Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగింది. బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఆఖరి బాల్ వరకు ఎవరు గెలుస్తారో లేదో కూడా తెలియలేదు. 194 పరుగులతో మ్యాచ్ డ్రా అయింది. సూపర్ ఓవర్‌లో టీమిండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరింది.
భారత్ ఏ - బంగ్లాదేశ్ ఏ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా మొదట్లో చెలరేగింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ ఓవర్ లోనే 17 పరుగులు చేసాడు. వైభవ్ 38, ప్రియాన్ష 44 పరుగులు చేసి అవుటయ్యారు. వికెట్స్ పడుతున్నప్పటికీ కూడా టీమ్ ఇండియా రన్స్ చేస్తూ ముందుకు సాగింది. ఆఖరి ఓవర్‌లో భారత్ గెలవడానికి రెండు బంతుల్లో నాలుగు పరుగులు కావాలి. అప్పుడే అశుతోష్ శర్మ వికెట్ కోల్పోయాడు. ఆఖరి బంతికి హర్ష్ దుబే మూడు పరుగులు తీయడంతో మ్యాచ్ డ్రా అయింది.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన భారత్ తొలి బాల్ కే కెప్టెన్ జితేశ్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బంతికే అశుతోష్ శర్మ అవుటవ్వడంతో జీరో రన్స్ వచ్చాయి. బంగ్లాదేశ్ ఒక పరుగు చేసి విజయం సాధించింది.





















