Team India at Hanuman Temple Video: గంభీర్, జై షా లతో కలిసి వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి టీమిండియా పూజలు
Ind vs Nz T20 World Cup 2026 | భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీతో ప్రసిద్ధ హనుమాన్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసింది. సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్, జై షా ఇందులో పాల్గొన్నారు.

అహ్మదాబాద్: T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఫైనల్లో అద్భుత విజయం సాధించిన తర్వాత, జట్టులోని కొందరు ఆటగాళ్ళు అహ్మదాబాద్‌లోని హనుమాన్ టెక్రీ ఆలయానికి వెళ్లి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ICC ఛైర్మన్ జై షా కూడా వారితో ఉన్నారు.
టీమిండియా క్రికెటర్లు అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి T20 ప్రపంచ కప్ ట్రోఫీతో పూజలు చేశారు. జట్టు ఆలయానికి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫైనల్లో భారత్ ఘన విజయం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి, T20 ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
SURYA, GAMBHIR, JAY SHAH AT HANUMAN TEAMPLE WITH T20 WC TROPHY ❤️ 🙏 pic.twitter.com/jKPH5m3o8p
— Johns. (@CricCrazyJohns) March 8, 2026
భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో న్యూజిలాండ్ జట్టు చతికిల పడింది. ఏ దశలోనూ రేసులోకి రాలేదు. న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ సులభంగా విజయం సాధించింది.
భారత జట్టు చారిత్రాత్మక విజయం
ఈ విజయంతో భారత జట్టు టీ20 ప్రపంచకప్ చరిత్రలో అనేక ప్రత్యేక రికార్డులను నెలకొల్పింది. సొంతగడ్డపై ఈ ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. భారత్ వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
వరుసగా మూడో ICC టైటిల్
భారత క్రికెట్‌కు ఈ విజయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే 2024 నుండి 2026 వరకు జట్టు వరుసగా మూడో ICC టైటిల్‌ను గెలుచుకుంది. గత కొంతకాలం నుంచి టీమిండియా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా భారత్ నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు




















