అన్వేషించండి

Telangana Economic situation :తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. అప్పులు, హామీల మధ్య సమతుల్యం చేసుకోవడం సమస్యగా మారుతోంది.

Budget expectations of the people of Telangana :    తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కేవలం అంకెల గారడీగా కాకుండా, అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రణక్షేత్రంగా మారబోతున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  శ్వేతపత్రం డిమాండ్‌తో సర్కారును కార్నర్ చేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ అప్పుల చిట్టాను విప్పుతూ ఎదురుదాడికి దిగుతున్నారు. సుమారు 3  లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతున్న వేళ, రాష్ట్ర ఖజానా అసలు స్థితిగతులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంక్షేమం స అభివృద్ధి మధ్య సమతూకం పాటించడం ఇప్పుడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కత్తిమీద సాములా మారింది.

 అప్పుల కుప్ప.. వడ్డీల తిప్ప 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబి వేధిస్తోంది. గత పదేళ్లలో అప్పులు రూ.7.5 లక్షల కోట్లకు చేరాయని ముఖ్యమంత్రి ఆరోపిస్తుండగా, అధికారిక లెక్కలు భిన్నంగా ఉన్నాయి. అయితే, ఏ లెక్క చూసినా నెలకు వేల కోట్ల రూపాయలు కేవలం వడ్డీల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోంది.  ఈ  డెట్ ట్రాప్ నుంచి బయటపడి, కొత్త ప్రాజెక్టులకు నిధులు మళ్లించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు. అప్పు తెచ్చి పప్పు కూడు అన్నట్లుగా కాకుండా, ఆదాయ వనరులను పెంచుకోవడమే ఏకైక మార్గమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్యారంటీల భారం.. ఖజానాకు గండం 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు  బడ్జెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించనున్నాయి. రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పథకాల అమలుకు ఏటా రూ. 56,000 కోట్ల పైచిలుకు నిధులు అవసరమని అంచనా. ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, ఈ నిధుల కోసం ఇతర శాఖల కేటాయింపుల్లో కోత విధిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూనే, మౌలిక సదుపాయాలను విస్మరించకూడదనే ఒత్తిడి సర్కారుపై ఉంది.

పెట్టుబడి వ్యయంపై విమర్శలు 
 
రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడి వ్యయం  విషయంలో ప్రభుత్వం కొంత వెనుకబడి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌లో రూ. 36,000 కోట్లు కేటాయించినా, క్షేత్రస్థాయిలో ఖర్చు ఎంత అన్నదే కీలకం. జీతాలు, పెన్షన్లు వంటి రెవెన్యూ వ్యయం భారంగా మారుతున్న తరుణంలో, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం వంటి ఆస్తుల సృష్టికి నిధులు తగ్గిస్తే దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. సంక్షేమంతో పాటు సంపద సృష్టిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ఆదాయ మార్గాలు - ట్రిలియన్ డాలర్ల కల 

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం నెరవేరాలంటే, ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచుకోవాలి. అటవీ, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లపై రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే నిధులు రాబట్టుకోవడం రాజకీయంగానూ, ఆర్థికంగానూ ఇప్పుడు అనివార్యం. ఈ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ ఆర్థిక దిశను నిర్దేశించనున్నాయి. కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం పారదర్శకంగా వివరాలు వెల్లడిస్తుందా? లేక రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా అన్నది చూడాలి. సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచుతూనే, ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే రేవంత్ సర్కార్ ముందున్న అసలైన పరీక్ష.  

టాప్ హెడ్ లైన్స్

Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget