అన్వేషించండి

Tata Sierra EV: రేంజ్‌లో టాటా సియెర్రా ఈవీ అన్నింటిని దాటుతుందా ? ఫీచర్లు, మైలేజీపై కస్టమర్లలో ఉత్కంఠ

టాటా సియెర్రా EV విడుదలకు ముందు దాని రేంజ్ అని కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇది రేంజ్ పరంగా బలమైన పోటీదారుగా నిలుస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

టాటా మోటార్స్ మే నెలలో తమ కొత్త ఎలక్ట్రిక్ SUV టాటా సియెర్రా EVని లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కారు కంపెనీకి చాలా ప్రత్యేకమైనది. ఇది పాత సియెర్రా మోడల్‌కు సంబంధించి కొత్త వెహికల్. కంపెనీ నుంచి మంచి డిమాండ్ ఉంటే కారుకు మోడ్రన్ ఎలక్ట్రిక్ రూపంలో టాటా సియెర్రా ఈవీ వస్తోంది. సియెర్రా EV ని హారియర్ EV లాగానే సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ రెండింటిలోనూ అందించనున్నారు. ఈ SUVలో కొత్త టెక్నాలజీ, మెరుగైన పనితీరు,  అద్భుతమైన డిజైన్ ఉంటాయి. డ్యూయల్ మోటార్ వెర్షన్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ధరలో చాలా తక్కువ కార్లలో ఈ ఫీచర్ కనిపిస్తుంది. దీంతోపాటు ఈ కారు గతుకు రోడ్లు, కొంచెం ఇబ్బందికరమైన మార్గాల్లో కూడా బాగానే వెళ్తుంది. 

బ్యాటరీ, ఈవీ రేంజ్..

టాటా సియెర్రా EV గురించి మాట్లాడితే ఎక్కువగా దాని రేంజ్ గురించి చర్చకు వస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దీని సింగిల్ మోటార్ వెర్షన్ 55kWh బ్యాటరీని కలిగి ఉండనుంది. అయితే డ్యూయల్ మోటార్ వెర్షన్ 65kWh పెద్ద బ్యాటరీతో రానుంది. పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల సియెర్రా ఈవీ రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. కంపెనీ అధికారికంగా దీని మైలేజ్ రేంజ్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ SUV 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని ఇవ్వగలదని భావిస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే ఆ విభాగంలోని అనేక కార్ల కంటే టాటా సియెర్రా ముందంజలో నిలవనుంది. రియల్ టైంలో దీని రేంజ్ దాదాపు 400 నుండి 450 కిలోమీటర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది రోజువారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది.  సియెర్రా EV బరువు హారియర్ EV కంటే కొంచెం తక్కువగా ఉండనుంది. దాంతో సియెర్రా ఈవీ రేంజ్ మెరుగ్గా ఉంటుంది.

ఏ EVలతో సియెర్రా పోటీ ఉంటుంది?

టాటా సియెర్రా EV మహీంద్రా BE6, XEV 9e వంటి కొత్త ఎలక్ట్రిక్ SUVలతో మార్కెట్లో పోటీపడుతుంది. ఈ కార్ల రేంజ్ కూడా చాలా బాగుంది. చాలా EVల రేంజ్ 500- 550 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఒకవేళ సియెర్రా EV నిజంగా 600km కంటే ఎక్కువ రేంజ్ ఇస్తే, ఈ విభాగంలో టాటా సియెర్రా ఈవీకి తిరుగుండదు. అలాగే, AWD ఫీచర్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఎందుకంటే ఈ ధరలో ఈ ఫీచర్ చాలా తక్కువగా కనిపిస్తుంది.

డిజైన్, ఇంటీరియర్లో కొత్తగా ఏముంటుంది?

టాటా సియెర్రా EV డిజైన్ పాత సియెర్రా నుంచి తీసుకుని రూపొందించారు. కానీ ఇందులో ఆధునిక స్పర్శ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ల గుర్తింపుగా మారిన closed grille డిజైన్‌తో వస్తుంది. ఇంటీరియర్లో కూడా చాలా మార్పులు కనిపిస్తాయి. ఇందులో కొత్త స్క్రీన్, మెరుగైన సీట్లు, మరికొన్ని మోడ్రన్ ఫీచర్లు ఉండవచ్చు. ఈ SUV ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించడానికి టాటా మోటార్స్ దీన్ని రూపొందించింది. పాత సియెర్రా తరహాలోనే సియోర్రా ఈవీ సైతం మార్కెట్లో దూసుకెళ్తుందని కంపెనీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget