అన్వేషించండి

MG Comet EV Price in Vizag: ఎంజీ కామెట్ వైజాగ్‌లో కొనాలి అంటే ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చిన్న ఫ్యామిలీ కోసం తీసుకొచ్చిన ఎంజీ కామెట్‌ ఆకట్టుకుంటోంది. అలాంటి వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నగరాల రద్దీ, ఇంధన ధరల నేపథ్యంలో ఎంజీ కామెట్ ఈవీకి ఆదరణ పెరుగుతోంది.
  • ఇరుకైన సందుల్లో సులభంగా నడపగల పరిమాణం, తక్కువ నిర్వహణ ఖర్చు ఆకర్షిస్తున్నాయి.
  • ఫాస్ట్ ఛార్జర్, బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ వంటి అప్‌డేట్స్‌తో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.
  • 230 కిలోమీటర్ల రేంజ్, ప్రీమియం ఫీచర్లతో పాటు భద్రతా ఏర్పాట్లు కల్పించారు.

MG Comet EV Price 2026 India: భారత్‌లో మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిని ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిని అమితంగా ఆకట్టుకుంటున్న వాహనం ఎంజీ కామెట్‌ ఈవీ. మార్కెట్‌లోకి వస్తూ వస్తూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందీ వాహనం. ఇది కేవలం మెట్రో సిటీలకే కాకుండా మిగతా ప్రాంతాల వారిని కూడా బాగా మెప్పిస్తోంది. అలాంటి అందరికీ ఇష్టమైన ఎంజీ కామెట్ వాహనం విశాఖలో కొనుగోలు చేయాలంటే ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి. ఎంత ఈఎంఐ చెల్లించాలో చూద్దాం. 

సామాన్యులను ఆకట్టుకుంటున్న ఎంజీ కామెట్‌

ఎంజీ కామెట్‌ ప్రధానంగా నగర ప్రయాణాల కోసం రూపొందించింది. దీని సైజ్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది కేవలం 8.4 మీటర్ల టర్నింగ్ సర్కిల్‌ వల్ల ఇరుకైన సందుల్లో కూడా సులభంగా నడపవచ్చు. పార్క్ చేయడం కూడా ఈజీయే. ప్రస్తుతం ఉన్న విద్యుత్ ధరల ప్రకారం రోజూ నడిపిన వారికి నెల నిర్వహణ ఖర్చు కేవలం 519 రూపాయలే. బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లిస్తూ కారు కొనుగోలు ధరను భారీగా తగ్గించుకోవచ్చు. 

Also Read: MG Comet EVకి పోటీగా Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, రేంజ్ పూర్తి వివరాలు

మొదట్లో విడుదలైన ఎంజీ కామెట్‌కు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంజీ కామెట్‌కు చాలా తేడా ఉంది. ప్రజాదరణ చూసిన తయారీదారులు దీన్ని వివిధ విభాగాల్లో అప్‌డేట్ చేస్తూ వస్తున్నారు. వేగంగా ఛార్జింగ్ అయ్యేలా 7.4kW AC ఫాస్ట్ ఛార్జర్‌ను 2024 ఏప్రిల్‌లో పరిచయం చేశారు. కామెట్‌, ZS EV మోడళ్ల కోసం బాస్‌ ప్రోగ్రామ్‌ను 2024 సెప్టెంబర్‌ నాడు ప్రారంభించారు. మరింత స్లైలిష్‌గా ఉండే బ్లాక్‌ స్టార్మ్‌ ఎడిషన్‌ను ఫిబ్రవరి 2025న విడుదల చేశారు. ముడి పదార్ధాల ఖర్చు పెరగడం వల్ల ఏప్రిల్ నుంచి ధరలను స్వల్పంగా పెంచుతున్నట్టు JSW ఎంజీ మోటార్ ప్రకటించింది. 

ఎంజీ కామెట్‌లో ఉన్న స్పెసిఫికేషన్స్‌ ఇవే 

కామెట్‌ ఈవీ ఒక 17.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. బ్యాక్ టైర్స్‌కు అమర్చిన మోటార్‌ 42hp శక్తిని ఇస్తుంది. 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతుంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది సుమారు 193 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. ఇది గంటలకు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 23.87 సెకనుల సమయం తీసుకుంటుంది. 

ఈ కారుకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోవడం లోపంగా భావిస్తున్నారు. 3.3kW ఏసీ ఛార్జర్‌తో సున్నా నుంచి 100 శాతం ఛార్జ్ అవ్వడానికి ఏడు గంటల సమయం పడుతుంది. అదే పనిని 7.4kWఏసీ ఛార్జర్‌తో 3.5 గంటల్లో పూర్తి చేస్తుంది. ఇది రాత్రి పూట ఇంటి వద్ద ఛార్జ్‌ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 

Also Read: కస్టమర్లకి అదిరిపోయే ఇయర్-ఎండ్ ఆఫర్లు! ఆ కార్లు కొంటే లక్షల రూపాయల ఆదా..

చూడటానికి చిన్న కారు అయినప్పటికీ ఇందులో ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. రెండు 10.25 అంగుళాల డిజిటల్ స్క్రీన్లు, వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 6 స్పీకర్లు సౌండ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. ఇందులో 2 ఎయిర్‌ బ్యాగ్‌లు, ఏబీఎస్‌ విత్ ఈబీడీ, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్లు, టైర్‌ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి వసతులు ఉన్నాయి. అయితేదీనికి ఇంకా ఎలాంటి ఎన్ క్యాప్‌ క్రాష్ టెస్ట్ రేటింగ్ రాలేదు. 

కామెట్‌ ఈవీ ప్రస్తుతం ఐదు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్‌, ఎక్సైట్‌ ఎఫ్‌సీ, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్‌ ఎఫ్‌సీ. వీటి బేసిక్ మోడల్ ప్రారంభ ధర 7.50 లక్షలు. టాప్ మోడల్‌ 9.97 లక్షలు. నగరాల వారీగా ఆన్‌రోడ్ ధరలు 7.99 లక్షల నుంచి 10.57 లక్షలు వరకు ఉన్నాయి. 

ఈ వాహనాన్ని విశాఖలో కొనుగోలు చేయాలంటే చెల్లించాల్సిన ఈఎంఐ ఇదే 

మీరు బేసిక్ మోడల్‌ ఎంజీ కామెట్‌ను కొనుగోలు చేయాలంటే మొత్తం డబ్బులను ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు. కొంత సొమ్మును డౌన్‌పేమెంట్ రూపంలో చెల్లించి మిగతా డబ్బులను బ్యాంక్‌ లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తిరిగి నెల నెల ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. విశాఖలో ఈ ఎంజీ కామెట్ బేసిక్ మోడల్ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 8 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మీరు 20 వేలు డౌన్‌పేమెంట్ చెల్లిస్తే మిగతా అమౌంట్‌ను ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు.

Also Read: MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌

7.80 వేల రూపాయలను 9 శాతం వడ్డీకి 7 సంవత్సరాల టెన్యూర్‌కు లోన్ తీసుకుంటే  నెలకు 12,549 రూపాయలు చెల్లించాలి. అదే అమౌంట్‌ను ఆరేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 14,060రూపాయలు చెల్లించాలి. ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే 16,192 రూపాయలు చెల్లించాలి. నాలుగేళ్లకు తీసుకుంటే నెలకు 19,410 ఈఎంఐ చెల్లించాలి. మూడేళ్లకు తీసుకుంటే 24,804  రూపాయలు చెల్లించాలి. రెండేళ్లకు తీసుకుంటే నెలకు రూ. 35,634 బ్యాంకులో జమ చేయాలి. 

