అన్వేషించండి

ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?

50 ఏళ్లుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనం వాడుతున్న బ్రెజిల్ అనుభవం, భారత్‌లో E20 వాడుతున్న కార్లకు కీలక మార్గదర్శిగా మారింది. అసలు సమస్య ఇథనాలా, ఇంధన కాలుష్యమా?

E20 fuel India: భారత్‌లో E20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకడం లేదు. అయితే, ఒక్క విషయం మాత్రం రూఢీ అయింది - మైలేజీ తగ్గుతుందని. ఇది కాకుండా, ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం.. వాహనం ఇంజిన్‌కు దీర్ఘకాలంలో ఏమైనా నష్టం జరుగుతుందా అని. E20కి అనుకూలంగా లేని పాత కార్లు, బైక్‌ల పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక సందేహాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రశ్నకు సమాధానం కోసం, దాదాపు 50 ఏళ్ల ఇథనాల్ అనుభవం ఉన్న బ్రెజిల్‌లోని పరిస్థితులను పరిశీలిద్దాం. ఆ దేశంలో, 1975లో చమురు సంక్షోభం సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగం మొదలైంది. ప్రారంభంలోనే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపారు. ఆ తర్వాత ఈ మిశ్రమం 25, 27 & 30 శాతానికి పెరిగింది. ప్రస్తుతం బ్రెజిల్‌లో E32 ఇంధనం కూడా అందుబాటులో ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బ్రెజిల్‌లో E20 వినియోగం మొదలైనప్పుడు, ఇప్పటి వాహనాలతో పోలిస్తే అప్పటి వాహనాలు చాలా మామూలు సాంకేతికతతో తయారయ్యాయి. ఫ్యూయల్ ఇంజెక్షన్, ఆధునిక సెన్సర్లు, క్లోజ్డ్ లూప్ నియంత్రణ వంటి సదుపాయాలు కూడా లేవు. అయినా E20 వల్ల పెద్ద ఎత్తున ఇంజిన్ సమస్యలు నమోదైనట్లు బ్రెజిల్ ఆటో ఎక్స్‌పర్ట్‌లు చెప్పడం లేదు. అప్పట్లో కనిపించిన సమస్యల్లో ఎక్కువ భాగం ఇంధన వ్యవస్థలో ఉపయోగించిన రబ్బరు, గ్యాస్కెట్లు & ఇతర విడిభాగాలకు సంబంధించినవే. మరోవైపు, స్వచ్ఛమైన ఇథనాల్‌ (E100)తో నడిచే వాహనాల్లో కార్బ్యురేటర్ తుప్పు, ఇంధన గొట్టాలు పాడవడం, చిన్న రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి.

ఇది కూడా చదవండి: రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే

ఈ విషయాన్ని నేరుగా భారత్‌కు వర్తింపజేయలేమని వాహన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 1970ల బ్రెజిల్ పరిస్థితులు, నేటి భారత్ పరిస్థితులు ఒకేలా లేవు. అయినప్పటికీ, బ్రెజిల్ అనుభవం ఒక ముఖ్యమైన విషయం చెబుతోంది. E20 వల్ల తక్షణం భారీ స్థాయిలో ఇంజిన్ నష్టం జరుగుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు.

మన దేశంలో, E10 వాహనాల్లో E20 ఇథనాల్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ వెంటనే భయపడాల్సిన అవసరం లేదని బ్రెజిల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. దీర్ఘకాలంలో పాత రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు, ఓ రింగులు పాడయ్యే అవకాశం ఉందని మాత్రం వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో, ఖరీదైన ఇంజిన్ భాగాల కంటే చిన్న భాగాల జీవితకాలం తగ్గే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు.

మరో ముఖ్యమైన అంశం - ఇంజిన్ క్యాలిబ్రేషన్. E20లో లీటరుకు లభించే శక్తి పెట్రోల్ కంటే తక్కువ. అందువల్ల సరైన మిశ్రమం కోసం ఇంజిన్ మరింత ఇంధనాన్ని పంపాలి. పాత వాహనంలో ఇంజెక్టర్ లేదా ఇంధన నియంత్రణ వ్యవస్థకు సరిపడా సర్దుబాటు అవకాశం లేకపోతే సమస్య రావచ్చు. అప్పుడు 'చెక్ ఇంజిన్' లైట్ వెలిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ

బ్రెజిల్ అనుభవంలో అసలైన హెచ్చరిక ఇథనాల్ మిశ్రమం కాదు, ఇంధన నాణ్యత. ఇంధనంలో క్లోరైడ్ వంటివి కలిస్తే.. అవి ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్లు & వాల్వ్‌లకు నష్టం కలిగించవచ్చు. బ్రెజిల్‌లో, ఇంధనంలోని క్లోరైడ్‌కు కఠినమైన రూల్స్‌ ఉన్నాయి.

భారత్‌లో కూడా E20పై చర్చ కేవలం ఇథనాల్ శాతానికే పరిమితం కాకూడదు. వినియోగిస్తున్న ఇంధనం అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉందా, అందులో ఇంకేవైనా కలిశాయా? అనే అంశాలు కూడా ముఖ్యమైనవి. అందుకే బ్రెజిల్ 50 ఏళ్ల అనుభవాన్ని బట్టి... E20ని చూసి భయపడటం కంటే ఇంధన నాణ్యత, వాహన నిర్వహణ & అవసరమైన భాగాల పరిస్థితిపై దృష్టి పెట్టడం ముఖ్యం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget