No Responce On ABV : ఒంటరి ఏబీవీ - ఐపీఎస్ సంఘాలూ మాట సాయం చేయట్లేదు !
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వం వేధిస్తోందని అంటున్నారు. కానీ ఆయనకు మద్దతుగా ఐపీఎస్ సంఘాలు కూడా మాట సాయం చేయడం లేదు.
![No Responce On ABV : ఒంటరి ఏబీవీ - ఐపీఎస్ సంఘాలూ మాట సాయం చేయట్లేదు ! AB Venkateswara Rao says the government is harassing him. But even the IPS unions are not helping in support of him. DNN No Responce On ABV : ఒంటరి ఏబీవీ - ఐపీఎస్ సంఘాలూ మాట సాయం చేయట్లేదు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/8a04b501b22a8f689d20ea07ee885690_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
No Responce On ABV : ఎబీ వెంకటేశ్వరరావు పై ఎపీ సర్కార్ మరో సారి సీరియస్ అయ్యింది..ఈ సారి ఎవ్వరూ ఊహించని విదంగా ఎబీకి ఝలక్ ఇచ్చింది..కోర్టు ఆదేశాల మేరకు పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి,మరో సారి సస్పెన్షన్ వేటు వేసింది..ఈ వ్యవహరంలో మరో సారి అదికారిక వర్గాల్లో సైతం కలకలం రేగింది..క్రమశిక్షణారాహిత్య వ్యాఖ్యలు చేసినందుకు ఏబీ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఉత్తర్వులను విడుల చేసింది. 1969 ఆలిండియా సర్వీస్ రూల్ 3, సబ్ రూల్ 3 ప్రకారం సస్పెన్షన్ చేస్తున్నట్లు కూడ స్పష్టత ఇచ్చింది..నేర పూరిత ప్రవర్తనకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.గతంలో అవినీతి ఆరోపణల పై సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు ఆ తరువాత ప్రభుత్వం తో విభేదించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.ఆ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం పై వత్తిడి తెచ్చారు.దీంతో ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ కు కమీషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐబీ చీఫ్‌గా కీలకంగా వ్యవహరించిన ఏబీవీ
అయితే ఇంత లోనే మరో సారి సస్పెన్షన్ వేటు పడింది.ఈ వ్యవహరం ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది.ఎబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. నిఘా విభాగం చీఫ్ గా పని చేసిన ఆయన, భద్రతా పరికరాలు కొనుగోలు కు సంబందించిన వ్యవహరాల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎసీబీ కేసు ను నమెదు చేశారు.పెగాసెస్ విషయంలో కూడ ఎబీ పై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎబీ పై చర్యలు తీసుకోవటం మెదలుపెట్టింది. దీంతో ఎబీకి కూడ ప్రభుత్వం తో అమీ తుమీ తేల్చుకునేందుకు ఢి అంటే ఢి అన్నట్లుగా వ్యవహరించారు.
కక్ష సాధింపులని అంటున్నా నోరు మెదపని ఐపీఎస్‌ల సంఘం
ప్రభుత్వం వైఖరి పై ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ను నేరుగా కామెంట్ చేశారు. అదికారులు పై పొలిటికల్ వత్తిళ్ళు ఎక్కువగా పని చేయవని సవాల్ విసిరారు. అంతే కాదు తానేమి తప్పు చేయలేదని, నిరూపించేందుకు ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవని అయన అన్నారు.తన పై కేవలం వేదింపులకు పాల్పడేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రాదాన్యత ఇస్తుందని ఆయన ద్వజమెత్తారు.సాదారణంగా ఐఎఎస్,ఐపీఎస్ ల పై ప్రభుత్వం అనవసరంగా చర్యలు తీసుకుంటే, అదికారుల సంఘం పూర్తిగా ఆక్షేపిస్తుంది.
ఏకాకిగా మారిపోయిన ఏబీ వెంకటేశ్వరరావు
అయితే ఇక్కడ మాత్రం ఎబీ పూర్తిగా ఎకాకిగా మారిపోయారు. ఎబీ పై ప్రభుత్వం చర్యలను ప్రతిపక్ష పార్టీలు మినహా, మిగిలిన ఎవ్వరూ పట్టించుకోలేదు.టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడ ఎబీ పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అయ్యిందనే ప్రచారం ఉంది. అయితే ఇలాంటి పరిస్దితులు వచ్చినప్పుడు కనీసం రిటైర్ ఉద్యోగుల సంఘం అయినా నామమాత్రంగా ఖండిస్తుంది. అలాంటి ఇక్కడ మాత్రం ఎబీ పూర్తిగా ఎకాకిగా మారి,ప్రభుత్వం పై సింగల్ గానే పోరాటం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)