అన్వేషించండి

Honda ZR-V Mileage: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

Honda ZR V Full Tank Capacity | హోండా కారు హోండా జెడ్‌ఆర్ వీ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ దీని ప్రత్యేకత. లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ SUV 1000 కి.మీ రేంజ్ ఇస్తుంది.

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కొత్త వ్యూహంలో భాగంగా భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్లోకి తిరిగి రావడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా హోండా ZR-V (Honda ZR-V) శ్రీకారం చుట్టనుంది. ఈ SUVని తొలిసారిగా భారత ఆటో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. హోండా కంపెనీ దీనిని ఒక ప్రత్యేక 'హలో మోడల్' (Halo Model) గా పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ కారు బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేయడానికి లాంచ్ చేస్తున్నారు. 

హోండా ZR-Vని భారత్‌లో పూర్తిగా దిగుమతి చేసుకుంటారు. కాబట్టి దీని ధర కూడా ప్రీమియం సిరీస్‌లో ఉండే అవకాశం ఉంది. గతంలో భారత్‌లో విక్రయించిన హోండా CR-V కంటే పై కేటగిరీలో నిలుస్తుంది. ఇది స్కోడా కొడియాక్ (Skoda Kodiaq), ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తూనే 5 సీటర్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

హోండా జెడ్‌ఆర్ బీ డిజైన్ ఎలా ఉంటుంది?
డిజైన్ విషయానికి వస్తే హోండా ZR-V సుమారు 4.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. దాంతో పెద్ద రోడ్డుపై ఇది స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ లుక్ చాలా బోల్డ్, స్పోర్టీగా ఉంటుంది. ఇందులో షార్ప్ హెడ్‌లైట్లు, పెద్ద గ్రిల్ ఇవ్వనున్నారు. ప్రీమియం, స్టైలిష్ కారును కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ SUVని రూపొందించారు.

ఫీచర్ల పరంగా కూడా ఈ కారు మోడ్రన్, అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు ఇస్తున్నారు. ఇవి ఎండాకాలంలో మీ జర్నీని సౌకర్యవంతంగా మారుస్తాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ద్వారా డ్రైవర్, ప్యాసింజర్ తమకు నచ్చిన విధంగా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, మరెన్నో ఆధునిక ఫీచర్లు వల్ల ఇది లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

హోండా ZR-V పవర్‌ట్రెయిన్
హోండా ZR-V ఎస్‌యూవీ అతిపెద్ద ప్రత్యేకత దీని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్. ఈ టెక్నాలజీ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారును అవసరానికి తగ్గట్లుగా ఉపయోగిస్తుంది. దీనివల్ల కారు ఎక్కువ మైలేజీ ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీకు తక్కువ ఫ్యూయల్ ఖర్చవుతుంది. రిపోర్టు ప్రకారం, ఈ SUV ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 1000 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్ రేంజ్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లోని ఇతర SUVలలో ఇటువంటి హైబ్రిడ్ వ్యవస్థ లేకపోవడంతో ఇది బిగ్ గేమ్ ఛేంజర్‌గా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. 

కానీ భారత మార్కెట్లో హోండా ZR-Vని పెద్ద ఎత్తున విక్రయించరు. ఇది లిమిటెడ్ రేంజ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. తమ ప్రత్యేక కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్ పరిచయం చేస్తున్నారు. భారత్‌లో మరిన్ని కొత్త, అడ్వాన్స్‌డ్ కార్లను తీసుకురావడానికి హోండా కంపెనీ సిద్ధమవుతోందని చూపించడానికి ఈ లాంచ్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి హోండా ZR-V అనేది ప్రీమియం, మోడ్రన్ టెక్నాలజీతో వస్తున్న స్టైలిష్ SUVగా నిలువనుంది. మరోవైపు భారత్‌లో హోండా కంపెనీ పూర్వవైభవం కోసం ఈ కారుతో నాంది పలకాలని భావిస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget