అన్వేషించండి

Discount On Cars: కస్టమర్లకి అదిరిపోయే ఇయర్-ఎండ్ ఆఫర్లు! ఆ కార్లు కొంటే లక్షల రూపాయల ఆదా..

ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఎంజీ మోటార్స్ తన కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. గ్లోస్టర్, హెక్టర్ వంటి మోడళ్లపై లక్షలాది రూపాయల ప్రయోజనాలు లభిస్తున్నాయి.

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీ డిస్కౌంట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇయర్-ఎండ్ సేల్స్‌ను పెంచడమే లక్ష్యంగా తన పోర్ట్‌ఫోలియోలోని దాదాపు అన్ని కార్లపై రకరకాల బెనిఫిట్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై (EV) ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఈ కంపెనీ, క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులతో పాటు కార్పొరేట్ బెనిఫిట్స్‌ను కూడా అందిస్తోంది. బడ్జెట్ ఈవీల నుండి ప్రీమియం ఎస్‌యూవీల వరకు అన్ని సెగ్మెంట్లలో ఈ తగ్గింపులు వర్తిస్తాయి. ఈ నెలలో ఎంజీ గ్లోస్టర్ కొనేవారికి భారీ ఊరట లభిస్తుంది. అన్ని వేరియంట్లపై నేరుగా రూ. 3.5 లక్షల రిటైల్ బెనిఫిట్ లభిస్తోంది. దీనికి తోడు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలుపుకుంటే మొత్తం రూ. 3.7 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఫుల్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం ఇదే అత్యుత్తమ డీల్ అని చెప్పవచ్చు.

లక్షల్లో పొదుపు
ఎంజీ లైనప్‌లో కీలకమైన హెక్టర్ మోడల్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ. 1.05 లక్షల వరకు రిటైల్ డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లు కలుపుకుంటే మొత్తం ప్రయోజనం రూ. 1.45 లక్షల వరకు ఉంటుంది. సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ హెక్టర్ డీజిల్ మాన్యువల్ వేరియంట్లపై రూ. 50,000 ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అన్ని బెనిఫిట్స్ కలిపి దాదాపు రూ. 90,000 కంటే ఎక్కువ ఆదా అవుతుంది.

వాల్యూ డీల్
బేస్ ట్రిమ్ మినహా ఆస్టర్ మిగిలిన అన్ని వేరియంట్లపై రూ. 20,000 రిటైల్ ఇన్సెంటివ్ అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌లతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్లు కలిపితే మొత్తం రూ. 65,000 వరకు లాభం చేకూరుతుంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.

ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లు
ఈవీ రంగంలో తమ పట్టును నిరూపించుకుంటున్న జెడ్ఎస్ ఈవీ (ZS EV) పై అన్ని వేరియంట్లలో రూ. 20,000 రిటైల్ బెనిఫిట్ ఉంది. ఇతర బోనస్ ఆఫర్లతో కలిపి మొత్తం రూ. 60,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇక చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ (Comet EV) పై వేరియంట్‌ను బట్టి రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు తగ్గింపు ఉంది. లాయల్టీ, కార్పొరేట్ బెనిఫిట్స్ కలిపితే దీనిపై రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు. కొత్త కారు కొనే ప్లాన్ ఉంటే మార్చి నెలలో ఎంజీ షోరూమ్‌ను సందర్శించడం లాభదాయకమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!
అతి పెద్ద విమానాన్ని లాక్కెళ్లిన BYD కారు.. అది కూడా కేవలం టైర్ల మీద!
Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget