అన్వేషించండి

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే

Special Intensive Revision SIR in April | తెలంగాణలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఎన్నికల కమిషన్ SIR ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా 50 లక్షల వరకు ఓట్లను ఈసీ తొలగించే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తెలంగాణలో ఏప్రిల్, మే నెలల్లో జరగనుంది. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 50 లక్షల ఓట్లదాకా బారీగా తొలగింపు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన పదిహేనేళ్లలో రెండు మూడు చోట్ల ఓట్లు నమోదు చేసుకుని అన్నిచోట్లా కొనసాగుతున్న వారి డూప్లికేట్ ఓట్లు ఇకపై కొనసాగవని ఈసీ అధికారులు చెప్తున్నారు. తెలంగాణా వ్యాప్తంగా వున్న 3.35 కోట్ల ఓట్లు ఈ సవరణ తర్వాత 2.75 లేదా 2.80 కోట్లకు తగ్గిపోయే అవకాశముంది. 

హైదరాబాద్ లోనే అత్యధిక ఓట్ల తొలగింపు..

పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల ఇటీవల చాలామంది హైదరాబాద్ కు వలస వచ్చి స్థిరపడుతున్నారు. ఐనప్పటికీ వారి స్వంత గ్రామాల్లో కూడా ఓట్లు కొనసాగిస్తూ సందర్భాన్నిబట్టి రెండు చోట్లా ఓటు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారు ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండటం వల్ల రెండు చోట్లా ఓటు వినియోగించుకుంటున్నారు. తాజా సవరణ జరిగితే ఆ డూప్లికేషన్కి అవకాశం ఉండదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి  మొత్తంగా 87 లక్షల ఓట్లు ఉన్నాయి. అందులో ఈ రకమైన డూప్లికేట్ ఓట్లు సుమారు 20 లక్షలదాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరిలో  ఆంధ్రప్రదేశ్ జిల్లాలనుంచి వచ్చినవారితోపాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చి రాజధాని నగరంలో స్థిరపడి ఓటు నమోదుచేసుకున్నవారూ ఉన్నారు. 

గ్రామీణ తెలంగాణలో సుమారు 30 లక్షల ఓట్లు తొలగింపునకు అవకాశం.

తెలంగాణలో పట్టనీకరణ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ తోపాటు జిల్లాల్లోని వివిధ ప్రధాన పట్టనాలకు వలసలు పెరిగాయి. పెద్ద పట్టనాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పట్టనాల్లో ఓటర్లు భారీగా పెరిగారు. ఆమేరకు ఆయా పట్టణ పరిసల గ్రామాల్లో ఓటర్ల సంక్య తగ్గాలి కానీ వారు ఓటు మాత్రం రెండు చోట్లా కొనసాగిస్తున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా గ్రామీణ తెలంగాణలో కూడా సుమారు మరో 30 లక్షల ఓట్లదాకా తగ్గొచ్చని అంచనా. కొన్ని చోట్ల గ్రామాల్లో ఓటు కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇవ్వగా కొందరు స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగింపునకు సుముఖంగా వున్నారు. ఏది ఏమైనా రెండు చోట్ల మాత్రం ఓటు ఉండకుండా వుండేందుకు ఈసీ అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకుంటోంది.

ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్ల గుర్తింపు..

బూత్ లెవల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్ల ద్వారా మొదట ప్రతీ ఇల్లూ సర్వేచేసి ప్రాధమిక జాబితారూపొందిస్తారు. ఆ సమయంలో ఓటరు స్వయంగా అందుబాటులో ఉండి అక్కడే తన ఓటు కొనసాగించాల్సిందగా చెప్పవచ్చు. లేదా మీ తరఫున ఆ ఇంటి యజమాని తగిన డాక్యుమెంటు ఆధారాలిచ్చి ఫారంలో సంతకం చేసినా సరిపోతుంది. ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లున్నట్టు గుర్తించేందుకు ఈసీ ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ వినియోగించబోతోంది. డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్ ను పరిశీలిస్తారు. పేరు, తండ్రిపేరు, వయసు, చిరునామా ల్లో సిమిలారిటీ వుంటే వాటిని గుర్తించి నోటీసులు ఇస్తారు.  ఎవరైతే ఈ రకమైన ఆధారాలు ఇవ్వరో ఆ ఓటు తొలగిస్తారు. 

మొత్తం నాలుగు దశల్లో ప్రక్రియ ..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) మొత్తం 4 దశల్లో జరుగుతుంది. మొదటిది డోర్ టు డోర్ సర్వే - మీ బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతీ ఇంటికీ వెళ్లి సర్వేచేస్తారు. రెండవది - ఆ సర్వే ఆధారంగా  డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల రూపొందిస్తారు. వాటి ముసాయిదా జాబితా విడుదలచేస్తారు. మూడవ దశ - జాబితాలో ఏవైనా తప్పులున్నా, ఓటు నమోదు కాకున్నా అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించి సవరిస్తారు. నాలుగవది ఫైనల్ ఓటర్ల జాబితా. 

రాజకీయ విమర్శలకి అవకాశం..!!

ఇప్పటికే ఎన్నికలు జరిగిన బీహాల్, త్వరలో ఎన్నికలు జరగబోతోన్న బెంగాల్ , తమిళనాడు తదితర రాష్ట్రాలో ఈ ఎస్ ఐ ఆర్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ, లేదా యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా ఓ వర్గానికి లేదా రాజకీయంగా తమకు వ్యతిరేకుల ఓట్లను వలసుల పేరిట తొలగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరి తెలంగాణలో ఎలా నిర్వహిస్తారో ప్రక్రియ ప్రారంభమైతే గానీ తెలియదు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget