అన్వేషించండి

MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌

మార్చి 2026లో ఎంజీ కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. గ్లోస్టర్‌పై రూ.4 లక్షల వరకు, ZS EVపై రూ.1.4 లక్షల వరకు, విండ్సర్ EVపై రూ.70 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

MG Cars Offers March 2026: ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన ఆటోమొబైల్ బ్రాండ్ MG Motor India, తన కార్లపై ఈ నెల (మార్చి 2026) ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ, తన లైనప్‌లోని చాలా కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఆఫర్లు అందిస్తున్న MG కార్లు ఇవే:

MG Gloster - రూ.4 లక్షల వరకు ప్రయోజనాలు

ఎంజీ బ్రాండ్‌లో గత ఫ్లాగ్‌షిప్ SUV అయిన MG Gloster పై ఈ నెలలో (మార్చి 2026) భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేసే వారికి గరిష్టంగా రూ.4 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ.3.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ & రూ.50 వేల ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి.

ఈ SUVలో రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి, అవి - 161 హెచ్‌పీ 2.0 లీటర్ టర్బో డీజిల్ & 215 హెచ్‌పీ 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్.

భారత మార్కెట్లో దీని ధర రూ.38.33 లక్షల నుంచి రూ.43.16 లక్షల వరకు ఉంది. ఇది టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, వోల్క్స్‌వ్యాగన్ టయ్రాన్, జీప్ మెరిడియన్ వంటి SUVలకు పోటీగా ఉంటుంది.

MG ZS EV - రూ.1.4 లక్షల వరకు ఆఫర్

ఎలక్ట్రిక్ SUV అయిన MG ZS EV పై కూడా ఈ నెల మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. మొత్తం రూ.1.4 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

రూ.1 లక్ష క్యాష్ డిస్కౌంట్

రూ.20 వేల లాయల్టీ బోనస్

రూ.20 వేల కార్పొరేట్ ఆఫర్

ఈ EVలో 50.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి రూ.20.49 లక్షల వరకు ఉంది.

MG Astor - రూ.85 వేల వరకు లాభం

పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే MG Astor పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ SUVపై గరిష్టంగా రూ.85 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

రూ.25 వేల క్యాష్ డిస్కౌంట్

రూ.20 వేల ఎక్స్చేంజ్ బోనస్

రూ.20 వేల లాయల్టీ బోనస్

రూ.20 వేల కార్పొరేట్ ఆఫర్

ఈ SUVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (110hp) ఉంటుంది. మాన్యువల్ & CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. దీని ధర రూ.9.79 లక్షల నుంచి రూ.15.3 లక్షల వరకు ఉంటుంది.

MG Windsor EV - రూ.70 వేల వరకు ఆఫర్లు

భారత మార్కెట్లో మంచి విక్రయాలు సాధించిన MG Windsor EV పై కూడా ఈ నెల ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. మొత్తం రూ.70 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్

రూ.20 వేల ఎక్స్చేంజ్ బోనస్

రూ.20 వేల లాయల్టీ బోనస్

రూ.10 వేల కార్పొరేట్ ఆఫర్

ఈ EVలో 38kWh & 52.9kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి. ఈ కారు, కంపెనీ లెక్క ప్రకారం, గరిష్టంగా 440 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.13.99 లక్షల నుంచి రూ.18.49 లక్షల వరకు ఉంది.

MG Comet EV - రూ.60 వేల వరకు ప్రయోజనాలు

ఎంజీ కంపెనీకి చెందిన అత్యంత చౌకైన మోడల్ MG Comet EV. ఈ కారు కొనుగోలు చేస్తే రూ.60 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

దక్షిణ భారత రాష్ట్రాల్లో అయితే క్యాష్ డిస్కౌంట్ ఎక్కువగా ఉండటంతో మొత్తం రూ.85 వేల వరకు ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

ఈ చిన్న EVలో 17.3kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.7.62 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంది.

MG Hector - పరిమిత ఆఫర్

ఇతర మోడళ్లతో పోలిస్తే MG Hector పై మాత్రం పెద్దగా డిస్కౌంట్ లేదు. ప్రస్తుతం కేవలం రూ.20 వేల కార్పొరేట్ ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ SUVలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (143hp) ఉంటుంది. 5, 6, 7 సీటర్ ఎంపికల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.11.99 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉంది.

గమనిక:  పైన చెప్పిన ప్రయోజనాలు నగరాన్ని బట్టి మారవచ్చు. అలాగే స్టాక్ లభ్యతపై కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం సమీప డీలర్‌ను సంప్రదించడం మంచిది. M9 & Cyberster మోడళ్లకు మాత్రం ఈ ఆఫర్లు వర్తించవు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget