అన్వేషించండి

MG Comet EV vs Tata Tiago EV: ఎంజీ కామెట్‌ ఈవీ వర్సెస్‌ టాటా టియాగో ఈవీ! సామాన్యుడికి ఏది లాభదాయకం?

భారత్‌లో EV జోరు పెరుగుతోంది. అందుకే బడ్జెట్‌లో ఈవీలు కొనే ముందు ఏది బాగుంటుందో బేరీజు వేసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజల ఆదరణ పొందిన ఎంజీ కామెట్‌, టాటా టియాగో ఈవీ మధ్య పోలికలను చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరుగుతోంది; కామెట్, టియాగో ప్రజాదరణ పొందాయి.
  • ఎంజీ కామెట్ ధర రూ. 6.31 లక్షలు, టాటా టియాగో ధర రూ. 7.99 లక్షలు.
  • కామెట్ 41 bhp, టియాగో 60 bhp శక్తితో మెరుగైన పనితీరు అందిస్తాయి.
  • కామెట్ 230 కి.మీ రేంజ్, టియాగో 223 కి.మీ రేంజ్ అందిస్తుంది.

MG Comet EV vs Tata Tiago EV: భారత్‌ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సందడి పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరల నుంచి తప్పించుకోవడానికి మధ్య తరగతి ప్రజలు ఎలక్ట్రిక్‌ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ విభాగంలో ప్రస్తుతం రెండు దిగ్గజ మోడళ్లు ఎంజీ కామెట్‌ ఈవీ, టాటా టియాగో ఈవీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఒకవైపు వినూత్న డిజైన్‌తో కూడిన కామెట్‌, మరోవైపు సంప్రదాయ హ్యాచ్‌బ్యాక్‌ రూపంలో ఉన్న టియాగో మధ్య తేడాను వాటి సామర్థ్యాలను పరిశీలించాల్సిన  అవసరం ఉంది. 

ఎంజీ కామెట్‌, టాటా టియాగో ధరల మధ్య పోలిక

ఎంజీ కామెట్‌ ఈవీ ప్రారంభ ధర 6.31 లక్షలు. దీనికి నెలకు సుమారు 12,073 ఈఎంఐ(ఐదేళ్ల కాలపరిమితికి) పడే అవకాశం ఉంది. టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర 7.99 లక్షలుగా ఉంది. దీని నెలవారీ ఈఎంఐ సుమారు 15.278 రూపాయలుగా ఉంటుంది. అంటే ప్రారంభ ధరలోనే కామెట్‌ సుమారు 1.68 లక్షలు తక్కువగా లభిస్తోంది. 

ఎంజీ కామెట్‌, టాటా టియాగోలో ఫీచర్స్‌ సంగతేంటీ?

ఈ రెండు వాహనాలు కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌పై నడుస్తాయి. అయితే వీటి పనితీరులో గణనీయమైన మార్పులు ఉన్నాయి. ఎంజీ కామెట్‌ ఈవీ 17.3kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉండగా, ఇది 41 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టాటా టియాగో ఈవీ 19.2kWh బ్యాటరీతో వస్తుంది. 60bhp శక్తిని అందిస్తుంది. కామెట్‌ వెనుక చక్రాల డ్రైవ్‌, మోటార్‌ వెనుక ఇరుసుపై ఆధారపడి ఉంటుంది. టియాగో ఈవీ ముందు చక్రాల డ్రైవ్‌‌ కలిగి ఉంది. కామెట్‌ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 19.97 సెకనుల్లో అందుకుంటుంది. 

Also Read: విద్యార్థులకు యూజ్ అయ్యే మధ్యతరగతి బడ్జెట్‌ ఎలక్ట్రిక్‌ సైకిళ్లు! స్కూల్‌ వెహికల్స్‌కు కట్టే డబ్బులతో కొనేయొచ్చు!

ఎంజీ కామెట్‌, టాటా టియాగో బ్యాటరీలో ఎవరి పవర్ ఎంత?

ఎలక్ట్రిక్ కార్లను కొనేవారు ప్రధానంగా చూసేది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది అనే అంశం. ఎంజీ కామెట్‌ ఈవీ డ్రైవింగ్ రేంజ్ 230 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. టాటా టియాగో ఈవీ ఎంఐడీసీ సర్టిఫైడ్‌ రేంజ్‌ 223 కిలోమీటర్లు. ఇక్కడ ఆసక్తిరమైన విషయం ఏంటంటే, టాటా టియాగో ఈవీలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. దీని ద్వారా కేవలం 58 నిమిషాల్లో పది నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చు. కామెట్‌లో ఈ వేరియంట్‌లో అటువంటి సమాచారం అందుబాటులో లేదు. 

ఎంజీ కామెట్‌, టాటా టియాగో సైజ్‌ల తేడా

ఎంజీ కామెట్‌ కేవలం 2974 mm పొడవు కలిగిన అత్యంత చిన్న కారు. ఇందులో కేవలం రెండు డోర్స్‌ మాత్రమే ఉన్నాయి. నాలుగు మంది ప్రయాణించవచ్చు. దీని టర్నింగ్‌ రేడియస్‌ కేవలం 4.2 మీటర్లు మాత్రమే ఉండటం వల్ల నగరాల్లో పార్కింగ్‌ చాలా సులభం. టాటా టియాగో 3769 mm పొడవుతో ఒక పూర్తి స్థాయి హ్యాచ్‌బ్యాక్. ఇందులో ఐదు డోర్స్‌, ఐదు మంది ప్రయాణించే వీలుంది. ప్రయాణాల్లో సామాన్లు ఉంచుకోవడానికి 240 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. 

భద్రతలో ఎవరి స్థాయి ఏంటీ

రెండు వాహనాల్లో భద్రత కోసం రెండు ఎయిర్ బ్యాగ్‌లు వస్తున్నాయి. రెండింటిలోనూ ఏబీఎస్‌, ఈబీడి , డిస్క్‌, డ్రమ్‌ బ్రేక్స్ ఉన్నాయి. రెండింటిలోనూ హాలోజన్ హెడ్‌ల్యాంప్స్‌, టైల్ లైట్స్‌ ఉన్నాయి. అయితే కామెట్‌లో డేటైమ్‌ రిన్నింగ్ లైట్స్ అదనంగా ఉన్నాయి. 

కామెట్‌లో డ్యూయల్‌ టోన్ కార్బన్‌ బ్లాక్‌, లైట్‌ వార్మ్‌ గ్రే ఇంటీరియర్‌ ఉండగా, టియాగో ఈవీల ప్రీమియం లైట్ గ్రే, బ్లాక్‌ ఇంటీరియర్‌ లభిస్తుంది. బ్యాటరీపై రెండు కంపెనీలు కూడా 8 ఏళ్ల వారంటీని అందిస్తున్నాయి. 

Also Read: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

టాటా మోటార్స్‌ తన టియాగో ఈవీతో ఇప్పటికే మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించుకోగా, ఎంజీ మోటార్‌ తన కామెట్‌తో నగర ప్రయాణాలకు సరికొత్త పరిష్కారం అనే నినాదంతో ముందుకు వచ్చింది. అయితే ఒకే కారు కుటుంబం మొత్తానికి , సుదీర్ఘ ప్రయాణాలకు కావాలనుకునే వారికి టియాగో ఈవీ ఒక ప్రాక్టికల్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది. 

మీరు తక్కువ ధరలో, స్మార్ట్ ఈవీ కావాలనుకుంటే మాత్రం ఎంజీ కామెట్‌ ఈవీ మంచి ఆప్షన్. ఐదుగురు ప్రయాణించడానికి తగినంత స్థలం, వేగవంతమైన ఛార్జింగ్, ఒక పరిపూర్ణమైన కారు అనుభూతి కావాలనుకుంటే టాటా టియాగో ఈవీ వైపు మొగ్గు చూపవచ్చు. 

Also Read: 10 లక్షల బడ్జెట్‌లోనే టాప్‌ ADAS ఫీచర్‌ కార్లు! పూర్తి వివరాలు ఇవే!

Frequently Asked Questions

ఎంజీ కామెట్ ఈవీ మరియు టాటా టియాగో ఈవీ ధరల మధ్య తేడా ఏమిటి?

ఎంజీ కామెట్ ఈవీ ప్రారంభ ధర 6.31 లక్షలు కాగా, టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర 7.99 లక్షలు. కామెట్ ఈవీ సుమారు 1.68 లక్షలు తక్కువగా లభిస్తుంది.

ఈ రెండు వాహనాల బ్యాటరీ సామర్థ్యం మరియు ఇంజిన్ పవర్ ఎలా ఉన్నాయి?

ఎంజీ కామెట్ ఈవీ 17.3kWh బ్యాటరీతో 41 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టాటా టియాగో ఈవీ 19.2kWh బ్యాటరీతో 60bhp శక్తిని అందిస్తుంది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఎంజీ కామెట్ ఈవీ మరియు టాటా టియాగో ఈవీ ఎంత దూరం ప్రయాణిస్తాయి?

ఎంజీ కామెట్ ఈవీ 230 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుండగా, టాటా టియాగో ఈవీ 223 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది.

టాటా టియాగో ఈవీలో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉందా?

అవును, టాటా టియాగో ఈవీలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీని ద్వారా కేవలం 58 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చు.

నగర ప్రయాణాలకు ఏ కారు అనుకూలంగా ఉంటుంది?

ఎంజీ కామెట్ ఈవీ దాని చిన్న సైజు మరియు 4.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ వల్ల నగరాల్లో పార్కింగ్ మరియు ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది తక్కువ ధరలో స్మార్ట్ ఈవీగా మంచి ఆప్షన్.

టాప్ హెడ్ లైన్స్

350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి
Tata Aeris CNG కారు కొనొచ్చా, లేదా? ప్లస్‌లు, మైనస్‌లు తెలిస్తే నిర్ణయం ఈజీ
నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?
TVS Apache RTR 160 4V కొనడానికి రూ.25,000 ఉంటే చాలు, మిగిలిన డబ్బును బ్యాంక్‌ లోన్‌గా ఇస్తుంది!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget