India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
నేటి నుంచి సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే శుబ్మన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి రూల్డ్ అవుట్ అయినట్టు బీసీసీఐ ప్రకటించింది. కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్ రెండో రోజున మెడ నొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు. నొప్పి చాలా ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. రెండవ టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఇక టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సొంత గడ్డపై పరువు కాపాడుకోవడానికి చూస్తుంది. ఈ టెస్టులో ఓడితే టెస్టుల్లో భారతకు ఘోర అవమానం ఖాయం. అయితే టెస్టు కోచ్ గౌతం గంభీర్‌కు కీలకంగా మారింది. ఈ టెస్టులో ఓడితే మాత్రం ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కోవడం మాత్రమే కాదు... తన కోచ్ స్థానంపై కూడా వేటు పడటం ఖాయం అంటూ చర్చ మొదలైంది.
శుభ్‌మన్ గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్... మిడిల్ ఆర్డర్ లో సుదర్శన్, ధ్రువ్ జురెల్, ఆ తర్వాత రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కు వస్తారు. భారత పిచ్ లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. రవీంద్ర జడేజాతోపాటు కుల్దీప్ యాదవ్ టీమ్ లో ఉంటాడా లేదా అన్నది డౌట్ గా మారింది.




















