అన్వేషించండి

Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

Ferrari First EV: వేలం వేసిన కారు మోడల్ సాధారణ ప్రొడక్షన్ కారు కాదు. దీనికి ప్రత్యేకంగా ‘Chassis 0’ అనే పేరు పెట్టారు, Tailor Made డివిజన్ దీన్ని అత్యంత ప్రత్యేకంగా తయారు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫెరారీ తొలి EV కారు లూస్, $40 మిలియన్లకు వేలం రికార్డు.
  • అమెరికన్ బిలియనీర్ కొన్నారు, అంచనా ధర 40 రెట్లు పెరిగింది.
  • ఫెరారీ EV యుగంలోకి భారీ మార్పు, 1050 CV శక్తితో.
  • వేలంలో వచ్చిన నిధులు ఫెరారీ ఫౌండేషన్ విద్యా ప్రాజెక్టులకు.

Ferrari First EV:Ferrari పేరు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, వేగవంతమైన కార్లలో ఒకటిగా వినిపిస్తుంది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెడుతూ తన తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు Ferrari Luceని పరిచయం చేసింది. లాంచ్ అయిన వెంటనే ఈ కారు ఒక రికార్డు సృష్టించింది. అది మొత్తం ఆటో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. Luce ప్రత్యేక వన్-ఆఫ్ మోడల్‌ను వేలంలో 4 కోట్ల డాలర్లు అంటే సుమారు 382 కోట్ల రూపాయలకు అమ్మారు. కొత్త కారు వేలంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర.

Ferrari Luceలో వేలం వేసిన మోడల్ సాధారణ ప్రొడక్షన్ కారు కాదు. దీనికి ప్రత్యేకంగా ‘Chassis 0’ అనే పేరు పెట్టారు, ఫెరారీకి చెందిన టయలర్‌ మేడ్‌ డివిజన్ దీన్ని అత్యంత ప్రత్యేకంగా తయారు చేసింది. అమెరికాలోని కానిఫోర్నియాలో జరిగిన మోంటెరీ కార్‌ వీక్‌ సందర్భంగా RM Sotheby's ద్వారా ఈ వేలం నిర్వహించారు. ఈ కారును అమెరికన్ బిలియనీర్, దీర్ఘకాల ఫెరారీ కలెక్టర్ హార్బర్ట్‌ ఏ వర్థీమ్‌ కొనుగోలు చేశారు.

40 రెట్లు ఎక్కువ ధర

ఈ కారుకు వేలానికి ముందు దాదాపు 11 లక్షల డాలర్లు అంటే సుమారు 9 కోట్ల రూపాయల వరకు ధర ఉంటుందని అంచనా వేశారు. కానీ వేలం సమయంలో బిడ్డింగ్ వేగంగా పెరిగి చివరికి 4 కోట్ల డాలర్ల వద్ద ఆగింది. అంటే కారుకు వచ్చిన తుది ధర ప్రారంభ అంచనాతో పోలిస్తే దాదాపు 40 రెట్లు ఎక్కువ.

Ferrari Luce వేలంలో కొత్త కారు కోసం ఉన్న గత రికార్డును కూడా బద్దలు కొట్టింది. అంతకుముందు Ferrari Daytona SP3 వన్-ఆఫ్ మోడల్ సుమారు 2.6 కోట్ల డాలర్లకు అమ్ముడైంది.

Luce దీనికంటే చాలా ఎక్కువ ధర సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన వేలం కారు కాదు. ఈ రికార్డు 1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupé పేరిట ఉంది, అది 2022లో సుమారు 13.5 కోట్ల యూరోలకు అమ్ముడైంది.

Ferrari తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు

Ferrari Luce కంపెనీ చరిత్రలో తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇది Ferrariకి ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు, ఎందుకంటే కంపెనీ చాలా కాలంగా పెట్రోల్ ఇంజిన్, ముఖ్యంగా హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్లకే తన గుర్తింపును నిలబెట్టుకుంది. Luce ద్వారా Ferrari ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల పెరుగుతున్న మార్కెట్లో తన స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది.

Luce కేవలం ఎలక్ట్రిక్ కావడం వల్ల మాత్రమే ప్రత్యేకం కాదు, దాని పనితీరు కూడా చాలా శక్తివంతంగా ఉంది. ఇందులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి, ఇవి కలిసి సుమారు 1,050 CV అంటే 1,000కి పైగా హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇలా Ferrari ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడా తన హై-పర్ఫార్మెన్స్ కార్ల గుర్తింపును నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది.
Ferrari Luceను తొలిసారి పరిచయం చేసిన తర్వాత దీనిపై మిశ్రమ స్పందన కనిపించింది. ఈ కారు డిజైన్‌లో మాజీ Apple డిజైనర్ Sir Jony Ive పాత్ర కూడా ఉంది. ఆయన LoveFrom ద్వారా Ferrariతో కలిసి Luce డిజైన్‌పై పని చేశారు. అందుకే దీని డిజైన్ Ferrari ప్రస్తుత కార్లతో పోలిస్తే చాలా భిన్నంగా, మరింత ఆధునికంగా కనిపిస్తోంది.

వేలం ద్వారా వచ్చిన డబ్బు ఏం చేస్తారు?

ఈ వేలంలో మరో ప్రత్యేకత ఏంటంటే, దీని ద్వారా వచ్చిన మొత్తం డబ్బు Ferrariకే లేదా కారు యజమానికి మాత్రమే వెళ్లదు. Ferrari ప్రకారం, వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని Ferrari Foundation ద్వారా విద్యకు సంబంధించిన ప్రాజెక్టుల్లో వినియోగిస్తారు. 382 కోట్ల ధర విన్నప్పుడు Ferrari Luce ప్రతి కారు అంత ఖరీదైనదని అనిపించవచ్చు, కానీ వేలంలో అమ్ముడైన మోడల్ వన్-ఆఫ్ Chassis 0, దాని అరుదైన స్వభావం, ప్రత్యేక కస్టమైజేషన్ కారణంగా అంత ఎక్కువ ధర వచ్చింది. సాధారణ Ferrari Luce ప్రారంభ ధర సుమారు 5.5 లక్షల యూరోలు అని తెలిపారు.

Ferrari Luce కంపెనీకి కేవలం కొత్త కారు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ యుగంలోకి ప్రవేశించడానికి ఒక పెద్ద అడుగు. ప్రారంభంలో దీని డిజైన్‌పై విమర్శలు ఎదురైనా, వేలంలో వచ్చిన రికార్డు ధర, కారుపై ఏర్పడిన చర్చ Ferrari ఎలక్ట్రిక్ భవిష్యత్తుపై ప్రజల ఆసక్తి చాలా ఎక్కువగా ఉందని చూపిస్తోంది. Luce డిమాండ్‌పై కంపెనీ కూడా సానుకూల స్పందన ఇచ్చింది.

Frequently Asked Questions

Ferrari Luce అంటే ఏమిటి?

ఇది ఫెరారీ కంపెనీ విడుదల చేసిన మొదటి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఇది కంపెనీకి ఒక ముఖ్యమైన అడుగు.

Ferrari Luce ప్రత్యేక మోడల్ ఎంత ధరకు అమ్ముడైంది?

దీని 'Chassis 0' మోడల్ వేలంలో 4 కోట్ల డాలర్లు (సుమారు 382 కోట్ల రూపాయలు) పలికింది. ఇది కొత్త కారు వేలంలో నమోదైన అత్యధిక ధర.

Ferrari Luce డిజైన్ వెనుక ఎవరున్నారు?

ఈ కారు డిజైన్‌లో మాజీ Apple డిజైనర్ Sir Jony Ive పాత్ర ఉంది. ఆయన LoveFrom ద్వారా Ferrariతో కలిసి Luce డిజైన్‌పై పనిచేశారు.

Ferrari Luce వేలం ద్వారా వచ్చిన డబ్బును ఏం చేస్తారు?

వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును Ferrari Foundation ద్వారా విద్యకు సంబంధించిన ప్రాజెక్టుల్లో వినియోగిస్తారు. ఇది సమాజ సేవకు ఉపయోగిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget