Rajasekhar Gotila Factory : అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
Jeevitha Reaction : గత కొంతకాలంగా వైరల్ అవుతున్న రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంశంపై తాజాగా ఆయన భార్య జీవిత రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని చెప్పారు.

Jeevitha Reaction On Rajasekhar Gotila Factory Issue : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' పేరుతో విచిత్రమైన పోస్టులు ట్రెండ్ అయ్యాయి. తాజాగా దీనిపై హీరో రాజశేఖర్ భార్య జీవిత రియాక్ట్ అయ్యారు.
'అవి చూసి నవ్వుకున్నాం'
అసలు ఆ గోటీల ఫ్యాక్టరీ ఏంటో... ఎవరు ఎందుకు అలా వైరల్ చేశారో తెలియదని... కానీ రాజశేఖర్‌తో పాటు తాను, తన పిల్లలు అది చూసి నవ్వుకుంటున్నామని చెప్పారు జీవిత. 'ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ఫేక్ పోస్టులు వస్తున్నాయి. ఇందులో నెగిటివిటీ, విమర్శలు వచ్చాయా? దాన్ని చూసి బాధపడాలా అనే అలోచనే ఎవరికీ లేదు.
ఆ ప్రచారం మాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కొందరు ఉద్యోగాలిప్పిస్తామంటూ ఇలా పోస్టులు చేస్తున్నారని విన్నా. సోషల్ మీడియా, రీల్స్, ఫేక్ న్యూస్ దయచేసి ఎవరూ నమ్మొద్దు. ప్రతీ ఒక్కరికీ అది ఫేక్ అని వెళ్లి చెప్పలేం కదా.' అంటూ రియాక్ట్ అయ్యారు.
Also Read : ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అసలేంటీ రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ గోల?
గత కొద్ది రోజులగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. కొందరు ఫేక్ ఏఐ వీడియోలు క్రియేట్ చేసి మరీ పని కట్టుకుని ప్రచారం చేశారు. సీనియర్ నటుడు రాజశేఖర్ ఓ గోటీల (గోళీల) ఫ్యాక్టరీ పెట్టారని... దాని ద్వారా కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నారంటూ ప్రచారం సాగింది. అందులో వర్క్ చేసే వారికి లక్షల్లో జీతాలు ఉంటాయని... కొందరు ఇంటర్వ్యూలు, ఐడీ కార్డులు క్రియేట్ చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.
తమకు రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో రూ.కోట్ల ప్యాకేజీతో జాబ్ కూడా వచ్చిందని... ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్ సెక్షన్‌లో చెప్పాలంటూ కొందరు వీడియోస్ కూడా చేశారు. కొన్ని ఏఐ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సోషల్ మీడియా అంతా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ గోలగా మారింది. అందులో జాబ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదంటూ కొందరు ఫన్నీ, మరికొందరు సీరియస్ వీడియోలు కూడా చేశారు. ఇదంతా ఫేకే అని... అందులో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని రాజశేఖర్ భార్య జీవిత తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
























