Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
ఐపీఎల్ 2026లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డారు. క్యాచ్ అందుకునే క్రమంలో జరిగిన ఈ ప్రమాదం చూసి ప్లేయర్స్, ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పంజాబ్ ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గాల్లోకి లేచిన ఆ బాల్ ను అందుకునేందుకు మిడాఫ్ నుంచి ఎంగిడి వెనక్కి పరుగెత్తాడు. ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. ఈ క్రమంలో అతని తల, మెడ భాగం నేలకు బలంగా తాకాయి. నొప్పితో ఎంగిడి మైదానంలోనే విలవిలలాడగా, వెంటనే ఫిజియోలు మైదానంలోకి చేరుకున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన అంబులెన్స్‌ను వెంటనే మైదానంలోకి రప్పించారు. ఎంగిడి స్పృహలోనే ఉన్నా, లేవలేని స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడే ఢిల్లీ పోలీసులు చాలా వేగంగా స్పందించారు. స్టేడియం నుంచి హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, కేవలం 11 నిమిషాల్లోనే AIIMS ట్రామా సెంటర్‌కు తరలించారు. ఢిల్లీ వంటి ట్రాఫిక్ ఉండే ప్లేస్ లో పోలీసుల సమయస్ఫూర్తిని చూసి అందరూ అభినందిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు

















