Ishan Kishan Family Tragedy: విషాదాన్ని అధిగమించి టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్
T20 World Cup 2026 Ishan Kishan Family Accident | టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోయినా ఇషాన్ కిషన్ కన్నీళ్లు దిగమింగుతూ హాఫ్ సెంచరీ చేశాడు.

T20 World Cup 2026 | ఒకానొక సమయంలో ఇండియా నేషనల్ టీంకు దూరమైన ఇషాన్ కిషన్, తన కష్టంతో తలరాతను మార్చుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత అతనికి జాతీయ జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు అతను పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇషాన్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ (54 పరుగుల) ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్ మ్యాచ్‌కు కేవలం ర2 రోజుల ముందే ఇషాన్ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
మీడియా నివేదికల ప్రకారం, ఫైనల్‌కు రెండు రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇషాన్ కిషన్ సోదరి (కజిన్), బావ మతిచెందారు. కుటుంబంలో ఇంతటి భారీ విషాదం నెలకొన్నప్పటికీ, ఇషాన్ కిషన్ దేశానికే ప్రియారిటీ ఇస్తూ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఇంతటి బాధలో ఉన్నాననే విషయాన్ని అస్సలు తెలియనివ్వలేదు. ఇటీవల రింకూ సింగ్ తండ్రి కన్నుమూశారు. అక్కడ కార్యక్రమం నిర్వహించిన వెంటనే రింకూ వెంటనే జాతీయ జట్టు కోసం తిరిగి వచ్చి దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చాడు.
ఇంటికి రాలేకపోయిన ఇషాన్
ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ పాండే మాట్లాడుతూ.. "మేం చాలా కష్టంలో ఉన్నాం. ఇషాన్‌కు కూడా ఇంటివి రావాలి అనిపించింది. కానీ ప్రపంచ కప్‌లో జాతీయ జట్టుకు ఆడాల్సి ఉన్న కారణంగా రాలేకపోయాడు. అతను తన బాధను దిగమింగుతూ జట్టు కోసం మంచి ఇన్నింగ్స్ ఆడాడు’ అని తెలిపారు. ఈ విషాదం కారణంగానే ఇషాన్ కిషన్ తండ్రి ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు అహ్మదాబాద్ రాలేదు.
Not just a team. A family.
— Surya Kumar Yadav (@surya_14kumar) March 8, 2026
Not just a trophy. A dream for a billion of us.
PROUD to lead this group, PROUD to represent my India 🇮🇳🏆 A huge thank you to everyone standing beside me. You are the pillars of my strength 💙🙌🏼🫶🏻 pic.twitter.com/1fZ1DH3o5M
టోర్నమెంట్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన
టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ బ్యాట్ ఝుళిపించి సత్తా చాటాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అతను 4వ స్థానంలో నిలిచాడు. ఇషాన్ 9 మ్యాచ్‌ల్లోని 9 ఇన్నింగ్స్‌ల్లో 35.22 సగటుతో, 193.29 మెరుపు స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు సాధించాడు. టోర్నీలో ఇషాన్ కిషన్ 3 అర్ధ శతకాలు చేశాడు. షాన్ ఇప్పటివరకు తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 45 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లోని 45 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేస్తూ 1328 పరుగులు చేశాడు. అతడు ఒక్క సెంచరీ, 10 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు సంజూ శాంసన్ (89), అభిషేక్ శర్మ (52) తో పాటు వన్డ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.
ట్రెండింగ్ వార్తలు

