ఈ ఈఎంఐ వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. పైన పేర్కొన్నది కేవలం బేసిక్ వేరియంట్‌ కారుకు సంబంధించిందే. మీరు టాప్ ఎండ్ మోడల్ తీసుకుంటే ఈఎంఐ మారిపోతుంది. 

Frequently Asked Questions

ఎంజీ కామెట్ ఈవీలో ఎన్ని వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి?

ఎంజీ కామెట్ ఈవీ ప్రస్తుతం ఐదు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది: ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ FC, ఎక్స్‌క్లూజివ్, మరియు ఎక్స్‌క్లూజివ్ FC.

ఎంజీ కామెట్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది?

కంపెనీ ప్రకారం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అయితే, క్షేత్రస్థాయిలో వినియోగదారులు సుమారు 193 కిలోమీటర్ల మైలేజీని పొందుతున్నట్లు చెబుతున్నారు.

విశాఖలో ఎంజీ కామెట్ బేసిక్ మోడల్ కొనుగోలుకు ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి?

విశాఖలో ఎంజీ కామెట్ బేసిక్ మోడల్ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ సుమారు 8 లక్షలు ఉంటుంది. దీనికి కనీసం 20 వేల రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని లోన్‌గా తీసుకోవచ్చు.

ఎంజీ కామెట్ ఈవీని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

3.3kW ఏసీ ఛార్జర్‌తో సున్నా నుండి 100 శాతం ఛార్జ్ అవ్వడానికి ఏడు గంటలు పడుతుంది. 7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే ఈ సమయం 3.5 గంటలకు తగ్గుతుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?
సిటీలో డైలీ డ్రైవింగ్‌ కోసం కారు కొనడం మంచిదా? రోజూ క్యాబ్‌ బుక్‌ చేసుకోవడమే బెటరా?
Royal Enfield Himalayan 440: లాంచ్‌ అయిన నెలకే భారీ డిమాండ్‌.. 6 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌, బుకింగ్స్‌ నిలిపివేత
ఈ బైక్‌ కొంటే ఇంటికి తీసుకెళ్లడానికి ఆరు నెలలు ఆగాలట! రష్‌ తట్టుకోలేక బుకింగ్స్‌ కూడా బంద్‌
ఖరీదైన కార్లకే కాదు.. తక్కువ ధర కార్లలోనూ ADAS సేఫ్టీ ఫీచర్లు! సుజుకి కొత్త ప్లాన్ ఇదే
సామాన్యుల కార్లలోనూ ADAS సేఫ్టీ.. సుజుకి కీలక నిర్ణయం, ఖర్చు తగ్గించే టెక్నాలజీపై ఫోకస్‌
కొత్త కారు కొనడానికి మీ బడ్జెట్‌ రూ.6 లక్షల లోపే ఉందా? అయినా పర్లేదు, ఎన్నో ఆప్షన్లు
రూ.6 లక్షల లోపులోనే కొనగలిగే 11 కార్లు.. ఈ దసరాకి కొత్త కారు మీ ఇంటికొస్తుంది!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilsukhnagar Santoshimatha Temple: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
ED Notices To YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
Kalvakuntla Kavitha : ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ - టీఆర్‌ఎస్ పోటీతో మారనున్న ఉపఎన్నిక సమీకరణాలు - బీఆర్ఎస్‌కే నష్టమా?
ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ - టీఆర్‌ఎస్ పోటీతో మారనున్న ఉపఎన్నిక సమీకరణాలు - బీఆర్ఎస్‌కే నష్టమా?
Telangana Graduate MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ ముందడుగు.. బీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి?
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ ముందడుగు.. బీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి?
Hyderabad Metro and RTC Joint Pass: హైదరాబాద్‌లో మెట్రో- ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ వచ్చేసింది.. ధరల పూర్తి వివరాలు
హైదరాబాద్‌లో మెట్రో- ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ వచ్చేసింది.. ధరల పూర్తి వివరాలు
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Embed widget