అన్వేషించండి

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?

ABV: మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై విమర్శల వెనుక అసలు వ్యూహమేంటి? 22A భూముల సమస్యపై పోరాటం, సొంత పార్టీ ఆలోచనలు రాజకీయాలను మారుస్తాయా?

ABV New Political Party:  మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ పూర్వ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు  ఇటీవల ఏపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.  ముఖ్యంగా 22A నిషేధిత భూముల జాబితా పరిరక్షణ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన వేధింపులకు, సస్పెన్షన్‌కు గురై సత్యమేవ జయేతే అంటూ పోరాడిన ఆయన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి చేరకపోవడం, పైగా పాలనా లోపాలపై గళమెత్తడం వెనుక అసలు ప్లాన్ ఏంటనేది ఆసక్తికర చర్చకు దారితీసింది.

టీడీపీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపని చంద్రబాబు

ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ పార్టీలోకి చేర్చుకోనందుకే ఆయన అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు. తాను టీడీపీలో చేరాలని గతంలో అనుకున్నప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయనే పలు ఇంటర్యూల్లో చెప్పారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా ఆయన తీసుకోలేదు. అందుకే ఆ తర్వాత ఆయన  మరికొంత మంది ఇతరులతో కలిసి  సెంటర్ ఫర్ లిబర్టీ అనే వేదిక ద్వారా 22A నిషేధిత భూముల జాబితా కారణంగా నష్టపోతున్న లక్షలాది మంది ప్రజల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్థాయి నేతలకు అధికారుల వాస్తవాలు సరిగ్గా చేరవేడం లేదని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ భూముల సమస్య ప్రజా ఉద్యమంగా మారడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఆయుధంగా దీనిని మలుచుకున్నారు.  రోల్ బ్యాక్ 22A పేరుతో ఉద్యమం చేస్తున్నారు. 

కొత్త పార్టీ పెట్టే ఆలోచన 

ఇక సొంత పార్టీ ఏర్పాటు ప్రకటన విషయానికి వస్తే, ఏబీ వెంకటేశ్వరరావు తన వైఖరిని స్పష్టం చేశారు. ఏదో ఒక రాజకీయం వెనుక నడవడం కంటే సమాజంలో మార్పు కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం తమ భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. అధికారం పొందేందుకు కాకపోయినా, ఒక బలమైన వాచ్‌డాగ్‌గా, ఒత్తిడి గ్రూప్‌గా పనిచేయడానికే ఈ నూతన వేదిక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ ఎందుకు చేర్చుకోలేదు? 

తెలుగుదేశం పార్టీ ఇలాంటి మాజీ అధికారులను ,  సానుభూతిపరులను ఎందుకు దూరం చేసుకుంటోందనే ప్రశ్నకు రాజకీయ వ్యూహాలే సమాధానంగా కనిపిస్తున్నాయి. మాజీ అధికారుల స్వేచ్ఛా ప్రకటనలు ప్రభుత్వ నిర్ణయాలకు అవరోధంగా మారడం, లేదా పార్టీకి క్యాడర్ ఆధారిత నాయకత్వమే ప్రాధాన్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అదే సమయంలో, సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ వైపు పనిచేసిన అనుభవం ఉన్న వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని నియంత్రించే లోపాలను పసిగట్టి వేలెత్తి చూపిస్తుండటంతో కూటమి సర్కారుకూ ఇది ఇబ్బందికరంగా పరిణమించింది.  తన చట్టపరమైన పోరాటం ముగిసిన తర్వాత, సమాజంలో ఒక ఇండిపెండెంట్ లీడర్‌గా, ప్రజా సమస్యలపై పోరాడే సివిల్ సొసైటీ వాయిస్‌గా తనను తాను నిలబెట్టుకునేందుకు వేస్తున్న వ్యూహాత్మక అడుగుగా దీనిని చూడొచ్చు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget