అన్వేషించండి

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి నిధి అగర్వాల్‌తో జరిగిన లావాదేవీలపై హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులో విచారణ జరిగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిధి అగర్వాల్‌ను బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై ఈడీ విచారించింది.
  • ఆమె ఆర్థిక లావాదేవీలు, పారితోషికం, హవాలా చెల్లింపులపై ఈడీ ఆరా తీసింది.
  • ఈ కేసులో 21 మంది సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ అయ్యాయి.
  • రణబీర్, విజయ్ వంటి నటులు కూడా గతంలో విచారణ ఎదుర్కొన్నారు.

Betting Apps Promotion Case | హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో అమాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, ఈడీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. కొన్ని నెలల కిందట ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటి నిధి అగర్వాల్‌ను హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు బుధవారం విచారించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేయడంతో నిధి అగర్వాల్ విచారణకు హాజరయ్యారు.


Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

ఈ విచారణలో బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రమోషన్ చేసినందుకు పొందిన పారితోషికం, కంపెనీలతో జరిగిన ఆర్థిక లావాదేవీల తీరుతెన్నులపై ఈడీ అధికారులు నిధి అగర్వాల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ చెల్లింపులు హవాలా రూపంలో జరిగాయా అనే కోణంలోనూ నటిని ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దాదాపు 21 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో తెలంగాణ సీఐడీకి స్టేట్మెంచ్ ఇచ్చిన నిధి అగర్వాల్‌ను, ఇప్పుడు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ విచారించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రయోషన్ల కేసు దర్యాప్తును వేగవంతం చేసింది.

తెలుగు సినీ పరిశ్రమలో బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసి ఈడీ, పోలీసుల నోటీసులు ఎదుర్కొన్న జాబితాలో నటి నిధి అగర్వాల్ ఒక్కరే కారు. గతంలో ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులలో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా పలువురు నటులు కూడా పలు బెట్టింగ్ లేదా గేమింగ్ యాప్‌ల ప్రచారాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందుకున్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల్లో సోసల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు నోటీసులు రావడంతో విచారణకు హాజరయ్యారు. నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం బాధ్యతాయుతంగా ఉండాలని అధికారులు సూచించారు.

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

Frequently Asked Questions

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ఎవరిని విచారించింది?

నటి నిధి అగర్వాల్‌ను హైదరాబాద్‌లోని ఈడీ అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమె విచారణకు హాజరయ్యారు.

నిధి అగర్వాల్‌ను ఈడీ అధికారులు ఎందుకు విచారించారు?

బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో జరిగిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు దర్యాప్తులో భాగంగా ఈ విచారణ జరిగింది.

ఈ విచారణలో ఈడీ అధికారులు నిధి అగర్వాల్‌ను ఏ విషయాలపై ప్రశ్నించారు?

బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాలు, పారితోషికం, ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు హవాలా రూపంలో జరిగాయా అనే కోణంలో ప్రశ్నించారు.

ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుల్లో ఇతర సెలబ్రిటీలు కూడా ఉన్నారా?

అవును, రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి నటులు గతంలో నోటీసులు అందుకున్నారు. సుమారు 21 మంది సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026 LIVE: ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget