు సీట్ల లోపలి నుంచి గాలి ప్రసరిస్తుంది. తద్వారా, వేడి తగ్గి ప్రయాణంలో కొంత చల్లదనం లభిస్తుంది. పదేళ్ల క్రితం వరకు ఈ ఫీచర్ సాధారణ కార్లలో చాలా అరుదుగా ఉండేది. వెంటిలేటెడ్ సీట్లు కావాలంటే సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం తక్కువ ధర కార్లలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మన మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలతో కలిపి చాలా మోడళ్లలో వెంటిలేటెడ్ సీట్లు లభిస్తున్నాయి.

మారుతి, సిట్రోయెన్ బ్రాండ్ల నుంచి రెండేసి మోడళ్లు ఈ 10 బడ్జెట్‌ కార్ల జాబితాలో ఉన్నాయి. హ్యుందాయ్, టాటా, కియా, టయోటా, రెనాల్ట్, స్కోడా నుంచి ఒక్కో మోడల్ చోటు దక్కించుకున్నాయి.

10. టాటా నెక్సాన్

ధర: రూ.12.42 లక్షల నుంచి రూ.14.22 లక్షలు

టాటా నెక్సాన్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు టాప్ స్పెక్ Fearless+ PS వేరియంట్‌లో మాత్రమే లభిస్తాయి. ఈ వేరియంట్‌లో CNG ఆప్షన్ కూడా ఉంది. దీంతో వెంటిలేటెడ్ సీట్లు ఉన్న అత్యంత చౌకైన CNG మోడల్‌గా నెక్సాన్ నిలుస్తోంది.

ఈ SUVలో 120hp శక్తినిచ్చే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 100hp CNG వెర్షన్, 115hp 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. టాప్ పెట్రోల్ వేరియంట్‌లో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌లు లభిస్తాయి. డీజిల్‌లో 6-స్పీడ్ మాన్యువల్, AMT ఆప్షన్లు ఉన్నాయి.

9. హ్యుందాయ్ వెన్యూ

ధర: రూ.11.94 లక్షల నుంచి రూ.15.65 లక్షలు

రెండో తరం హ్యుందాయ్ వెన్యూ HX8, HX10 టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. కొత్త వెన్యూ N Line N10 వేరియంట్‌లోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఈ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ లేదా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపిక చేసుకోవచ్చు. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. Level 2 ADAS, రెండు 12.3-అంగుళాల డిస్‌ప్లేలు ఈ కారు ప్రత్యేకతల్లో కొన్ని.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్‌ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రూ.3.35 లక్షల వరకు తగ్గింపు! ఏ కారు కొంటే ఎక్కువ లాభమో తెలుసా?

8. స్కోడా కైలాక్

ధర: రూ.11.85 లక్షల నుంచి రూ.13.09 లక్షలు

స్కోడా తొలి కాంపాక్ట్ SUV కైలాక్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు Prestige, Prestige+ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. ఇందులో 115hp శక్తినిచ్చే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు.

7. కియా సోనెట్

ధర: రూ.11.84 లక్షల నుంచి రూ.13.89 లక్షలు

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్న కియా SUVల్లో సోనెట్ అత్యంత చౌకైన మోడల్. HTX, GTX+, X-Line వేరియంట్లలో ఈ ఫీచర్ లభిస్తుంది.

ఈ వేరియంట్లలో 120hp 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 116hp 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో 7-స్పీడ్ DCT అందుబాటులో ఉంటుంది. డీజిల్‌లో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే HTX డీజిల్ మాన్యువల్‌లో వెంటిలేటెడ్ సీట్లు లేవు. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రం ఈ ఫీచర్ ఉంది.

6. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్

ధర: రూ.11.62 లక్షల నుంచి రూ.14.52 లక్షలు

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్‌లో టాప్ స్పెక్ Max వేరియంట్‌లో మాత్రమే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఈ వేరియంట్ 5-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

Max వేరియంట్‌లో 82hp 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ లేదా 110hp 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లు ఉన్న అత్యంత చౌకైన Citroen SUV ఇదే. ఈ ఫీచర్‌తో భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన మిడ్‌సైజ్ SUV కూడా ఇదేనని సమాచారం.

ఇది కూడా చదవండి: Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు

5. సిట్రోయెన్ బసాల్ట్

ధర: రూ.11.34 లక్షల నుంచి రూ.13.90 లక్షలు

సిట్రోయెన్ బసాల్ట్‌లోనూ వెంటిలేటెడ్ సీట్లు టాప్ స్పెక్ Max వేరియంట్‌లో మాత్రమే ఉంటాయి. ఇందులో 82hp 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్‌తో పొందవచ్చు.

మరోవైపు 110hp 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపిక కూడా ఉంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది.

4. మారుతి బ్రెజ్జా

ధర: రూ.11.26 లక్షల నుంచి రూ.13.55 లక్షలు

ఫేస్‌లిఫ్ట్ మారుతి బ్రెజ్జాలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు టాప్ స్పెక్ ZXi+ వేరియంట్‌లో అందిస్తున్నారు. ఇందులో 110hp 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. 103hp 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది.

3. టయోటా గ్లాంజా

ధర: రూ.9.99 లక్షల నుంచి రూ.10.98 లక్షలు

టయోటా గ్లాంజాలో V, V(O) టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2026 ఫేస్‌లిఫ్ట్‌తో ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. మారుతి బాలెనోతో పాటు ఈ ఫీచర్ ఉన్న హ్యాచ్‌బ్యాక్‌గా గ్లాంజా నిలుస్తోంది.

ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. తక్కువ వేరియంట్లైన S, Gలో 70hp CNG ఆప్షన్ కూడా లభిస్తుంది.

2. మారుతి బలెనో

ధర: రూ.9.10 లక్షల నుంచి రూ.9.99 లక్షలు

మారుతి బలెనోలో Alpha, Alpha (O) వేరియంట్లలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. 

బలెనో Alpha వేరియంట్లలో 83hp 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

1. రెనాల్ట్ కైగర్

ధర: రూ.8.50 లక్షల నుంచి రూ.10.40 లక్షలు

భారత్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్న అత్యంత చవకైన కారు రెనాల్ట్ కైగర్. ఈ ఫీచర్ టాప్ స్పెక్ Emotion వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

ఈ వేరియంట్‌లో 72hp 1.0-లీటర్ పెట్రోల్, 100hp 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. సాధారణ పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది. టర్బో పెట్రోల్ వెర్షన్‌లో CVT ఎంపిక కూడా ఉంది.

ధరల వివరాలు

ఈ జాబితాలో రెనాల్ట్ కైగర్ రూ.8.50 లక్షల ప్రారంభ ధరతో మొదటి స్థానంలో ఉంది. మారుతి బలెనో రూ.9.10 లక్షలతో రెండో స్థానంలో ఉండగా, టయోటా గ్లాంజా రూ.9.99 లక్షలతో మూడో స్థానంలో ఉంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget