అన్వేషించండి

Best Mahindra Cars Under 10 Lakh: పది లక్షల బడ్జెట్‌లో మహీంద్రా తీసుకొచ్చిన పవర్‌ఫుల్‌ కార్లు! ఫీచర్లు, మైలేజీ ధరల పూర్తి వివరాలు ఇవే!

Best Mahindra Cars Under 10 Lakh: రగ్గడ్‌ ఎస్‌యూవీలకు మహీంద్రా అండ్ మహీంద్రా పెట్టింది పేరు. ఇలాంటి మాస్‌ లుక్‌ ఉండే  కార్లలో పది లక్షల రూపాయాల్లో లభించే మోడల్స్ గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా రూ. 10 లక్షలలోపు ఐదు శక్తివంతమైన SUV మోడళ్లను అందిస్తోంది.
  • XUV 3XO, థార్, బొలెరో, బొలెరో నియో బడ్జెట్ ధరల్లో లభిస్తున్నాయి.
  • భద్రతా రేటింగ్‌లో 5-స్టార్, రియర్/ఫోర్-వీల్ డ్రైవ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
  • 2027లో రూ. 7.50 లక్షల నుంచి ప్రారంభమయ్యే కొత్త విజన్ మోడల్ రానుంది.

Best Mahindra Cars Under 10 Lakh: భారత్‌లో ఎస్‌యూవీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా. ఒకప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ వాహనాలు, నేడు అత్యాధునిక హంగులో సిటీ యువతను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సామాన్యుడి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని పది లక్షల రూపాయల లోపు ధరలో మహీంద్రా ప్రస్తుతం ఐదు రకాల శక్తివంతమైన ఎస్‌యూవీలను అందిస్తోంది. భద్రతలో, టెక్నాలజీలో, మైలేజీలో ఈ వాహనాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ బడ్దెట్‌లో విద్యుత్ వాహనాలు మాత్రం తీసుకురాలేదు మిగతా వేరియంట్లు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

పది లక్షలకు లభించే మహీంద్రా మోడల్స్ ఇవే

ప్రస్తుతం పది లక్షల లోపు లభిస్తున్న కీలక మోడళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విభాగంలో అత్యంత ఆధునికమైన ఎస్‌యూవీ మహీంద్రా XUV 3XO. దీని ధర 7.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో, ఆటోమేటిక్‌, మాన్యువల్‌ గేర్‌ ఆప్షన్లతో లభిస్తుంది. లీటర్‌ 18 నుంచి 21.2 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. 

థార్‌ ఖరీదు ఎంత అంటే?

ఆఫ్‌ రోడింగ్ ప్రియులకు బాగా ఇష్టమైన కారు థార్. ఇది 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు మైలేజీ కూడా 15.2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఏళ్ల నుంచి రోడ్లపై రాజాలా తిరుగుతున్న కారు బొలెరో. ఇది 8 నుంచి 9.90 లక్షల వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. 7  సీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో మరో వేరియంట్ ఉంటుంది. ఇది బొలెరో నియో. దీని ధర 8.85 నుంచి 10.49 లక్షల వరకు ఉంటుంది. ఇది లీటర్‌ 18 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. 

భద్రత రేటింగ్‌లో తగ్గేదేలే అంటున్న మహీంద్రా

మహీంద్ర తన వాహనాల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ బడెజ్ట్ విభాగంలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO వంటి మోడళ్లు అత్యున్నతమైన ఫైవ్‌ స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయి.  ధరలో రియర్ వీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు అందిస్తున్న ఏకైక కంపెనీ మహీంద్రా. కఠినమైన రహదారులపై కూడా సులభంగా ప్రయాణించేలా వీటి నిర్మాణం ఉంటుంది. ఏబీఎస్‌ సిస్టమ్‌, సెంట్రల్‌ లాకింగ్, వైర‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఇప్పుడు బడ్జెట్‌ ఎస్‌యూవీలో కూడా లభిస్తున్నాయి. 

కొత్తగా వస్తున్న మోడల్ ఇదే 

ప్రస్తుతం ఉన్న మోడల్స్‌తోపాటు త్వరలోనే 10 లక్షల బడ్జెట్‌లో కొత్త మోడల్స్ తీసుకొచ్చేందుకు మహీంద్రా కంపెనీ ప్రయత్నిస్తోంది. 2027లో మహీంద్రా విజన్ అనే కొత్త మోడల్‌ లాంచ్ చేయనుంది. ఇది 7.50 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇది పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిన్‌తో వస్తుందని భావిస్తున్నారు.  ప్యామిలీతోపాటు సెక్యూర్డ్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీరు ఎస్‌యూవీ 3XO మంచి ఎంపిక అవుతుంది. అడ్వంచర్స్‌, ఆఫ్‌రోడింగ్ ఇష్టమైతే మహీంద్రా థార్ బేస్ వేరియంట్‌ను ట్రై చేయవచ్చు. ఎక్కువ మంది ప్రయాణానికి వీలుగా  కమర్షియల్, రూరల్‌లో తిప్పేందుకు అయితే బొలెరో సిరీస్‌ వైపు మొగ్గు చూపవచ్చు. 

Frequently Asked Questions

పది లక్షల లోపు మహీంద్రా నుంచి ఏయే SUV మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

పది లక్షల లోపు మహీంద్రా XUV 3XO, థార్, బొలెరో, మరియు బొలెరో నియో వంటి శక్తివంతమైన SUV మోడల్స్ ను అందిస్తోంది.

మహీంద్రా XUV 3XO యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

XUV 3XO ధర 7.54 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో, ఆటోమేటిక్, మాన్యువల్ గేర్ ఆప్షన్లతో లభిస్తుంది, మరియు 18-21.2 కిమీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది.

ఆఫ్-రోడింగ్ ప్రియులకు మహీంద్రా ఏ SUV ని సిఫార్సు చేస్తుంది?

ఆఫ్-రోడింగ్ ప్రియులకు మహీంద్రా థార్ బేస్ వేరియంట్ మంచి ఎంపిక. దీని ధర 9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది మరియు 15.2 కిమీ/లీటర్ మైలేజీని అందిస్తుంది.

కుటుంబంతో ప్రయాణించడానికి ఏ మహీంద్రా SUV ఉత్తమమైనది?

కుటుంబంతో సురక్షితమైన ప్రయాణానికి మహీంద్రా XUV 3XO మంచి ఎంపిక. ఇది 5-స్టార్ భద్రతా రేటింగ్ కలిగి ఉంది మరియు అనేక ఆధునిక ఫీచర్లను అందిస్తుంది.

మహీంద్రా నుంచి 2027లో రాబోయే కొత్త మోడల్ ఏది?

2027లో మహీంద్రా విజన్ అనే కొత్త మోడల్ లాంచ్ కానుంది. దీని ధర 7.50 లక్షల నుండి 13 లక్షల వరకు ఉండొచ్చని అంచనా, మరియు ఇది పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget