ప్రస్తుతం, కియా సోనెట్ మరియు కియా సైరోస్ కార్లు పది లక్షల బడ్జెట్ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో అనేక వేరియంట్లు ఉన్నాయి.
Best Kia Cars Under 10 Lakh: మధ్యతరగతి మెచ్చే 10 లక్షల బడ్జెట్ కియా కార్లు! ధర, ఫీచర్లు, మైలేజీ సంగతేంటి?
Best Kia Cars :భారత్ అటోమొబైల్ మార్కెట్‌లో కియా చాలా స్పెషల్. ప్రీమియం వినియోగదారులకే ఈ కార్లు అనుకుంటే పొరపాటు చేసినట్టే. మధ్యతరగతిని టార్గెట్ చేస్తూ పది లక్షల్లో పలు మోడల్స్‌ను తీసుకొచ్చింది.

- కియా భారతీయ మార్కెట్లో సోనెట్, సైరోస్ మోడల్స్ అందిస్తోంది.
- సోనెట్ రూ.7.30 లక్షల నుంచి, సైరోస్ రూ.8.67 లక్షల నుంచి ప్రారంభం.
- రెండు కార్లు మంచి మైలేజ్, భద్రతా ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.
- కియా 2027 నాటికి కొత్త సోనెట్ మోడల్ విడుదల చేయనుంది.
Best Kia Cars Under 10 Lakh: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడం విజయం సాధించింది. ఇక్కడ ప్రజల టేస్టు తగ్గట్టు మోడల్స్ డిజైన్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. వాటిలో పది లక్షల బడ్జెట్‌లో లభించే కార్లు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం పది లక్షల బడ్జెట్ పరిధిలో కియా ప్రధానంగా రెండు మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో మొదటిది కియా సోనెట్. ఈ విభాగంలో కియాకు అత్యంత ఆదరణ కలిగించిన మోడల్స్ ఈ సోనెట్. దీని ఎక్స్ షోరూమ్ ధర 7. 30 లక్షల నుంచి 14 లక్షల వరకు ఉంటుంది. ఈ సోనెట్‌లో మొత్తం 23 వేరియంట్లు ఉన్నాయి. మైలేజీ చూస్తే 18.6 నుంచి 19.2 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీ అందిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.
మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పది లక్షల బడ్జెట్‌లో వచ్చే మరో మోడల్ కియా సైరోస్. సోనెట్ తర్వాత కియా నుంచి వచ్చిన ఈ మోడల్ ధర 8. 67 లక్షల నుంచి 15. 94 లక్షల మధ్య ఉంటుంది. సైరోస్ 15 వేరియంట్లలో లభిస్తోంది. ఇది లీటర్‌కు 17. 6 నుంచి 20.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు కూడా ఆటోమేటిక్, మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్లు కలిగి ఉంది.
కియా తన బడ్జెట్ ఎస్‌యూవీలలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ విభాగంలో రెండు మోడల్స్ కూడా ఆరు ఎయిర్ బ్యాగ్‌లతో వస్తున్నాయి. అదనంగా ఏబీఎస్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ కార్లలో అంియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి విలాసవంతమైన ఫీచర్లు అందిస్తోంది.
మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
తక్కువ ప్రారంభ ధరలో ఫీచర్ రిచ్ ఎస్‌యూవీ కావాలనుకుంటే సోనె్ బేస్ వేరియంట్లు తీసుకోవచ్చు. మీరు ఎక్కువ మైలేజీ వైవిధ్యమైన వేరియంట్లు కోరుకుంటే సైరోస్ పెట్రోల్ లేదా డీజిల్ మోడల్స్ మంచి ఆప్షన్. ఈ కార్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తున్నాయి. ఇవి నగర ప్రయాణాలకు, హైవే డ్రైవింగ్‌కు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి.
రాబోయే రోజుల్లో కియా తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించునుంది. 2027నాటికి సరికొత్త న్యూ సోనెట్ విడుదల చేయనుంది. ఇది 8. 50 నుంచి 17 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.
Frequently Asked Questions
పది లక్షల లోపు బడ్జెట్‌లో కియా నుండి ఏ కార్లు అందుబాటులో ఉన్నాయి?
కియా సోనెట్ మైలేజీ మరియు ధర ఎంత?
కియా సోనెట్ 18.6 నుండి 19.2 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర 7.30 లక్షల నుండి 14 లక్షల వరకు ఉంటుంది.
కియా సైరోస్ మైలేజీ మరియు ధర ఎంత?
కియా సైరోస్ 17.6 నుండి 20.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ధర 8.67 లక్షల నుండి 15.94 లక్షల మధ్య ఉంటుంది.
ఈ కియా బడ్జెట్ SUVలలో భద్రతా ఫీచర్లు ఏమిటి?
ఈ రెండు మోడల్స్ లోనూ ఆరు ఎయిర్ బ్యాగులు, ABS సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
కొత్త కియా సోనెట్ ఎప్పుడు విడుదల కానుంది?
కొత్త కియా సోనెట్ 2027 నాటికి విడుదల కానుంది. దీని ధర 8.50 లక్షల నుండి 17 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.
ట్రెండింగ్ వార్తలు






















