అన్వేషించండి

Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!

Telangana Cabinet Decisions: తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ, రైతులకు బోనస్‌ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
  • ఆగస్టు 15 నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది.
  • హైదరాబాద్‌లో పెట్రోల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు సబ్సిడీ.
  • వానాకాలం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్.

Telangana Cabinet Decisions: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్‌పై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో పారిశ్రామిక అభివృద్ది, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, విద్యారంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అటు సామాన్యులకు ఊరటనిచ్చేలా, ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగుల పెట్టించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2.0

తెలంగాణను గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డెస్టినేషన్‌గా మార్చే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్‌ 2.0 నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మెగా సదస్సును ఈ ఏడాది డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి ఇన్వెస్ట్‌ తెలంగాణ అనే ప్రధాన నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందో. ముఖ్యంగా డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. సదస్సు విజయవంతం కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్‌ కుమార్, వివేక్ వెంకటస్వామిలతో కూడిన ప్రత్యేక సబ్‌కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ప్రపంచానికి ఆవిష్కరించనుంది. 

సామాన్యులకు స్మార్ట్‌ రేషన్ కార్డు 

రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. పాత కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3 కోట్లకుపైగా రేషన్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. నిరుపేదలకు పారదర్శకంగా సరకులు అందేలా ఈ స్మార్ట్ కార్డులను రూపొందించారు. 

హైదరాబాద్‌లో ఈవీ ఆటోలు భారీ ఊరట

హైదరాబాద్‌ సిటీని గ్రీన్ సిటీగా మార్చే దిశగా కేబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్‌ కోసం 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 18, 766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఈవీలుగా మారుస్తారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు ఒక్కో వాహనానికి గరిష్టంగా 1, 50, 000 సబ్సిడీ అందజేయనున్నారు. ఇది పాత ఆటోలకు ఈవీ కిట్లు అమర్చుకోడానికి లేదా పాతవి స్క్రాప్ చేసి కొత్త ఈ-ఆటోలు కొనడానికి వర్తిస్తుంది. 

సన్న వడ్లకు 500 రూపాయల బోనస్‌

రైతులకు ప్రోత్సహించే దిశగా కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలంలో పంట 7 రకాల సన్నధాన్యాలకు క్వింటాకు ఐదు వందల బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. మిగులు ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కేంద్రం తీసుకోగా మిగిలిన 17. 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి కనీస ధర క్వింటాలుకు రూ.2,389గా నిర్ణయించారు.   

రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా విద్యాసంస్థల నిర్వహణలో మార్పులు చేశారు. రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలను ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్‌  యూనివర్శిటీ పరిధిలోకి తీసుకురానున్నారు.  ఆదిలాబాద్‌, గజ్వేల్‌, దుబ్బాక వంటి ఏడు నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. దీంతో మొత్తం స్కూల్స్‌ సంఖ్య 86కు చేరింది. 

ఇతర నిర్ణయాలు 

మక్తల్-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్‌ -2 పనుల కోసం రూ. 2100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా లక్ష ఎకరాలు సాగునీరు అందనుంది. హైదరాబాద్‌లో కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సంబంధించిన దరఖాస్తు గడువును అక్టోబర్‌ 31 వరకు పొడిగించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో టీడీఆర్‌ సర్టిఫికేట్ల జారీ, వినియోగంపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. 

Frequently Asked Questions

కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 3 కోట్లకు పైగా కార్డులు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 ఎప్పుడు, ఏ లక్ష్యంతో నిర్వహించబడుతుంది?

ఈ సమ్మిట్ ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరుగుతుంది. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడం, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం దీని ప్రధాన లక్ష్యం.

హైదరాబాద్‌లో ఆటోలను ఈవీలుగా మార్చడానికి ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది?

తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్‌ కింద 200 కోట్లు కేటాయించారు. 18,766 పెట్రోల్/డీజిల్ ఆటోలను ఈవీలుగా మారుస్తారు, ఒక్కో వాహనానికి రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు.

సన్న వడ్లకు రైతులకు ఎంత బోనస్ చెల్లిస్తారు?

వానాకాలంలో పండించిన 7 రకాల సన్నధాన్యాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026 LIVE: ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget