Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Indian Team Next International Match: టీ20 వరల్డ్ కప్ టైటిల్ సాధించిన టీమ్ ఇండియా తమ నెక్ట్స్ అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడుతుందో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. మధ్యలో ఐపీఎల్ 2026 ఉంది.

ముంబై: టీమిండియా గత ఆదివారం (మార్చి 08) 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత, ఇండియా టీం తమ తరువాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది, ఎవరితో ఆడుతుందని క్రికెట్ ప్రేమికులు సెర్చ్ చేస్తుంటారు. కొన్ని రోజుల గ్యాప్ తరువాత టీమ్ ఇండియా మళ్లీ మైదానంలో కనిపించనుంది. అయితే తమ స్టార్ క్రికెటర్లను చూడటానికి అభిమానులు ఎంతకాలం వేచి చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కంటే ముందే ఐపీఎల్
ఇండియా తదుపరి ఇంటర్నేషనల్ మ్యాచ్ కంటే ముందే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2026ని ఆస్వాదించవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ మార్చి 28 నుండి మే 31 మధ్య జరగనుంది. క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ నెలలో భారత జట్టు తమ నెక్ట్స్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగుతుంది.
ఎవరితో సిరీస్ ఉంటుంది?
భారత్ తరువాత సిరీస్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది. ఈ జట్లు టెస్ట్, వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. ముందుగా జూన్ 06న ఒక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు జూన్ 14, 17, 20 తేదీల్లో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య జరగనున్న తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఇది.
సిరీస్ ఎక్కడ జరుగుతుంది?
ఈ సిరీస్ భారత్ వేదికగానే జరుగుతుంది. ఏకైక టెస్ట్ మ్యాచ్ న్యూ చండీగఢ్ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత 3 వన్డే మ్యాచ్‌లు వరుసగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో, లక్నోలోని ఏకానా స్టేడియంలో, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నారు.
తదుపరి టీ20 సిరీస్ ఎవరితో?
టెస్ట్, వన్డే మ్యాచ్‌లు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతాయి. అయితే ఇండియా తమ నెక్ట్స్ టీ20 సిరీస్‌ను ఎవరితో ఆడుతుందో తెలుసా. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఛాంపియన్ భారత్ తన తదుపరి టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తర్వాత, భారత జట్టు వైట్ బాల్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. మొదటగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత 3 వన్డేల సిరీస్ ఉంటుంది. టీ20 సిరీస్ జూలై 01 నుంచి జూలై 11 మధ్య, వన్డే సిరీస్ జూలై 14 నుండి జూలై 19 మధ్య జరగనున్నాయి.
ట్రెండింగ్ వార్తలు




















