Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
Rahul Gandhi: రష్యా నుంచి చమురు కొనడానికి భారతదేశం అమెరికా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడంపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని లోక్ సభలో విమర్శించారు.

Rahul walks out From Lok Sabha: లోక్‌సభలో అనుబంధ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం మరోసారి వివాదాస్పదమయింది. ర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం ఎవరి వద్ద నుండి చమురు , గ్యాస్ కొనుగోలు చేయాలో నిర్ణయించే అధికారాన్ని అమెరికాకు ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
మనం ఏయే దేశాల నుండి చమురు సరఫరా పొందాలనేది మనం నిర్ణయించుకోగలమా లేదా అనే అంశం ఇప్పుడు తేలాల్సి ఉందన్నారు. భారతదేశం వంటి అగ్రదేశం, రష్యా నుండి చమురు కొనడానికి వేరే దేశం అధ్యక్షుడి అనుమతి కోసం వేచి చూడటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఈ చిక్కుముడి వెనుక ఉన్న రహస్యం తనకు తెలుసని.. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజీపడిన విషయం ఉందన్నారు. ప్రజలను ఆందోళన చెందవద్దని ప్రధాని చెబుతున్నారు కానీ, అసలు ప్రధానియే తీవ్ర భయాందోళనలో ఉన్నారు అని ఎద్దేవా చేశారు. అదానీ కేసు, అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఎప్స్టీన్ ఫైల్స్ వంటి వ్యవహారాల వల్ల ప్రధాని సభలోకి రావడానికే భయపడుతున్నారని, అందుకే లోక్‌సభలో ఆయన కుర్చీ ఖాళీగా కనిపిస్తోందని విమర్శించారు.
అనంతరం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వైపు వేలు చూపిస్తూ.. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ తనకు స్నేహితుడు అని పూరీ స్వయంగా చెప్పుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్దీప్ పూరీ కుమార్తె బిలియనీర్ జార్జ్ సోరోస్ నుండి నిధులు పొందారని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. రాహుల్ గాంధీ తాను ఇచ్చిన నోటీసులో ఉన్న అంశాలకు మాత్రమే పరిమితమై మాట్లాడాలని, సభ ఇలా నడవడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు నోటీసులో ఉన్న విషయం మీదైనా మాట్లాడండి లేదా ఈ కొత్త అంశాల గురించి మాట్లాడాలనుకుంటే మరో నోటీసు ఇవ్వండి అని స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు మాత్రం రాహుల్ గాంధీని ప్రసంగం కొనసాగనివ్వాలని డిమాండ్ చేశారు.
BIG BREAKING 🚨
— Ashish Singh (@AshishSinghKiJi) March 12, 2026
Again Rahul Gandhi not allowed to speak on IRAN Israel War.
- Priyanka Gandhi Ji pic.twitter.com/U3LDEQVlCb
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడే ప్రమాదం ఉందని, ఇది భారతదేశ ఇంధన భద్రతను దెబ్బతీస్తుందని రాహుల్ హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన అంశంపై చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రశ్నించారు. తర్వాత పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంపై కేంద్రం తీసుకున్న చర్యల గురించి వివరించేందుకు హర్దీప్ సింగ్ పూరీ లేచారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు సభలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు.
స్పీకర్ ఓం బిర్లా తాము అన్ని పక్షాలకు తగిన సమయం ఇస్తున్నామని, నిబంధనల ప్రకారమే సభ నడుస్తోందని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదని ఆరోపిస్తూ రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమి నేతలు గురువారం సభా కార్యకలాపాలను బహిష్కరించి బయటకు వచ్చారు. సభ నిబంధనల ప్రకారమే నడుస్తుంది, ఎవరి మైక్‌ను స్విచ్ ఆఫ్ చేసే బటన్ స్పీకర్ దగ్గర ఉండదని స్పీకర్ స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు



















