అన్వేషించండి

Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?

Jana Nayagan Release Date : విజయ్ జన నాయగన్ మూవీ సెన్సార్ రివ్యూకు మళ్లీ బ్రేక్ పడింది. సోమవారం రివ్యూ జరగాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది.

Vijay's Jana Nayagan Censor Review Postponed : టీవీకే అధినేత, కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్'. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులతో వాయిదా పడింది. ఫైనల్‌గా నిర్మాతలు కోర్టు కేసులను వెనక్కి తీసుకుని సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు రివ్యూ కమిటీకి మూవీని పంపించారు. సోమవారం మూవీ స్క్రీనింగ్ జరుగుతుంది అనుకునే తరుణంలో లాస్ట్ మినిట్‌లో బ్రేక్ పడింది.

సెన్సార్ రివ్యూ వాయిదా

సెన్సార్ రివ్యూ కమిటీ సభ్యులు సోమవారం జన నాయగన్ మూవీని చూసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారని అంతా భావించారు. మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. సెన్సార్ యూనిట్‌లో ఒకరికి అనారోగ్యం కారణంగా రివ్యూ నిలిపేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త రివ్యూ తేదీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ నెల 17న రివ్యూ చేస్తారని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఒకవేళ సెన్సార్ రివ్యూ ఈ రోజు జరిగుంటే మూవీకి ఫైనల్ సర్టిఫికెట్ వచ్చేసి రిలీజ్‌కు మార్గం సుగమం అయ్యేది. ఇప్పుడు రివ్యూ వాయిదా పడడంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అస్సలు మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందా? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్

మరి రిలీజ్ ఎప్పుడు?

ఈ మూవీ సెన్సార్ రివ్యూ మరింత ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ తమిళ మీడియా కథనాల ప్రకారం ఈ నెల 17నే సెన్సార్ రివ్యూ కంప్లీట్ అయితే వెంటనే సర్టిఫికెట్ వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు ఆస్కారం ఉంది. అది జరగకుంటే రిలీజ్ మరింత వాయిదా పడే అవకాశం ఉంది.

అంతా సక్రమంగా జరిగి ఉంటే ముందు మేలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేయగా అది సాధ్యం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అంతకు ముందు విజయ్ 52వ బర్త్ డే సందర్భంగా జూన్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినట్లు ప్రచారం సాగింది. మరి జన నాయగన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. 'ప్రేమలు' ఫేం మమితా బైజు విజయ్ కూతురిగా నటించారు. అలాగే, బాబీ డియోల్, నరైన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో బిగ్ హైప్ క్రియేట్ అవుతుండగా ఫ్యాన్స్ గత 2 నెలలుగా రిలీజ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Pradeep Ranganathan: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
Mahavatar Parashuram: నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS RR Result Update: రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Embed widget