Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Emotional Story of Colorectal Cancer Patient : నా జీవితానికి ఇదే చివరి దీపావళి కావచ్చు అంటూ ఓ 21 ఏళ్ల యువకుడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారణం ఏంటంటే..

- 21 ఏళ్ల యువకుడు నాల్గవ దశ కొలొరెక్టల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
- ఇదే తన చివరి దీపావళి కావచ్చని రెడ్డిట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు.
- ప్రయాణాలు, కలలు నెరవేరకుండానే జీవితం ముగుస్తుందని వాపోయాడు.
- ప్రపంచం నుండి నిశ్శబ్దంగా వెళ్లేముందు తన ఉనికిని తెలిపాడు.
Diwali Lights and Cancer Patient : దీపావళి అంటే వెలుగుల పండుగ. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించడం, ఇంటి నిండా సందడి చేసుకోవడం చాలామందికి ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇదే తన చివరి దీపావళి కావచ్చని.. మళ్లీ దీపావళి చూడలేనేమో అంటూ 21 ఏళ్ల యువకుడు తెలిపాడు. తన ఆవేదనను పోస్ట్ ద్వారా వ్యక్తపరిచాడు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఓ యువకు తనకు 21 ఏళ్లని.. 2023లో తనకి కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని రాసుకొచ్చాడు. అప్పటి నుంచి ఎన్నో కీమోథెరపీ సెషన్లు జరిగాయని.. ఆస్పత్రిలో చికిత్సలు తీసుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ప్రయత్నించడానికి ఏమి మిగల్లేదని.. క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉందని తెలిపాడు. డాక్టర్లు కూడా రోజులు లెక్కపెట్టుకోవచ్చని చెప్పినట్లు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ ఏడాది చివరి వరకు కూడా తాను ఉండకపోవచ్చనే ఆలోచన తనను వెంటాడుతోందని.. ఇదే తన చివరి దీపావళి కావచ్చని రాశాడు.
Also Read : ఇన్ఫెక్షన్లతో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇదే చివరి దీపావళి ఏమో..
View this post on Instagram
దీపావళి దగ్గరికి వస్తుంది.. వీధుల్లో కనిపిస్తున్న రంగురంగుల దీపాలను చూస్తున్నాను. ఆ వెలుగులు, నవ్వులు, పండుగ సందడి తనకు గుర్తొస్తున్నాయని పేర్కొన్నాడు. అయితే నేను చూసే చివరి దీపావళి కావచ్చు అనే ఆలోచన కూడా.. తనను బాధిస్తున్నట్లు చెప్పాడు. తన జీవితం ముగింపు దిశగా సాగుతుంటే.. ప్రపంచం ఎప్పటిలాగే ముందుకు వెళ్తోందని భావోద్వేగంగా రాశాడు. వచ్చే ఏడాది కూడా దీపావళి వస్తుందని, తన స్థానంలో మరొకరు దీపాలు వెలిగిస్తారని, తాను మాత్రం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతానేమోనని తన ఆవేదనను పంచుకున్నాడు.
21 ఏళ్లకే ఆగిపోయిన కలలు
చాలా ట్రావెల్ చేయాలనుకున్నానని.. సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నట్లు, పరిస్థితులు బాగుంటే కుక్కను దత్తత తీసుకోవాలని ఎన్నో కలలు కన్నట్లు తెలిపాడు. కానీ నాకు సమయం లేదు. ఇంట్లో తల్లిదండ్రుల ముఖాల్లో కనిపిస్తున్న బాధను చూస్తే నాకు చాలా కష్టంగా ఉందని.. ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. ఆ తప్పులు చేయకండి
ప్రతి క్షణం విలువైనదే..
తాను ఎందుకు ఈ పోస్ట్ చేస్తున్నానో తనకు కూడా పూర్తిగా తెలియదని చివర్లో రాశాడు. బహుశా తన మనసులోని మాటలను బయటకు చెప్పాలని.. ఈ ప్రపంచం నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయే ముందు తన ఉనికికి ఒక చిన్న గుర్తును వదిలి వెళ్లాలని అనిపించిందేమోనంటూ లెటర్ ముగించాడు.
లైఫ్‌ని లైట్ తీసుకోకండి..
ఈ యువకుడి మాటలు జీవితంలోని జరిగే చిన్న చిన్న క్షణాల విలువను హైలెట్ చేస్తున్నాయి. జాబ్ స్ట్రెస్, ఇంకేదో కారణాలు చెప్పి.. చాలామంది తమ లైఫ్‌లో జరిగే చిన్న చిన్న సంతోషాలకు కూడా దూరం అవుతున్నారు. ఏ రూపంలో.. ఎప్పుడు మృత్యువు వస్తుందో తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని ఎప్పుడూ లైట్ తీసుకోకండి. మీకు నచ్చినట్టు.. నచ్చినవారితో టైమ్ స్పెండ్ చేస్తూ.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేందుకు ట్రై చేయండి.
Also Read : 30, 40 ఏళ్లకే పెద్దపేగు క్యాన్సర్, కారణాలు ఇవే.. ఈ లక్షణాలను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు
చాలామంది వివిధ కారణాలతో కుటుంబానికి దూరమవుతుంటారు. అలాగే సంపాదనలో పడి తమ గురించి తాము పట్టించుకోరు. చాలామందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది. తిరగాలని.. నచ్చిన డ్రెస్ వేసుకోవాలని.. నచ్చిన ఫుడ్ తినాలని.. ఎలా ఎన్నో కోరికలను కంట్రోల్ చేసుకుని.. స్ట్రెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటారు. కానీ ఉన్నంతలో.. మీరు చేయగలిగే పనులు.. మీరు వెళ్లగలిగే ప్రదేశాలకు వెళ్తూ ఉండండి. ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోండి. ఈ దీపావళి నుంచి మీలోని భయాలు, కోపాలు, ఒత్తిడి నాశనమై.. అందమైన జీవితం మీ సొంతమయ్యేలా ప్లాన్ చేసుకోండి.
Also Read : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























