అన్వేషించండి

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బావి పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి  చెందిన నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కారు బావిలోపడి నలుగురు మృతి.
  • ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, చిన్నారులు ఈ ప్రమాదంలో మరణించారు.
  • బంధువుల అంత్యక్రియల నుండి వస్తుండగా, అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది.
  • తెల్లవారుజామున పోలీసులు కనుగొని, మృతదేహాలు వెలికితీసి దర్యాప్తు చేస్తున్నారు.

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెల్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే నేలబావిలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. చనిపోయిన వారిలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో ఈ దుర్ఘటన జరిగింది. 

మృతులను దుబ్బాక మండలంలోని బల్వంతపూర్ గ్రామానికి చెందిన దుండుగుల రాజు, అతని భార్య భాగ్య, వారి బిడ్డలు నిహాన్ష్‌, శాన్వికగా గుర్తించారు. రాజు వయసు 35 వరకు ఉంటుందని, భాగ్య వయసు 25 ఏళ్లు ఉంటుంది. చిన్నారులు ఐదేళ్ల లోపు వాళ్లే. కంటిపాపల్లాంటి ఇద్దరు చిన్నారులతో కలిసి సంతోషంగా సాగాల్సిన ఆ కుటుంబ ప్రయాణం, అర్ధరాత్రి వేళ బావి రూపంలో పొంచి ఉన్న మృత్యుకుహరంలో ముగిసిపోయింది. 

బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా కబళించిన మృత్యువు 

పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం బల్వంతపూర్‌ గ్రామానికి చెందిన దండుగుల రాజు కుటుంబం బుధవారం నాడు సిద్ధిపేట వెళ్లింది. సిద్ధిపేటలో నివసించిన తమ అత్యంత సన్నిహిత బంధువు ఒకరు మరణించడంతో ఆ దంపతులు తమ ఇద్దరు చిన్నారులను తీసుకొని పరామర్శించడానికి, అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. పరామర్శ ముగించికొని, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తిరిగి తమ గ్రామానికి వస్తున్న టైంలో ప్రమాదం జరిగింది. 

అర్ధరాత్రి సుమారు ఒంటి గంట దాటిన సమయంలో దుబ్బాక మండలం అప్పనపల్లి శివారుకు చేరుకోగానే కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. చీకటి దారి, స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడం, రోడ్డు పక్కన ఉన్న అడ్డంకులను సరిగ్గా గమనించకోపోవడం వల్ల డ్రైవింగ్ సీట్లో ఉన్న రాజు కారుపై నియంత్రణ కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. నియంత్రణ కోల్పోయిన కారు అంతే వేగంతో రహదారి పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడింది. 

మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ బంధువుల్లో ఆందోళన 

అర్ధరాత్రి రెండు గంటలు దాటినా రాజు కుటుంబం బల్వంతపూర్‌లోని తమ ఇంటికి చేరుకోకోపవడంతో బంధువల్లో ఆందోళన మొదలైంది. రాజు భాగ్యల మొబైల్‌ ఫోన్లకు వరుసగా ప్రయత్నించినప్పటికీ, రెండు ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అని సమాాానం రావడంతో వారి అనుమానం మరింత బలపడ్డాయి.

రాత్రి వేళల్లో ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం అర్ధరాత్రి నుంచి సిద్ధిపేట - దుబ్బాక ప్రధాన రహదారి వెంట గాలింపు చేపట్టారు. 

చీకటిలో గాలింపుతో బావిలో తేలిన కారు 

రంగంలోకి దిగిన దుబ్బాక పోలీసు బృందాలు అప్పనపల్లి పరిసర ప్రాంతాల్లో  క్షణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. గురువారం తెల్లవారుజామున అప్పనపల్లి గ్రామ శివారులోని రహదారి పక్కన ఉన్న బావి వద్దకు చేరుకున్న పోలీసులు రహదారిపై కారు టైర్ల గుర్తులు కనిపించాయి. ఆ దిశగా బావిలో చూడగా కారు మునిగిపోయి ఉన్నట్టు గుర్తించారు. 

సమాచారం అందుకున్న దుబ్బాక సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌, సబ్‌ఇన్స్పెక్టర్‌ తమ సిబ్బందితో అగ్నిమాపక దళ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. అయినప్పటికీ క్రేన్ జేసీబీ యంత్రాల సహాయంతో అత్యంత శ్రమతో కారు బావి వెలుపలికి తీశారు.  

ఒకే చోట నలుగురి మృతదేహాలు 

జేసీబీ సహాయంతో బురద, నీటితో నిండిన కారును బావి నుంచి బయటకు తీశారు. కారు తలుపులు తెరిచి చూడగా ఊపిరాడక కారులోనే మరణించిన రాజు, భాగ్యలతోపాటు వారి సీట్లలోనే అచేతనంగా పడి ఉన్న చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. పోలీసులు నాలుగు మృతదేహాలను వెలికితీసి, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

శోకసంద్రంలో బల్వంతపూర్‌

దుండగుల రాజుకుటుంబం అంతా ఒకే ప్రమాదంలో చనిపోయారనే వార్త బల్వంతపూర్‌ గ్రామానికి చేరగానే ఆ పల్లె మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది రాజు కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు స్థానికులను తీవ్రంగా కలిచి వేశాయి. కంటిముందు తిరుగుతూ సందడి చేసే నలుగురు  ఉన్నట్టుండి శవాలుగా మారడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదంపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా, లేదా రాత్రి పూట డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల ఈ ఘోరం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Frequently Asked Questions

సిద్ధిపేట జిల్లాలో జరిగిన దుర్ఘటన ఏమిటి?

దుబ్బాక మండలం అప్పనపల్లి శివార్లలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నేలబావిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారు ఎవరు?

బల్వంతపూర్ గ్రామానికి చెందిన దుండుగుల రాజు (35), అతని భార్య భాగ్య (25), వారి బిడ్డలు నిహాన్ష్, శాన్విక (ఐదేళ్ల లోపు) మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబం ఎక్కడికి వెళ్తున్నారు?

వారు సిద్ధిపేటలో బంధువుల అంత్యక్రియలకు హాజరై, అర్ధరాత్రి దాటిన తర్వాత తమ గ్రామం బల్వంతపూర్‌కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గల కారణాలు ఏమిటి?

చీకటి, అధిక వేగం, రోడ్డు పక్కన అడ్డంకులు సరిగ్గా గమనించకపోవడం వల్ల కారు అదుపుతప్పి బావిలో పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాంకేతిక లోపం లేదా డ్రైవర్ నిద్రమత్తు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget