అన్వేషించండి

Tata Sierra vs Kia Seltos Comparison: టాటా సియెరా వర్సెస్‌ కియా సెల్టోస్‌! మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోయే ఎస్‌యూవీ ఏదీ? ధర, ఫీచర్లు ఇతర పోలికలు తెలుసుకోండి!

Tata Sierra vs Kia Seltos: భారత్‌ ఎస్‌యూవీ మార్కెట్‌లో టాటా సియెరా, కియా సెల్టోస్‌ మధ్య ఆసక్తికరమైన పోటీ ఉంది. 10.99 లక్షల ప్రారంభ ధరతో సెల్టోస్ లభిస్తే, సియెరా 11. 49 లక్షల ధరకు కొనుగోలు చేయొచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సెల్టోస్ ఎక్కువ టెక్ ఫీచర్లు, సియెరా క్లాసిక్ డిజైన్ ఆకర్షిస్తాయి.

Tata Sierra vs Kia Seltos Comparison: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా పది నుంచి 15 లక్షల బడ్జెట్‌లో కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడల్స్ ప్రవేశ పెడుతున్నాయి. ఈ క్రమంలో నోస్టాలజీని గుర్తు చేసేలా సరికొత్త హంగులతో వచ్చిన టాటా సియెరా, ఆధునిక టెక్నాలజీకి మారుపేరుగా ఉన్న కియా సెల్టోస్‌ మధ్య చాలా పెద్ద పోటీ ఉంది. ఈ రెండు కార్లలో దేని ప్రత్యేకత ఏంటీ? మీ అవసరాలకు ఏ వాహనం సరిపోతుంది? అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. 

ధర, వేరియంట్ల మధ్య తేడా 

ధర పరంగా చూస్తే కియా సెల్టోస్ ముందంజలో ఉంది. తక్కువ ధరకే లభిస్తుంది. కియో సెల్టోస్‌ బేసిక్ మోడల్‌ HTE పెట్రోల్‌ 1.5L మాన్యువల్ మోడల్‌ 10.99 లక్షలకు వస్తుంది. టాటా సియెరాలోని స్మార్ట్‌ ప్లస్ పెట్రోల్ 1.5 L మాన్యువల్‌ ప్రారంభ ధర 11.49 లక్షలుగా ఉంది. ప్రస్తుతం రెండు కార్లు తమ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బేసే వేరియంట్లుగా నిలిచాయి. 

Also Read: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

ఇంజన్, ఫెర్మార్మెన్స్‌లో పోలికలు 

సామర్థ్యంలో విషయంలో రెండు కార్లు దాదాపు ఒకే రకమైన ఇంజిన్లు కలిగి ఉన్నాయి. అయితే పవర్ అవుట్‌పుట్‌లో స్వల్ప తేడాలు ఉన్నాయి. టాటా సియెరా 1498cc ఇంజిన్‌తో వస్తుండగా, కియో సెల్టోస్‌ 1497 cc ఇంజన్ కలిగి ఉంది. సెల్టోస్ పవర్‌లో ముందజలో ఉంది. ఇది 113bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. సియెరా 105bhpకే పరిమితమైంది. 

టార్క్ విషయంలానికి వస్తే సియెరా 145Nm టార్క్‌ను అందిస్తే, సెల్టోస్‌ 144Nm టార్క్‌ను ఇస్తుంది. మైలేజీ గురించి చెప్పుకుంటే టాటా సియెరా లీటర్‌కు 17.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 

పరిమాణం సౌకర్యంలో ఎవరిది పైచేయి 

ఒక ఎస్‌యూవీలో ప్రయాణికులు కోరుకునే ప్రధాన అంశం స్పేస్‌. ఈ విషయంలో టాటా సియెరా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సియెరా 2730mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీంతో లోపల లెగ్ రూమ్‌ ఎక్కువగా ఉంది. సెల్టోస్‌ వీల్ బేస్ 2690mm మాత్రమే. బూట్ స్పేస్‌లో సియెరా ఎకంగా 622 లీటర్లు ఉంటే సెల్టోస్‌లో 447 లీటర్లకే పరిమితం అయ్యింది. బారతీయ రోడ్లపై ప్రయాణానికి అత్యంత ముఖ్యమైన గ్రౌండ్ క్లియరెన్స్‌ సియెరాలో 205mmగా ఉంది. ఇది ఎగుడు దిగుడు రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. 

Also Read: ఎంజీ కామెట్ వైజాగ్‌లో కొనాలి అంటే ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

భద్రతకు పెద్దపీట

భారతీయ వినియోగదారులు ఇప్పుడు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రెండు కార్లు కూడా భారత్‌ ఎన్‌క్యాప్ పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. రెండింటిలోనూ ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నాయి. డిస్క్‌బ్రేక్‌, ఏబీఎస్‌, ఈబీడీ వంటి ఫీచర్లు రెండు కార్లలోనూ ఉన్నాయి. 

టెక్నాలజీ, ఫీచర్ల విషయంలో తేడా ఏంటీ ? 

కియా సెల్టోస్‌ తన టెక్నాలజీతో కుర్రుకారును ఆకర్షిస్తోంది. ఇందులో 10.25ఇంచ్‌ల హెచ్‌డీ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు టాటా  సియెరా తన క్లాసిక్‌ డిజైన్‌తోపాటు ఆధునిక హంగులను అద్దింది. ఇందులో ఇల్యూమినేటెడ్‌ టాటా లోగోతో కూడిన స్టీరింగ్‌ వీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

ఆర్థిక అంశాల్లో ఎవరు ఎక్కడ ఉన్నారు?

ఈ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే వారికి ఐదేళ్ల కాలపరిమితితో ఈఎంఐ సౌకర్యం ఉంది. టాటా సియెరా కొనేందుకు నెలకు 21, 971 ఈఎంఐ పడే ాన్స్ ఉంది. కియా సెల్టోస్ కొనాలంటే నెలకు 21,015 ఈఎంఐ పడుతుంది. 

Also Read: ఎంజీ కామెట్‌ ఈవీ వర్సెస్‌ టాటా టియాగో ఈవీ! సామాన్యుడికి ఏది లాభదాయకం?

మీకు ఎక్కువ స్పేస్‌, భారీ బూట్ స్టోరేజీ, గంభీరమైన రూపం కావాలనుకుంటే టాటా సియెరా సరైన ఎంపిక. అలా కాకుండా తక్కువ ధరలో ఎక్కువ టెక్ ఫీచర్లు మెరుగైన ఇంజన్ పవర్, సిటీ డ్రైవింగ్‌కు అనువైన కారు కావాలనుకుంటే కియో సెల్టోస్‌ వైపు మొగ్గు చూపవచ్చు.   
 

Frequently Asked Questions

టెక్నాలజీ ఫీచర్ల విషయంలో కియా సెల్టోస్ ఎలా ఆకట్టుకుంటుంది?

కియా సెల్టోస్‌లో 10.25ఇంచ్‌ల హెచ్‌డీ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget